APLatestNews.com top Banner

Social Media links
షెనాండో లోయ జాతీయ ఉద్యానవనం - అందమైన కొండ లోయల ప్రక్రుతి అందాలు - America/ NRI
           
     
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ కి దగ్గర లో, అంటే గంట లోపు, ఉన్న అందమైన కొండ లోయల ప్రాంత పార్కు. ఇది వర్జీనియా రాష్ట్రములో ఉంది. అందులో నడవడానికి ఎక్కటానికి చక్కటి ట్రైల్స్ మరియు నీటి మడుగులు జలపాతాలు, ఇంకా ఎన్నో సహజ ప్రక్రుతి సోయగాలు సౌందర్యాలు ఉంటాయి.

స్కైలైన్ డ్రైవ్, 105-మైళ్ళ రోడ్, అనే, ఘాటు రోడ్డు న వెళుతూంటే, ప్రకృతి రమణీయత, ఓహో చూసి ఆనందించాలి అంతే. మన అరకు లోయ, తిరుపతి లోయ లు లాగా అన్నమాట.

అలా ఇంకా దూరం వెళితే షుమారు గంట, బ్లూరిడ్జ్ పార్క్ వే అనే ఘాటు రోడ్డు, 469 మైళ్ళ రోడ్ ఇది, కొండల మీదుగా, రోనోకే, బూనే , ఆష్విల్లి దాటి చెరోకీ దగ్గర అంతము అవుతుంది, నార్త్ కెరోలినా రాష్ట్రములో. అలా రోనోకే(Roanoke, va) అనే ఊరు దాకా కొంతమంది వెళతారు. కారు కు మాత్రమే ఫీజ్, అంటే ఐదు మంది ఉన్నా ఒక కారు లెక్కే. జాగ్రత్తగా వెళ్ళాలి.

వారమంతా పనిలో అలసిపోయి అందరికి దూరముగా, కుటుంబముతో లేదా స్నేహితులతో కలసి ప్రక్రుతిలో విహరించాలి, అనుకునేవారికి ఇది అనువైన చోటు.

అక్కడక్కడ ఆగి సేద తీరేందుకు పిక్నిక్ ఏరియా మరియు వసతులు ఉంటాయి, మాప్ లో వివరముగా బొమ్మలో ఇస్తారు. అక్కడ బల్లలు, కాంటీన్, మరుగుదొడ్లు ఉంటాయి. ఒక వైపు లోయ ఒక వైపు ప్రక్రుతి అందాలు, మెలికల రోడ్డు, ఎదురు వచ్చే వాహనాలు, జాగ్రత్తలు మరి. కనీసము చూడాలి ఒక్క సారైనా.

వసంత కాలం లో తప్పక మరలా చూడాలి. కొత్త ఆకులు వచ్చి, ఎంతో అందముగా రమణీయముగా, పచ్చని ఎర్రని పసుపు ఆకుల చెట్లతో, ఎంతో బాగుంటుంది. ఎత్తైన ప్రాంతము కాబట్టి, కొన్ని సార్లు చలిగా కూడా ఉంటుంది, ఎండా కాలములో ఇబ్బంది ఉండదు.

కొంత మంది షెనందో పార్క్ లో అరగంట దూరము కారులో వెళ్లి వెనక్కి వస్తారు. అసలు కధ, గంట దూరం తర్వాత ఉంటుంది, బ్లూరిడ్జ్ పార్క్ ఘాటు రోడ్డు లో. నార్త్ కెరొలీనా రాష్ట్రం దాకా పోతూనే ఉంటుంది.

మధ్యలో ఉండటానికి రూం లు, కారు ఇంధనము, చిరు తిండి, అక్కడ అక్కడ దూరముగా ఉంటాయి. వారం రోజులు సెలవు తో, కుటుంబం తో, కారు లో ఆహ్లదం గా, ప్రక్రృతి ఒడిలో పరవశించి తిరిగే వారు ఉన్నారు. పొలీసు కాపలా ఉంటుంది, భయము ఉండదు, కాని చెట్లు లేదా రాళ్ళ మధ్యకు వెళ్ళి ప్రమాదాల బారిన పడిన వారూ ఉన్నారు. జాగ్రత్త గా ఉండాలి.  
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 847 General Articles, 46 Tatvaalu
Dt : 30-Oct-2019, Upd Dt : 30-Oct-2019, Category : America
Views : 278 ( + More Social Media views ), Id : 208 , Country : USA
Tags : shenandoah valley national park , Virginia , washington DC , front royal

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content