శంకరాభరణము - ఆధ్యాత్మిక నాదం - మాణిక్య వీణా ముఫలాల, మానస సంచర రే, ఏ తీరుగా నను దయ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,942,608; 104 తత్వాలు (Tatvaalu) and views 230,705.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sankarabharanam Telugu/ Tamil/ Malayalam/ Kannada movie, Manikya Vina, Manasa Samcharare, E tiruga nanu - spiritual devotional songs. Please try to sing and teach to kids for good vaksuddi.

సాత్వికులు ఎప్పుడూ లింక్ లోపలే చదువుతారు, ఎందుకంటే, తప్పులు అన్ని సరి చేసి ఇంకా ఎక్కువ ఉండవచ్చు అక్కడ.

చిట్టి చిట్టి పద్యాలు శ్లోకాలు ఇవి, వాక్సుద్ది కోసము, ఇవైనా నోటితో ప్రయత్నము చేస్తారు కదూ. పిల్లలకు నేర్పుతారు కదూ.

మాలాంటి సంగీతం రాగాలు పలకడం రాని అల్పులే, సాధన తో ప్రయత్నము చేస్తూ ఉంటే, మీలాంటి ఉత్తములకు, మీ ఉత్తమ పిల్లలకు ఇవి ఇంకా చాల తేలిక. సాధన చేయనిదే ఏదీ రాదు కదా? దయచేసి మొదలు పెడుతారు కదూ?

నాలుకపై ఉన్న అశుద్దము పోవాలి అంటే, చెడు మాటలు రుచులు పోవాలి అంటే, కదలని బండ నాలిక సరి అవాలి అంటే, మానసిక బలం పెరగాలంటే, ఉత్తమ పద్య శ్లోకాలతో శుద్ది చేయాలి.

ఇది ఆరోగ్యము కూడా, నాభి నుంచి కంఠము వరకు, ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతుంది.

మహాకవి కాళిదాసు, అమ్మవారిని స్తుతిస్తూ పాడిన శ్లోకాము ఇది - మాణిక్య వీణా ముఫలాలయంతీం. ఈ సినిమాలో బాలు, పాత సినిమాలలో ఘంటసాల కూడా పాడారు అద్భుతముగా, అక్కడ ఇంకా పెద్ద పద్యము ఉంటుంది.

సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్వవేత్త. 18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు. ఆయన రచించిన వాటిలో కొన్ని మాత్రమే దొరికాయి. అందులోని ఓ తీయటి చక్కెర ముక్క ఈ పదాల పట్టీ - మానస సంచర రే, బ్రహ్మణి, మానస సంచరరే.

ఏ తీరుగా నను, దయ జూచెదవో, ఇనవంశోత్తమ రామ. నాతరమా, భవ సాగర మీదను, నళిన దలేక్షణ రామ అంటూ మన భద్రాచల రామదాసు కీర్తనలు కూడా మనసారా పాడుకుందాము. ఆ సుగుణాభి రాముడిని శరణు వేడుదాము.

అలాంటి రాజుని, కొడుకుని, అన్నని, తండ్రిని ఇవ్వమని కోరుదాము. ఇలాంటి వారు మనకు మాత్రమే అండ కాదు, ప్రజలు అందరికీ బంధువులు, అలాగే దేవతలకు మానవులకు మధ్య వారధులు, ప్రపంచ మాయకు దూరముగా ఉంటారు, అరిషడ్వర్గాలకు బానిసలు కారు, అష్ట వ్యసనాలు వీరిని దరి చేరలేవు.

1) మా.ణిక్య వీణా ముఫలాలయంతీం.
మదా.లసాం. మంజుల వాగ్విలా.సామ్
మహేం.ద్ర నీలద్యుతి, కోమలాం..గీం
మాతంగ కన్యాం., మనసా స్మరామి
చతుర్బుజే, చంద్రకళా వతంసే . . .ఏ ఏ
కుచోన్నతే, కుంకుమ రాగశోణే . .
పుండ్రేక్షు, పాశాంకుశ పుష్ప బాణహస్తే, నమస్తే నమస్తే జగదేక మాతహా ఆ ఆ ఆ

Manikya Veena, Singers: SP. Balasubramaniam, Janaki, Lyrics: Mahakavi Kalidasu

2) మానస సంచర రే., బ్రహ్మణి, మా.నస సంచరరే..
మదసిఖి పించా..లంకృుత చికురె.. 2
మహనీయ, కపోలజిత ముకురె, మానస సంచరరే.. ఏ ఏ

శ్రీ రమణీకుచ శ్రీ శ్రీ శ్రీ రమణీ
శ్రీ రమణీ కుచ, దుర్గ విహారీ
సేవక జన, మందిర, మందారే

పరమ హాంస ముఖ చంద్ర చకొ..రె
పరి పూరిత .మురళీ వరధారె - మానస సంచరరే

Maanasa Sancharare, Singers: SP. Balasubramaniam, Vani Jayaram
Lyrics: Sadasiva Brahmam

3) ఏ తీరుగా నను, దయ జూచెదవో, ఇనవంశోత్తమ రా.మ .. 2
నాతరమా, భవ సాగర మీదను, నళిన దలేక్షణ రా.మ. 2

శ్రీ రఘు నందన, సీతా రమణా, శ్రిత జనపోషక రామ..
కారుణ్యాలయ, భక్త వరద నిన్ను, కన్నది కానుపు రామ

క్రూరకర్మములు, నేరక చేసితి, నేరము లెంచకు రామ.. 2
దారిద్రము, పరిహారము సేయవే, దైవ శిఖామణి రామ

E teeruga nanu, Singers: Vani Jayaram, Lyrics:Bhadrachala Ramadasu (Kancherla Gopanna)

Sankarabharam, Music: KV. Mahadevan, Lyrics: Veturi

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.
Sankarabharam Manikya Vina Manasa Samcharare E tiruga nanu  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,942,608; 104 తత్వాలు (Tatvaalu) and views 230,705
Dt : 28-Jul-2022, Upd Dt : 28-Jul-2022, Category : Songs
Views : 560 ( + More Social Media views ), Id : 1479 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sankarabharam , manikya , vina , manasa , samcharare , etiruga , nanu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content