పాటతో పరమార్ధం - ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు - ఈనాటి బంధం ఏనాటిదో - కృష్ణ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,997; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Evaru Nerperamma - Eenati Bandham Yenatido - Krishna, Jayaprada

భగవంతుని లీలలు చూడండి, తన సేవకులను తానే ఎంచుకుంటారు, తగిన జ్ఞానం ఇస్తారు సాధనతో, అవి దేవుని సంతానం కు ఉపయోగ పడాలి, ముందు సొంత ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు సేవలు ఉండాలి. చిత్త శుద్ది లేని శివ పూజలు చెల్లవు కాణీకి కూడా.

ఎవరు నేర్పేరమ్మ ఈ పూల చెట్ట్ల కొమ్మలకు, పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు? పోనీ ఒక్కటైనా తనకోసం తాను వాడుకుంటుందా? ప్రజల కు ఉపయోగం లేదా, దైవ పాద పూజకు వినియోగం, చిత్తశుద్ది తో సేవ కదా? హరి పాదాల చెంత చేరాలని, ఆ పువ్వు కు కూడా ఎంత తొందరో, ప్రొద్దు పొడవకముందే పూలిదిగో అని, రెడీ గా ఉన్నది కదూ?

ఎవరు నేర్పాలి, మనకు చదువు తో సంస్కారము? మొదటగా తల్లి దండ్రులు, ఆ కలుపు మొక్కలు లాంటి చెడు భావాలు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం పిల్లల మదిలోకి చేరకుండా, చిన్నప్పటి నుంచే, మానసిక బలం తర్ఫీదు ఇవ్వాలి.

అలా మానసిక బలం పెంచితే, ఈ రోజు ముదుసలి తల్లి దండ్రులు ఒంటరిగా లేదా ఆశ్రమాలలో, అందరూ ఉండి దిక్కు లేని వారిగా, కన్నీరు మున్నీరు గా వగచుచూ ఉండరు.

ఒకవేళ పూర్తిగా బిడ్డలదే తప్పు అయితే, వారికి ఏళ్ళు గా దూరంగా ఉంటూ, వారి తప్పులు అందరికీ చెప్పి, ఆస్తులు పాస్తులు పుణ్యకార్యాలకు పుణ్యాత్ములకు ధారాదత్తం చేస్తారు నిస్వార్ధంగా. అంతే గానీ, భస్మాసురులకు ఇచ్చి, ఇంకా బలవంతులుగా చేసి, కలియుగ పాపాన్ని పెంచరు.

పెద్దలు దే తప్పు అయితే మాత్రం, తాము జీవితం లో చేసిన పాపాలను, తమ పిల్లల పాపాల భాగ ఫలితాలను కూడా తామే మోస్తూ, దేవుని దగ్గరకు తలవంచుకుని వెళుతున్నారు. వచ్చే జన్మ మానవులుగా నో, దానవులు గానో, జంతువులు కీటకాలు పక్షులు పశువులు జలచరాల గానో, మనకే తెలీదు. అది ఈ జన్మలో మనము నటించిన కపట వేషాలు 2 నాల్కల ధోరణి మోసం కుట్రం ద్రోహాలను బట్టి ఉంటుంది కదా.

చల్లని తల్లి తులసమ్మా, మా ఇంటిలో కొలువైతివా దేవి మా కోసము, తులసీ దయా పూర్ణ కలశీ, ఆరోగ్య ప్రదాయనీ. మల్లెలివి మా తల్లి, వరలక్ష్మికి, మొల్లలివి మమ్మేలు మా స్వామికి అంటూ వేడుకోవాలి.

ఏ లీల సేవింతు, ఏమనుతు కీర్తింతు. మా రామ మరియు సీత ఆచరణ గుణాల మనసే మీకు సింహాసనం దేవా. ఒక పువ్వు పాదాల, ఒక దివ్వె నీ మ్రోల, ఒదిగి మీ ఎదుట, ఇదే వందనం అనాలి.

అన్ని మనకు ఇచ్చిన దేవునికి ఏమివ్వ గలము? మన మనసు చిత్తశుద్దిగా ఆయన యందు లగ్నమై ఉన్నదని, నిత్యము మన చేతలలో నిరూపించి అదే నైవేద్యముగా ఇవ్వాలి, ఎవ్వరూ ఇవ్వలేని విధముగా, కదా. మరి మన నైవేద్యాలు ఏమిటి, ఆ దేవ దేవునకు, అప్పుతో పప్పు కూడు తినలేని, మానసిక బల మధ్య తరగతి సామాన్య, సొంత అప్పు ఇల్లు లేని, మంది మార్బలం లేని వారుగా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడటం తప్ప?

78+ ఏళ్ళ కన్నతల్లికి సేవ చేసే భాగ్యం ఎంత మందికి దొరుకుతుంది? రోజు మందులు వేయడం, తిన్న పళ్ళెం కడగడం, సాక్సు బూట్లు వేసి 1 మైలు తిప్పడం, మనవెంట అన్ని షాపులకు దేవాలయాలకు, అన్ని చోట్లకు వాహనములో తిప్పడం, ఎన్నో ఎన్నో.. ఇదంతా దేవుని చలవ కాదా, కోటి మంది లో ఒకరి గా నిలపడానికి, ఇతర తల్లి దండ్రులు కూడా తమ బిడ్డలు ఇలా చేయాలని సంస్కారం నేర్పుతారు కదా, చిన్నప్పుడే?

1900+ పైగా వ్రాత కధనాలు, 800 పైగా సామాజిక ఈవెంట్ల/ప్రదేశాల కవరేజ్, 500+ పైగా గొంతు పాటలు మరియు 10+ ఏళ్ళ సజీవ గురువు సేవలు/ నైవేద్యాలు, 216+ వారాల 108 ప్రదక్షణలు, 20+ ఏళ్ళ శాఖాహారం చాప నిద్ర యోగా ధ్యానం, ఇంకా ఎన్నో ఎన్నో . . . మరి మీ కుటుంబ సభ్యల చిత్తశుద్ది ఉదాహరణలు పంచుకుంటారు కదూ?

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు., పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు. 2
ఎంత తొందరలే హరి పూజకు. , ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ. ||ఎవరు నేర్పేరమ్మ||

కొలువైతివా దేవి నా కోసము 2 తులసీ.. తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి, వరలక్ష్మికి .., ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 2
మొల్లలివి, నన్నేలు నా స్వామికి... ||ఎవరు నేర్పేరమ్మ||

ఏ లీల సేవింతు.., ఏమనుతు కీర్తింతు.. 2
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల, ఒక దివ్వె నీ మ్రోల 2
ఒదిగి నీ ఎదుట, ఇదే వందనం.. ఇదే వందనం ...

ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్...

చిత్రం : ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977); సంగీతం : ఎస్. రాజేశ్వరరావు; రచన : దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం : పి.సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,997; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377
Dt : 22-Feb-2024, Upd Dt : 22-Feb-2024, Category : Songs
Views : 136 ( + More Social Media views ), Id : 2031 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Evaru , Nerperamma , Eenati , Bandham , Yenatido , Krishna , Jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content