సిరి సిరి మువ్వ - మా వూరి దేవుడమ్మా, రాముడే దేముడైన, రామాయణమే మా కధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,054; 104 తత్వాలు (Tatvaalu) and views 225,020.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన ఊళ్ళో కూడా, రాముల వారి పండుగ లేదా ఇంకో పండుగ అయినా, రధోత్సవం చేస్తూ బ్రహ్మాండముగా ఊరేగింపు జాతర చేసేవారు ఆనాడు. మరి ఇప్పుడు, అంత కోలాహాలముగా ఉన్నాయా, మన పిల్లలు చూస్తున్నారా, ఆ అనుభూతి పొందగలరా?

ఆ భక్తి శ్రద్దలు, ఊరి జనాల సేవ చేయడం ఇప్పుడు మనకు వస్తుందా? ఉద్యోగాల వేటలో ధన సంపాదనలో, ఉచిత అసలు ఆనందాన్ని వదిలేసి, ధనముతో తాత్కాలిక ఆనందం సంతోషం గౌరవం కొనుక్కుంటున్నాము.

చక్కగా రధోత్సవం జరుపుచూ, తమ భక్తిని చాటుకుంటున్నారు, సినిమా ఐతేనేమి, చూడండి కమ్మటి పాట, మీరూ పాడండి. మంచిని తలచినా, పిల్లలకు నేర్పించినా, అది మరలా మన ముదుసలి తనములో మనకే ఉపయోగపడుతుంది సుమా. తల్లి దండ్రులకే అండ లేని సంస్కారం వలన, ఎవరికి ఉపయోగం? దేవునితో బంధం ఎలా ఏర్పడుతుంది?

పరమాత్మ, నీ భజనకు పిలిచితే, బద్దకమని పలికేరు, స్వయం గోతిలో మునిగేరు. చర్మపు తిత్తులే, శాశ్వత మనుకొని, చంచల మతులయ్యేరు అంటూ, మన బుద్దులను ఆనాడే స్పష్టముగా తెలియ చెప్పారు.

ఒక మాట, ఒక బాణం, అన్నాడు. ఒక సీతమ్మనే ఏలుకున్నాడు. మడేలోడి మాటైనా మన్నించాడూ అని మనలోని అహంకారాన్ని ప్రశ్నించారు. మనము ఎవరి మాట వినము కదా? 2 నాల్కలు అసలు వీడలేము.

సీతమ్మప్పో హనుమంతప్పా అంటూ హుషారుగా దేవుళ్ళ పేరు చెప్పినా, మన ఇరుగు పొరుగుతో ఉండే, బంధాలను గుర్తు చేసారు.

మా ఆడపడుచులు, మా తల్లులు సీతమ్మలు. మగసిరిగల దొరలంతా, మా తండ్రులు రామయ్యలు. లేదు రావణబాధ, రాదు మాకు ఏకొరత, రాముడే దేముడైన, రామాయణమే మా కధ. అంటూ ఆనాటి మన మంచి మనుషులను మనకు గుర్తుకు తెచ్చారు.

ఊరేగినా వాడే.., ఊరేలినా వాడే...
ఊరూ పేరున్న వాడు, ఉన్నవా.డూ. వాడే..

మా వూరి దేవుడమ్మా..
చల్లంగ మమ్మేలు రాముడమ్మా..||మావూరి||
మా వాడ వెలసినాడు, మా వారి గాంచినాడు 2
మహి లోపల దేముడై, మహిమలెన్నో చూపినాడు ||మా వూరి||

మహాప్రభో, నీ, మహిమ తెలియగా, మానవు లెంతటివారు 2
పరమాత్మ.. నీ భజనకు పిలిచితే, బద్దకమని పలికేరు
చర్మపు తిత్తులే, శాశ్వత మనుకొని 2
చంచల మతులయ్యే..రు..
హరి ... హరిలో రంగ హరి ... వైకుంఠ వాసా హరి...
హరిలో రంగ హరి హరి హరి హరి హరి

ఒక మాట, ఒక బాణం, అన్నాడు
ఒక సీతమ్మనే., ఏ.లుకున్నాడు ||ఒక మాట||
మడేలోడి మాటైనా మన్నించాడూ 2
అడవికంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు ||మావూరి||

ఓ హొయ్ రాములు , సా హొయ్ సాములు ||ఓహొయ్||

పడతా పడతా నేను, పప్పుదాకలోపడతా
పడతా పడతా నేను , పాతర గోతిలో పడతా

సీతమ్మప్పో... హనుమంతప్పా
హనుమంతప్పో...సీతమ్మప్పా2

ఓ హోయ్ రాములు, సా హోయ్ సాములు

మా ఆడపడుచులు, మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా, మా తండ్రులు రామయ్యలు|| మాఆడ||
లేదు రావణబాధ, రాదు మాకు ఏకొరత||2||
రాముడే దేముడైన, రామాయణమే మా కధ || మావూరి||

Siri Siri Muvva - Maa Voori Devudamma - JayaPrada, ChandraMohan  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,054; 104 తత్వాలు (Tatvaalu) and views 225,020
Dt : 20-Dec-2022, Upd Dt : 20-Dec-2022, Category : Songs
Views : 453 ( + More Social Media views ), Id : 1660 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : siri , muvva , maa , voori , devudamma , jayaprada , chandramohan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content