పాటతో పరమార్ధం - మకర సంక్రాంతి వచ్చిందిరా - రూలర్ - బాలకృష్ణ, వేదిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,753; 104 తత్వాలు (Tatvaalu) and views 226,323.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sankranti - Ruler - Balakrishna, Vedhika

సంక్రాంతి సంబరాలు, మన సాంప్రదాయం మర్చిపోకుండా, తలచుకుందాం, పాడుకుందాం. మన ఇళ్ళ చుట్టూ బంధాలతో పెరిగాము, మరి ఇప్పుడు పట్టణాలు విదేశాలు కు వెళ్ళి, ఊళ్ళో ఉన్నా అంతే సుమా, ఇంట్లో సొంత వారితోనే బంధాలు తెంపుకున్నాము.

ముదుసలి అమ్మ నాన్న అత్త మామ సేవ సంగతి పక్కన పెడితే, ఆదాయం పోతే, రోగం వస్తే భాగస్వామి ఉంటుందో లేదో కూడా ఎవరికీ తెలీదు. సొంత పిల్లలు, రేపు మనల్ని ఇంట్లో పెట్టుకుని గౌరవిస్తారో లేదో కూడా తెలీదు, అలా స్వార్ధ అవసర అవకాశాలతో బండలుగా పెంచుతున్నాం. బొట్టు జుట్టు కట్టు కూడా వదులుకున్నాం, అంటే మానసికముగా బలహీనులం అవుతున్నాం. కాబట్టి గతాన్ని గుర్తు చెయ్యాలి.

ఈ సినిమా కు, మాస్ పాటలు పోస్టర్లు ఎన్నో ఉన్నా, మనకు కావలసిన మంచి మాత్రమే తీసుకున్నాము, హైందవ పండగ గురించి, నాగలి పట్టిన రైతు ఫోటోనే పెట్టాము కదూ.

సంక్రాంతి అంటే, ఏడాది అంతా కష్టపడిన రైతుకి, పంట చేతికి వచ్చే సమయం. చూడండి ఎలా ఒకరినొకరు ఆత్మీయముగా పలకరించుకుని, ఆనందము పంచుకుంటున్నారో.

ఓ తులసమ్మక్క, నరసమ్మక్క, గిరిజక్క, గీతక్క, బాగా పండింది, మన చేలోని పంట. మనమంతా సద్ది బువ్వు తిని, ఎండలో కష్టపడి, కొడవలి పట్టి, కోసిన పంట, మన ఇంటిక్కొచ్చినాక, సంతోషము గా, పండగ జరగాలంటా. నల్ల రేగళ్ళ పొలాల బంగరాలే, నిండు మన నట్టిల్లు. పూల గొబ్బెమ్మల, సింగారాలే, మన పల్లె ముంగిళ్ళు. నా సామిరంగ, మన ఏడాది కష్టమంతా, మన జీవితాలకు అద్రుష్టమై, ఊరంత కోలాటం ఆడిందే..

సంక్రాంతి, వచ్చిందిరా. మనకు కోటి సరదాలు, సంతోషాలు, సందళ్ళు తెచ్చిందిరా. మకర సంక్రాంతి వచ్చిందిరా, మన చిరునవ్వు, రంగుల్ని మార్చిందిరా..

ఏ దేశమైన, ఎక్కడైన, తెలుగోడి చెయ్యి, పైచెయ్యిలే? కాదంటారా, దేశం లో విదేశాల్లో, 78 ఏళ్ళ కన్న తల్లికి, ప్రపంచ వైద్యం ఇప్పిస్తూ, 10 ఏళ్ళు రోజూ చెయ్యి పట్టి మైలు నడిపిన వారు, 220 వారాల 108 ప్రదక్షిణలు చేసిన వారు, సొంత ఆయుర్వేదముతో నిండు బిళ్ళ నుంచి అరబిళ్ళకు ఇంగ్లీషు మందు తెచ్చిన వారు, 48 నెలలు శిరోముండనం చేసుకున్న వారు, 20 ఏళ్ళు పైగా శాఖాహారం నేల నిద్ర వారు, ఇతర భాషలలో ఉన్నారా? సాత్విక పోటీ తప్పులేదు, అన్ని భాషలు ఒకటే మంచికి.

