పాటతో పరమార్ధం - సంబరాల సంకురాత్రి (భక్తి పేరడీ) - ఊరంతా సంక్రాంతి - ANR, కృష్ణ, శ్రీదేవి, జయసుధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,175; 104 తత్వాలు (Tatvaalu) and views 226,400.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sambararala Sankranthi (Bhakti Parody) - Oorantha Sankranthi - ANR, Krishna, Sridevi, Jayasudha

ప్రతి ఏడాది, తెలుగు వారికి సంబరాల సంకురాత్రి, ఊరంతా పిలిచింది, కలిసి మెలసి ఆడి పాడమని, ఆనందాల్లో. ప్రతి ఇంటి ముందు ముత్యాల ముగ్గుల్లో, ముద్దబంతి గొబ్బిల్లో, పిల్ల పెద్దా, ఆడే పాడే, పాటల్లో ఎంతో ఉత్సాహముగా ఉండే వాళ్ళం ఆరోజుల్లో. మనందరికి ఏడాదికో పండగ, మన బ్రతుకంత తొలిపండగ.

మన త్యాగాలే, అందరి అండలిచ్చి, బంధాలు వేసేను. మన సద్గుణాలే, చిక్కు ముడులు విప్పి, మానసిక గంధాలు పూసేను. లోగిల్లలోన నిగ్గులన్ని వెల్లలేసె, అందరి మనసుల్లో శాంతి రంగులేసె. మన సంస్కార పిల్లలో నీతి పండిందని, సాధన కావాలని, తోడు రావాలని, ఆ దేవ దేవుని కోరదాము.

చలువ పందిట్లో, చల్లని భక్తుల శ్లోకాలు, మనసులు కలిసిన వాకిట్లో, ఊపిరి సలపని తప్పెట్లు, దేవుడి గుళ్ళో సన్నాయల్లే, మోగాలని మన మనసులను మానవత్వం తో నింపుకుందాము.

సనాతన వైదిక వైభోగం, మన తలపు వాకిట, చిరు చిందులేసేను. మన ఆడపడుచుల తలపై సింధూరం, తలుపు తలుపున, తొలి ఊసులాడేను. కళ్ళల్లోని ఆశలన్ని, కొండాకొచ్చి, వెయ్యి ముడుపులిచ్చి, గుండె చాటు మోహాలన్ని, వదలాలని, సాధన సాగాలని, మోక్షం చేరాలని ఆ దేవ దేవుని ప్రార్దిద్దాము.

ఆ అమాయకపు నవ్వీ నవ్వని నవ్వుల్లో, తెలిసి తెలియని ఒరవళ్ళు, కలిసీ కలవని కళ్ళల్లో, తీరి తీరని సాధనలు, తీరే రోజు, రేపోమాపో, రావాలని మనస్పూర్తిగా కోరుకుందాము.

అపార్ట్మెంట్ లు వచ్చి, అతి తిండితో అధిక బరువులు, అనారోగ్యాలతో, నేడు ఉదయం 5 కి లెగిచి, నీళ్ళు చల్లి, ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టే పరిస్తితుల్లో ఎంత మందిమి ఉన్నాము. మనము చెయ్యలేదు అని, అందరూ చేయడం లేదు అనుకోవద్దు. 87 ఏళ్ళ వాళ్ళు కూడా, ముదుసలి వయసులో, స్వదేశం అలాగే విదేశాల్లో ముగ్గులు వేసే వారు ఉన్నారు సుమీ. వీరు క్రుతజ్ఞత విశ్వసనీయతతో మూలాలను గతాన్ని మరచిపోరు.

