సప్తపది - గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది - కె విశ్వనాధ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,750; 104 తత్వాలు (Tatvaalu) and views 225,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సాత్విక మనసున్న దర్శకేంద్రుడు కె విశ్వనాధ్ గారి అద్భుత స్రుష్టి ఈ చిత్రం. కుల రొచ్చు లో లోపాలను ఎత్తి చూపడానికి, ప్రయత్నం చేసారు, అగ్ర వర్ణాలు మరియు నిమ్న వర్గాలకు ఉన్న ఆలోచనలు సరి చేయడానికి. మనసు గుణం ముఖ్యం అని చెప్పే ప్రయత్నం చేసారు.

కధలో బలం ఉంటే, పెద్ద హీరోలు హీరోయిన్లు క్లబ్ డాన్స్ లు కోట్ల ఖర్చు అవసరము లేదు. చిన్న నటులతో, చరిత్ర స్రుష్టించారు. అలాగే శంకరాభరణం సినిమా కూడా.

కాకపోతే, అక్కడ కులం ఒకటే కాదు, ఆస్తి పాస్తి లేకుండా, పని పాట లేకుండా, ఊరక పిల్లన గ్రొవి ఊదుకుంటూ, పాటలు పాడుతూ తిరిగే వారికి, అదే కులం అయినా, ఎవరన్నా పిల్లను ఇస్తారా? అన్న పాయింట్ మరి మరిచారా? తెలీదు. అదే కులం, బంధువులు కూడా, అబ్బాయికి ఆస్తో ఉద్యోగమో వ్యాపారమో ఉండాలి అనుకుంటారు కదా?

జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై, భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అవార్డులని గెలుచుకుంది. వర్ణ వ్యవస్థ గురించి సంభాషణలోను, పాటలలోను అనేక తత్వచింతనలు జొప్పించారు. అల్లు రామలింగయ్యకు, సోమయాజులుకు జరిగిన సంభాషణలలో వృత్తి ధర్మం, మనో ధర్మం గురించిన అభిప్రాయాలున్నాయి.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు, కేవలం గుణ కర్మల ఆధారంగా చెప్పబడ్డాయి. అవి కులాలు కావు, కేవలం వ్రుత్తి.

అంటే, సీయెం, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజలు లాగా, వారి పనులు/పదవులు ను బట్టి. ఎంపీ, ఎమ్మెల్యే లు కులాలా, ప్రజాస్వామ్యం లో అది జన్మ హక్కా? కేవలం వ్రుత్తి, అంటే ఎవరైనా ఆ వ్రుత్తి/ పదవి చేపట్టవచ్చు, ఎన్నికల్లో గెలిస్తే అర్హత ఉంటే.

దానిని, ఎంత వరకు తీసుకు వచ్చాము బ్రష్టు పట్టించాము అంటే, ఏ కులం లో పుట్టిన వాడు, ఆ కులం కే పరిమితం చేసాము. ప్రతి దాంట్లో 100 కులాలను స్రుష్టించాము, మరలా వారిలో వారికే పడదు.

శూరత్వం లేని వాడు యుద్దం చేయడం రాని వాడు, క్షత్రియ కులం లో పుట్టినా, వాడు క్షత్రియుడు కాడు, మామూలు శూద్రుడే. వేదాలు మంత్రాలు చదివి సంధ్యావందనం మొదలగు బ్రాహ్మణ కర్మలు చేయని వారు, బ్రాహ్మలు కారు. పదిమందికి ఉపయోగపడే వ్యాపారం చేయడం రాని వారు, వైశ్యులు కారు. వీరు శూద్రులే.

అంటే పుట్టినప్పుడు, అందరూ శూద్రులే. తర్వాత తమ గుణాలు, వ్రుత్తిని బట్టి మాత్రమే, వర్ణము గా పిలవాలి అన్న ఇంగితము పరమార్ధం మరచి, స్వార్ధం అహంకారం పెరిగి సమస్యలు తెచ్చుకున్నాము.

ఇప్పుడు కూడా చూడండి, ఎంపీ ఎమ్మెల్యేలలో కూడా అదే చెడ్డ బుద్ది నడుస్తుంది. కొడుకు మంద బుద్ది అయినా, దేనీకీ పనికి రాకపోయినా, నాయకత్వ లక్షణాలు లేక్పోయినా, అన్ని అవలక్షణాలు ఉన్నా, ధనం ఉంటే, సీయెం ఎమ్మెల్యే ఎంపీ కొడుకే, మరలా అదే పదవికి రావాలని, అదే తప్పుడు వ్యవహారాన్ని పదవి/ కుల జన్మహక్కు గా కొనసాగించడం చూస్తున్నాము.

జనం కూడా, అది తప్పు అని చెప్పకుండా, తిరస్కరించకుండా, ఎవరికి ఎక్కువ ధనం కేసులు బినామీలు ఆస్తులు కుట్రలు వెన్నుపోటులు ఉంటే, ఎవరు ఎక్కువ విదిలిస్తే, ఎవరు ఎక్కువ తప్పుడు వారైతే, వారే మా కుంచిత బుద్దులకు తగిన నాయకులు అని, వారినే ఎన్నుకుని, కుటుంబ బానిసత్వం ను ప్రోత్సహిస్తూ, రాజ్యాంగాన్ని కాలరాసి, తమ గోతులు తామే తీసుకుంటూ, తమ మరియు వారసుల జీవితాలను, ఇంకా నరకం చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఉన్నది 2 కులాలు/ వర్గాలు మాత్రమే. ఉన్న వాడు మరియు లేని వాడు. ధనం ఆస్తి పదవి ఉంటే, కులం పట్టింపు లేదు. అవి లేకపోతే, ఒకే కులం వారు కూడా, లెక్క చేయరు, దరికి రానీయరు, సహాయం చేయరు.