మరి మన తెలుగోడి, సత్తా తెలిసేలా, ఒళ్ళొంచి, కష్టపడి పని చెయ్యాలిలే. మనదైన సాంప్రదాయం, మన్ను దున్నే వ్యవసాయం. మనము ఎంతెత్తులో అంత దూరములో ఉన్నా, ఎదిగి వున్నా, ఒదిగి మూలాలు, మర్చిపోములే.

మన అందరి ఆకళ్ళు తీర్చే, అన్నదాత, రైతన్నే కదా, ఏనాటికి. మరి ఆయనకు తగిన గిట్టుబాటు ఇస్తున్నామా? భుస్వాములు, దళారీలు తినేస్తున్నారు మధ్యలో వారిని మోసము చేసి. రైతన్న చల్లంగుంటే, చాలు లోటంటు లేదు, లోకానికీ, మన కడుపులకి. మట్టి కోసం పుట్టినోళ్ళు, మంచి పంచె పల్లెటూళ్ళు, ఈ రోజు లాగే, ఏ రోజు నవ్వే, మంచి రోజులు, రావాలే...

ఆయో ఆయో ఆయోరే
మంగల్ మంగల్ జాయోరే
ఆయో సంక్రాంతి ఆయోరే . . .2 సార్లు

తులసమ్మక్క, నరసమ్మక్క, గిరిజక్క గీతక్క
పండిందే. మన పంటా..
ఓ. కొడవలి పట్టి, కోసిన పంట
ఇంటిక్కొచ్చినా.క, పండగ జరగాలం.టా..
నల్ల రేగళ్ళ, బంగరా.లే, నిండు నట్టిల్లు
పూల గుగ్గిల్ల, సింగారా.లే, పల్లె ముంగిళ్ళు
సామిరంగ, ఏడాది కష్టమంతా.
అద్రుష్టమై ఊరంత, కోలాటం ఆడిందే..

కోలమ్మ కోలో,
సంక్రాం.తి సంక్రాం.తి, వచ్చిందిరా
కోటి సరదాలు, సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి, సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు, రంగుల్ని మార్చిందిరా ..

ఏ దేశమైన, ఎక్కడైన, తెలుగోడి చెయ్యి, పైచెయ్యిలే.., పైచెయ్యిలే ..
తెలుగోడి, సత్తా తెలిసేలా , ఒళ్ళొంచి, పని చెయ్యాలిలే...
మనదైనా.., సాంప్రదాయం., మన్ను దున్నే.., వ్యవసాయం.
ఎంతెత్తులొనా, ఎదిగి వున్నా, మూలాలు, మర్చిపోములే. . .

కోలమ్మ కోలో
సంక్రాం.తి సంక్రాం.తి, వచ్చిందిరా
కోటి సరదాలు, సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి, సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు, రంగుల్ని మార్చిందిరా ..

***
గొబ్బియల్లొ గొబ్బియల్లొ గొబ్బిగౌరమ్మ..
పుణ్యమిస్తాది, పూజలు చేద్దం, రాయె చిలకమ్మ
నువ్వు గలగన్న, కోరికలన్ని, తీరేనోయమ్మ
నీకు మనసైన వాడే, నిన్ను, మనువాడెనమ్మా

ఆకళ్ళు తీర్చే, అన్నదాత, రైతన్నే కదా, ఏనాటికి.., ఏనాటికి ..
రైతన్న చల్లంగుంటే, చాలు లోటంటు లేదు, లోకానికీ . . .
మట్టి కోసం., పుట్టినోళ్ళు.. మంచి పంచె.., పల్లెటూళ్ళు..
ఈ రోజు లా.గే, ఏ రోజు న.వ్వే , మంచి రోజులు, రావాలే...

కోలమ్మ కోలో
సంక్రాంతి సంక్రాంతి , వచ్చిందిరా
కోటి సరదాలు, సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి, సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు, రంగుల్ని మార్చిందిరా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,753; 104 తత్వాలు (Tatvaalu) and views 226,323
Dt : 07-Feb-2024, Upd Dt : 07-Feb-2024, Category : Songs
Views : 126 ( + More Social Media views ), Id : 2010 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sankranti , Ruler , Balakrishna , Vedhika
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content