Parody

సంబరా.ల. సంకురా.త్రి., ఊరంతా. పిలిచింది.
ముత్యాల ముగ్గుల్లో, ముద్దబంతి గొబ్బిల్లో
పిల్ల పెద్దా, ఆడే పాడే, పాటల్లో..
ఏడాదికో పండగ.. ఆ ఆ, బ్రతుకంత తొలిపండగ.. 2 - మొత్తము 2 సార్లు

త్యాగాలే, అండలిచ్చి, బంధాలు వేసేను
గుణాలె, ముడులు విప్పి, గంధాలు పూసేను
అరెరెరెరె లోగిల్లలోన నిగ్గులన్ని వెల్లలేసె, శాంతి రంగులేసె.
మనపిల్లలో నీతి పండిందని, సాధన కావాలని, తోడు రావాలని..
త్యాగాలే, అండలిచ్చి, బంధాలు వేసేను
గుణాలె, ముడులు విప్పి, గంధాలు పూసేను
ఆ ఆ ఆ అల్లీ అల్లని పందిట్లో, చల్లని భక్తుల శ్లోకాలు
మనసులు కలిసిన వాకిట్లో, ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే, మోగాలని. ||సంబరాల సంకురాత్రి||

వైభో.గం, తలపు వాకిట, చిరు చిందులేసే.ను .
సింధూ.రం, తలుపు తలుపున, తొలి ఊసులాడే.ను.
కల్లల్లోని ఆశలన్ని, కొండాకొచ్చి, వెయ్యి ముడుపులిచ్చి..
గుండె చాటు మోహాలన్ని, వదలాలని, సాధన సాగాలని, మోక్షం చేరాలని..
వైభో.గం, తలపు వాకిట, చిరు చిందులేసే.ను .
సింధూ.రం, తలుపు తలుపున, తొలి ఊసులాడే.ను.
నవ్వీ నవ్వని నవ్వుల్లో, తెలిసి తెలియని ఒరవళ్ళు
కలిసీ కలవని కళ్ళల్లో, తీరి తీరని సాధనలు
తీరే రోజు, రేపోమాపో, రావాలని. ||సంబరాల సంకురాత్రి||

Original

సంబరా.ల. సంకురా.త్రి., ఊరంతా. పిలిచింది.
ముత్యాల ముగ్గుల్లో, ముద్దబంతి గొబ్బిల్లో
ఆడా మగ, ఆడే పాడే, పాటల్లో..
ఏడాదికో పండగ.. ఆ ఆ, బ్రతుకంత తొలిపండగ.. 2 - mottamu 2 saarlu

అందాలే, ముద్దులిచ్చి, బంధాలు వేసేను
గారాలే, ముడులు వేసి, గంధాలు పూసేను
అరెరెరెరె లోగిల్లలోన సిగ్గులన్ని వెల్లలేసె, ప్రేమ రంగులేసె.
కన్నెపిల్లలో సోకు పండిందని, సాకు కావాలని, తోడు రావాలని..
అందాలే, ముద్దులిచ్చి, బంధాలు వేసేను
గారాలే, ముడులు వేసి, గంధాలు పూసేను
ఆ ఆ ఆ అల్లీ అల్లని పందిట్లో, అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో, ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే, మోగాలని. ||సంబరాల సంకురాత్రి||

వయ్యా.రం, వలపు వాకిట, చిరు చిందులేసే.ను .
సింగా.రం, తలుపు చాటున తొలి ఊసులాడే.ను.
కల్లల్లోని ఆశలన్ని, కొండాకొచ్చి, వెయ్యి ముడుపులిచ్చి..
గుండె చాటు కలలన్ని, తీరాలని, వలపు సాగాలని, రేవు చేరాలని..
వయ్యా.రం, వలపు వాకిట, చిరు చిందులేసే.ను .
సింగా.రం, తలుపు చాటున, తొలి ఊసులాడే.ను.
నవ్వీ నవ్వని నవ్వుల్లో, తెలిసి తెలియని ఒరవళ్ళు
కలిసీ కలవని కళ్ళల్లో, తీరి తీరని ఆకళ్ళు
తీరే రోజు, రేపోమాపో, రావాలని. ||సంబరాల సంకురాత్రి||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,175; 104 తత్వాలు (Tatvaalu) and views 226,400
Dt : 07-Feb-2024, Upd Dt : 07-Feb-2024, Category : Songs
Views : 118 ( + More Social Media views ), Id : 2012 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sambararala , Sankranthi , Oorantha , ANR , Krishna , Sridevi , Jayasudha , balu , vurantha , sankranti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content