అంతెందుకు, బడుగు బలహీన దళిత వర్గాల వారు కూడా, ధనం పదవి ఆస్తి వచ్చిన తర్వాత, తమ వర్గం వారినే దూరంగా ఉంచుతారు. ధనమున్న మరియు అగ్రవర్ణాల వారితో కలసి తిరుగుతారు. కాబట్టి కుల పిచ్చి అన్నది, అన్ని వర్గాలలో ఉంది, ధనవంతుడా కాదా అన్న దానిని బట్టి.

ఇతర మతాలలో కూడా ఈ కుల వర్గ పిచ్చి ఉంది, ఎవరూ తక్కువ కాదు. మన దగ్గర కేవలం దూరంగా పెడితే, ఇతర మతాలలో వారిని చంపేస్తున్నారు, ఇంకా బానిసలు గా చూస్తున్నారు.

పుట్టేటప్పుడు అందరమూ వచ్చింది ఒక చోట నుంచే, పోయేది ఆ మట్టిలో 6 అడుగుల నేలలో, ఇప్పుడు కరెంట్ ధూళిలో. అందుకే, మనలోకి మనము చూసుకుంటే, మన తప్పులు మనకే కనపడతాయి. అవే జీవిత చరమాంకములో ఉరి తాళ్ళు అవుతాయి.

గోవులు గోపయ్య గోధూళి పిల్లనగ్రొవి మాధవుడు, ఇవన్నీ ఏకులానికి చెందినవి? ఎంత బాగా చెప్పారో చూడండి, ప్రశ్న జవాబులు మాదిరిగా, గోవులు కాసే తండ్రి మరియు కొడుకు తో.

ఆకాశం, భూమి మూగవంట. మధ్యలో వచ్చిన మేఘాలు ఉరుము తాయి. అలాగే ఈ బుద్ది లేని మనుషులకే, నరం లేని నాలిక, ఎటూ అయినా మాట్లాడుతుంది.

1) గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన - అబ్బాయి గొంతు
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ - పెద్ద గొంతు
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో - పెద్ద గొంతు
తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా - అబ్బాయి గొంతు
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా, గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా - పెద్ద గొంతు
ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. - పెద్ద గొంతు
ఎందువలనా అంటే అందువలన, ఎందువలనా అంటే దైవఘటన - అబ్బాయి గొంతు
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన - పిల్ల గొంతు
గోధూళి ఎర్రన ఎందువలన - పిల్ల గొంతు

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.. పాపం - పెద్ద గొంతు
అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు - అబ్బాయి గొంతు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా, ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా - పెద్ద గొంతు
ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. - పెద్ద గొంతు
ఎందువలనా అంటే అందువలన, ఎందువలనా అంటే దైవఘటన - అబ్బాయి గొంతు

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

Govullu Tellana, Govullu Tellana, Lyricist: Veturi, Singer: S.Janaki

2) ఏ కులము నీదంటే.., గోకులము నవ్వింది
మాధవుడు, యాదవుడు, మా కులమే.. లెమ్మంది

ఏడు వర్ణాలు కలసి.., ఇంద్రధన సౌతాది
అన్ని వర్ణాలకు ఒకటే.., ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలసి.., ఇంద్రధన సౌతాది
అన్ని వర్ణాలకు ఒకటే, ఇహము పరముంటాది ||ఏ కులము నీదంటే||

ఆది నుంచి ఆకాశం మూగది.., అనాదిగా తల్లి ధరణి మూగది.. 2
నడుమ వచ్చి, ఉరుముతాయి మబ్బులు.. 2
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు.. ఇన్ని మాటలు ||ఏ కులము నీదంటే||

Ye Kulamu, Lyricist: Veturi, Singers : S.P.Balu, Suseela.

Saptapadi, Music: K.V.Mahadevan
దర్శకత్వం కె.విశ్వనాధ్, నిర్మాణం భీమవరపు బుచ్చిరెడ్డి, కథ కె. విశ్వనాధ్, చిత్రానువాదం కె. విశ్వనాధ్
తారాగణం జె.వి. సోమయాజులు, భమిడిపాటి సవిత, గిరీష్, అల్లు రామలింగయ్య, జె.వి. రమణమూర్తి, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, రవికాంత్

Saptapadi - govullu tellana gopayya nallana, e kulamu nidanTe gokulamu navvindi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,750; 104 తత్వాలు (Tatvaalu) and views 225,171
Dt : 11-Jun-2022, Upd Dt : 11-Jun-2022, Category : Songs
Views : 705 ( + More Social Media views ), Id : 1423 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : saptapadi , govullu , tellana , gopayya , nallana , kulamu , gokulamu , navvindi , viswanath , somayajulu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content