పాటతో పరమార్ధం- కదలిరండి మనుషులైతే - ఊరికి మొనగాడు - కృష్ణ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,798; 104 తత్వాలు (Tatvaalu) and views 224,985.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ooruki Monagadu - Kadilirandi Manushulaithe - Krishna, Jaya Prada

ఈ వారంలోనే ఘోర రైలు ప్రమాదం విన్నాము, ఒరిస్సాలో. అది మానవ తప్పిదము కానీ, ఇంకోటి గానీ, ఆ పోయినా ప్రాణాలు వెనక్కి రావు. భాగస్వామి, పిల్లలు, తల్లి దండ్రులను కోల్పోయిన వారిని ఓదార్చలేము. చేతనైనంత సహాయం చేద్దాము, కనీసం మాట ఓదార్పు సహాయమైనా.

ఇలాంటి ప్రమాదాలకు, మూలం మనమే అవుతున్నాము, పెరుగుట విరుగుట కొరకే అని, మన అజాగ్రత్త మత్తు నిర్లక్ష్యం బద్దకం కక్షలు పగ అహంకారం ఆధిపత్యం స్వార్ధం, నష్టపోతున్నది కూడా మనలోనే ఒకరు, ఈ రోజు వారు, రేపు మనము.

ప్రమాదం అంటే, ఎక్కడో బయట కాదు, మన ఇళ్ళలో కూడా ఉంది - అత్తను కాల్చిన కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళను కాల్చిన అత్తలూ, భాగస్వామిని/ పిల్లలనూ రాచి రంపాన పెడుతున్న భాగస్వాములూ ఉన్నారు.

రైలు ప్రమాదం అయినా, భూకంపం అయినా, తుఫాన్ వరదలు అయినా, మానవత్వం మనలో మేల్కొలపడానికే ఈ పాట మాటలు. మరి మనలో ఎంత మంది మనుషులము ఉన్నామో, ఎంత వరకు మన మనసులు స్పందిస్తాయో, మీకు మాకు 5 ఏళ్ళుగా తెలుసు. 20 ఏళ్ళుగా మనము ఎన్నుకున్న నాయకుల ప్రత్యక్ష సాక్ష్యం ఎటూ ఉంది.

ఒక మంచిని మంచి గా, చెడు ని చెడుగా, తమ ముదుసలి తల్లి దండుల సేవను అలాగే తమ పిల్లల సంస్కార పెంపకమును, బయటకు చెప్పుకోలేని మనము, దేవుని క్రుపకు పాత్రులము అవుతామా? తోటి మనిషిపై జాలి చూపిస్తామా? అరిషడ్వర్గ అష్టవ్యసనమును వీడతామా?

అమ్మా అని అలమటించు, బిడ్డకేమి తెలుసు? అమ్మ ఇంక రాదని, అమ్మనేది లేదని. బిడ్డ కొరకు తల్లడిల్లు, తల్లి కేమి తెలుసు? ఆ తల్లి కెవరు చూపిస్తారు? తన పక్కనే ఉన్న బిడ్డ శవాన్ని. ఆ కన్నీళ్ళు ఎవరు తుడవగలరు? ఆ లోటు ఎవరు పూడ్చ గలరు?

కౌగిట్లో కనుమూసిన ఆలుమగలు వీళ్లు. కళ్ళే కనిపించకా, తన వాళ్ల పిలుపు వినిపించకా,
చావు కొరకు, ఒంటరిగా బతుకుతున్న, ముసలి వాళ్ళు? ఎవరు చూపిస్తారు వీరిపై జాలి?

మనకు ఆ జాలి ఉంటే, మన తల్లి దండ్రులు అనాధాశ్రమాలు లో లేదా ఇంట్లో ఒంటరి వారు గా, ఎందుకు ఎక్కువౌతున్నారు, మన లాంటి పశువులను కని పెంచినందుకా? ఇంక సమాజానికి ఏమి ఉపయోగము మనతో?

కదలిరండి మనుషులైతే, కలిసిరండి మమత వుంటే, ఉప్పెనలా, ఉమ్మడిగా, అరిషడ్వర్గ అష్టవ్యసనమును కఠిన సాధనతో వీడదాము, భవిష్యత్ పంచభూతాల శిక్షలను తప్పించుకుందాము.

కదలిరండి మనుషులైతే.., కలిసిరండి మమత వుంటే ..
ఉప్పెనలా.., ఉమ్మడిగా.., 2
దివి తుఫాను, బలి కోరిన, దీనుల కోసం
బతకలేని, చావలేని, ప్రాణుల కోసం

చెలియలి కట్టను తెంచి., చెలిమిని మరచి..,
కడలి అనే, కాలనా.గు కా.టే.సింది..
తా.డి ఎత్తు తరగలు, తన పడగలుగా...
మమతల మాగాణమే, మసి అయిపోగా..
తెలుగు తల్లి విలపించెను, భోరు భోరునా.. 2
పొంగే., కన్నీరే., క్రిష్ణా. గో.దావరిలా .. ||కదలిరండి మనుషులైతే||

అమ్మా. అని అలమటించు, బిడ్డకేమి తెలుసు..
అమ్మ ఇంక రాదని.., అమ్మనేది లే.ద.ని..
బిడ్డ కొరకు తల్లడిల్లు, తల్లి కేమి తెలుసు..
ఆ. తల్లి కెవరు చూపిస్తారు..,
తన పక్కనే.. ఉన్న బిడ్డ శవాన్ని

కౌగిట్లో కనుమూసిన ఆ.లుమగలు వీళ్లు ..
కళ్ళే కనిపించకా.., తన వాళ్ల పిలుపు వినిపించకా..,
చావు కొరకు, ఒంటరిగా బతుకుతున్న, ముసలి వాళ్ళు

తెలుగుతల్లి, సిరిమువ్వల, కంఠాహారమే..
హతశిశువుల, మృత పశువుల, అగ్రహారమై పో.యెను.. - 2 ||కదలిరండి మనుషులైతే||

ఊరికి మొనగాడు; కృష్ణ, జయప్రద; నంగీతం : చక్రవర్తి; పాడినవారు: ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం;  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,798; 104 తత్వాలు (Tatvaalu) and views 224,985
Dt : 04-Jun-2023, Upd Dt : 04-Jun-2023, Category : Songs
Views : 261 ( + More Social Media views ), Id : 1773 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ooruki , Monagadu , Kadilirandi , Manushulaithe , Krishna , Jaya , Prada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content