పాటతో పరమార్ధం - సిరిమల్లె పువ్వా(భక్తి పేరడీ) - పదహారేళ్ళ వయసు - చంద్ర మోహన్, మోహన్ బాబు, శ్రీదేవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2078 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2113 General Articles and views 1,871,215; 104 తత్వాలు (Tatvaalu) and views 225,367.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sirimallepoovaa (Bhakti Parody) - Padaharella Vayasu - Chandra Mohan, Mohan Babu, Sridevi

ఈ పాటలో కూడా, మనము మనసును బుజ్జగించడం నేర్చుకుందాము. పాటతో మనసు స్పందిస్తుంది, మాటలకన్నా. శ్వాస మరియు వాయు నియంత్రణ జరుగుతుంది. మానసిక బలం పెంచడానికి, మనసు నియంత్రించడానికి ఇది ఒక సాధన మెట్టు.

సిరిమల్లె పువ్వు లాంటి, ఓ సహన ఓర్పు త్యాగాల జీవా, చిన్నారి మానసిక ఆలోచనలు పసిగట్టి, గట్టిగా చెప్పు. మా సాధన కు మూలం ఆది శక్తి అని, సర్వకాల సర్వావస్తలయందు మాతోడూ శివం శంకరం అని, అది ఎన్ని జన్మల కైనా అని.

ప్రతి రోజు తెల్లారబోతుంటే, ఆ పరమాత్మ మా కల్లోకి వస్తారే, ఇదే బ్రహ్మ ముహూర్తం, ధ్యానానికి మంచి సమయం అని. కానీ దైవాన్ని కళ్లారా చూద్దామంటే, ప్రాపంచిక మా యల్లో ఉంటామే, అయ్యో. ఆ అంతరాత్మ, మా చిరకాల ముక్తి మోక్షం, కాదనగలమా? రోజు, ఈ సందెకాడ, మా దైవధ్యానం, సాగేను. కనుక ఓ ఆత్మబంధువులారా, దైవ సంతాన జీవుల్లారా, ప్రాపంచిక మోహ బ్రమలన్ని దాటి, ముక్తెన్నాళ్ళ కొస్తాదో అని ఆలోచనలు చెయ్యండి. త్వరపడండి, రోగాలతో లేదా వయసుడిగి, కాళ్ళు చేతులు కదలనప్పుడు, ధ్యానం జపం చేయలేము, భక్తి రాగాలు తీయలేము.

నిత్య జపాల్లో తపాల్లో, మనసారా చిత్తశుద్ది తో తరించే ఓ జీవుడా, ఈ ప్రక్రుతి మాత ఇచ్చిన పూలతో పూజల్లో, మురిసేటి ఓ మనసా, ఆలోచన చెయ్యి. మన మనసంతా దైవ తలపై, మన మనసే ఆధ్యాత్మిక మైమరపై, సాగేనే నిత్యం. పగలంతా దైవ నామ జపము, రేయంతా దైవ ధ్యానం, నిత్యం దైవ స్మరణే. కనుక ఓ ఆత్మబంధువులారా, దైవ సంతాన జీవుల్లారా, ప్రాపంచిక మోహ బ్రమలన్ని దాటి, ముక్తెన్నాళ్ళ కొస్తాదో అని ఆలోచనలు చెయ్యండి.

* * *
Parody

సిరిమల్లె పువ్వా.., త్యాగాల జీవా.., చిన్నారి మానసికమా..
మా సాధన శక్తి, మాతోడూ శివం, ఎన్నిజన్మలకైనా.. 2 |సిరిమల్లె పువ్వా|

తెల్లారబోతుంటే.., మా కల్లోకి వస్తారే..
కళ్లారా చూద్దామంటే.., మా యల్లో ఉంటామే..
ఆ అంతరాత్మ, మా ముక్తి మోక్షం, కా.దే.
ఈ సందెకాడ, మా దైవధ్యానం, సా.గే.
జీవుల్లారా, బ్రమలన్ని దాటి, ముక్తెన్నాళ్ళ కొస్తా.దో. |సిరిమల్లె పువ్వా|

జపాల్లో తపాల్లో.., తరించే ఓ జీవుడా
ఈ పూల పూజల్లో.., మురిసేటి ఓ మనసా..
మనసంతా తలపై, మనసే మైమరపై, సాగేనే.
పగలంతా జపము, రేయంతా ధ్యానం, స్మరణే.
జీవుల్లారా, బ్రమలన్ని దాటి, ముక్తెన్నాళ్ళ కొస్తా.దో. |సిరిమల్లె పువ్వా|

Original

సిరిమల్లె పువ్వా.., సిరిమల్లె పువ్వా.., చిన్నారి చిలకమ్మా..
నా వాడు ఎవరే, నాతోడూ ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే.. 2 |సిరిమల్లె పువ్వా|

తెల్లారబోతుంటే.., నా కల్లోకి వస్తాడే..
కళ్లారా చూద్దామంటే.., నా కళ్ళు మూస్తాడే..
ఆ అందగాడు, నా ఈడు జోడు, ఏ.డే.
ఈ సందెకాడ, నా చందమామ, రా.డే.
చుక్కల్లారా, దిక్కులు దాటి, వా.డెన్నాళ్ళ కొస్తా.డో. |సిరిమల్లె పువ్వా|

కొండల్లో కోనల్లో.., కూయన్న ఓ కోయిలా..
ఈ పూల వానల్లో.., ఝుమ్మన్న ఓ తుమ్మెదా..
వయసంతా వలపై, మనసే మైమరపై, ఊగేనే.
పగలంతా దిగులు, రేయంతా వగలు, రేగేనే.
చుక్కల్లారా, దిక్కులు దాటి, వా.డెన్నాళ్ళ కొస్తా.డో. |సిరిమల్లె పువ్వా|  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2113 General Articles and views 1,871,215; 104 తత్వాలు (Tatvaalu) and views 225,367
Dt : 28-Feb-2024, Upd Dt : 28-Feb-2024, Category : Songs
Views : 107 ( + More Social Media views ), Id : 2040 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sirimallepoovaa , Sirimallepuvvaa , Bhakti , Parody , Padaharella , Vayasu , Chandra , Mohan , Mohan , Babu , Sridevi , janaki
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content