APLatestNews.com top Banner

Social Media links
సాయి బాబా గురువా దైవమా? ప్రామాణికములు ఉన్నాయా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

ఒక గురువు ప్రశ్నలు కు వివరణ. ఎవరైనా సాయి బాబా గారి, గురు పరంపర చెప్పగలరా, ఆధారాలు చూపించ గలరా? ఎన్నోసార్లు చర్చించారు, గొడవలు జరిగాయి.

ఆయన గురించి పుస్తకాలు రాసినది, ప్రచారం చేసిన ది ఎవరు, వాటికి వారికి ప్రమాణాలు ఏమిటి? వేదాలా లేక మన లాంటి జనాలా?

సాయి బాబా కు గురువు గారు ఉన్నారు అనుకుందాము కాసేపు. ఏ ఉత్తమ శిష్యులు అయినా మమ్మల్ని పూజించాలి అంటారా? లేక మా గురువు ను లేదా దైవాన్ని పూజించాలి అంటారా?

గురువు కన్నా నేనే గొప్ప అంటారా? నేనే దైవం అంటారా? గురువు ను లేదా గురు పరంపరను దాస్తారా?

మన బ్రహ్మం గారు, రమణ మహర్షి , రాఘవేంద్ర స్వామి వారు, మమ్మల్ని పూజించండి దేవుడు లాగా అని చెప్పారా? మనము అలా వందల మందిరాలు కట్టి పూజిస్తున్నామా? మరి మన తల్లి దండ్రిని, అలా పూజిస్తున్నామా?

వ్యాసుల వారు, తాను దైవం తనను పూజించమని చెప్పలేదు. గోవర్ధన గిరి ఎత్తినప్పుడు కూడా, ఆవులను ప్రక్రుతిని పూజించండి అన్నారే గానీ, నన్ను పూజించండి అని కృష్ణయ్య చెప్పలేదు.

సరే మనము మన మోహం లో, మన ఇష్టం వచ్చిన వారిని పూజ చేసుకోవచ్చు, అభ్యంతరము లేదు, మన ఇష్టము. దానిని ఎవరూ తప్పు పట్టరు.

కానీ మరలా మధ్యలో రామ కృష్ణా శివ అని పురాణములను ఎందుకు లాగుతాము? వారి అష్టోత్తరము గీత లు ఎందుకు? పురాణ దేవతా విగ్రహాలను కాళ్ళ దగ్గర పెట్టడము ఎందుకు?అంటే పురాణములను నమ్ముతున్నామా?

ఒకవేళ పురాణాలను నమ్మితే, ఏ కొత్త బాబా (స్వామి లేదా గురువు) అయినా దైవం ఎలా అయ్యారు? పురాణం ఏమి చెప్పింది, చివర కలియుగ అంతంలో వచ్చేది, కల్కి భగవానుడు మాత్రమే అంది. అంటే, ఇంకా ప్రామాణికమైన దేవుడు రాలేదు కదా.

దేవ గురువు బృహస్పతి కూడా కష్టాలు వస్తే, దేవతలు ను, పరిష్కారము కోసము త్రిమూర్తులు దగ్గరకు తీసుకొని వెళ్ళారే గానీ, నేను దేవ గురువు ను, నన్ను పూజించాలి, మీ కష్టాలు నేను తీరుస్తానని చెప్పలేదు. చెప్ప కూడదు కూడా. దైవానికి దోవ చూపించాలి, గురువు అంతే, అదే గురు బాధ్యత.

బాబా కూడా, సబ్ కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే అన్నారు. అంటే దేవుడు ఉన్నారు అని ఆయన కూడా అన్నారు. మరి ఏ గురువు అయినా, దేవుని వదిలి నన్ను నమ్మండి పూజించాలి అంటారా? ఆయన అనలేదు, అని ఉండరు.

మన వ్యాపారస్తులు లేదా మన లాంటి మనుషులు, అలా పదకొండు సూత్రాలు రాసి, ప్రచారం చేశారు చేస్తున్నారు ఇంకా చేస్తారు. వారికీ ఒక బతుకు దోవ కావాలి. అవే 11 సూత్రాలు దేవుని కి వర్తించవా? దేవుడు రక్షణ ఇవ్వరా? లేమి లేకుండా చేయరా?

పోనీ బాబా దేవుడు అనుకుందాము. మరి మన అమ్మా నాన్న దేవుళ్ళు కారా? తెలుగు గురువులు బ్రహ్మం గారు , రాఘవేంద్ర స్వామి లేదా రమణ మహర్షి, దేవుళ్ళు కారా? మరి వారికి మన ఊళ్ళో అన్ని గుడులు లేవే? అంత ప్రచారము లేదే?

అంటే మనకు తెలీకుండానే, మోహం లో ఎవరో వ్యాపార సామ్రాజ్యంలో, పావులము అయ్యాము , అంతే కదా? రేపు ఇంకో కొత్త బాబా లేదా స్వామి వచ్చారు అని విపరీత ప్రచారం జరిగితే సాక్ష్యాలతో, మరలా అటు పరుగెత్తుతాము కదా, అంతేనా?

మనకు వళ్ళు నలగకుండా కందకుండా, తేలిక సునాయాసన మార్గాలు కావాలి. గుడి కి సాధనకు , కఠిన నియమాలు పద్దతులు ఉంటాయి, మరి మందిరం కు ఉండవు. కఠిన నియమాలు పద్దతులు సాధన లేని చదువు, డబ్బు, ఉద్యోగం నిరుపయోగం కాదా?

నేనూ బాబా ను గురువు వరకు అనుకుంటా మంచి వ్యక్తి అనుకుంటా, గౌరవిస్తా, హరతి ఇస్తా పాడతా. అంత వరకే. నాకు తెలిసి, ఆయన కూడా అలా చెప్పి ఉండరు. కానీ, ఈ ప్రచార వ్యాపారస్తులు, అన్ని కావించి ఇలా చేస్తున్నారు. గురువు మీద ఉన్న శ్రద్ద సాబూరి, దైవము మీద కూడా ఉంటే, దైవము పలుకుతారు కదా.

మన బ్రహ్మం గారు, రమణ మహర్షి , రాఘవేంద్ర స్వామి వారు లాగా, అంతవరకే. మరి వీరికి లేనన్ని గుడులు, తెలుగు రాష్ట్రాలలో, కేవలము సాయి బాబా గారికి మాత్రమే, ఎందుకు వచ్చాయి? ఆలోచన చెయ్యండి. ఎవరకు మార్కెట్ ఎక్కువ ఉంటే, వారికి మందిరాలు ఎక్కువ ఉంటాయి, అంతేగదా?

ఇంకో కొత్త బాబా మార్కెట్ వస్తే, అటు వెళతాము. ఎటు అయినా వెళ్ళు తప్పులేదు, వేదాలు పురాణాలు మీ అవసరాల కోసము కలుపుకోవద్దు దయచేసి.

దైవం కు ప్రమాణాలు, నేనో మీరో లేదా నేటి వారు రాసింది కాదు. హిందువులు కు ప్రమాణాలు ఆనాటి వేదాలు పురాణాలు మాత్రమే.

బాబాలను స్వాములను గురువు ల ను, ఎలా ప్రచారం లోకి తెచ్చి, వ్యాపారం గా మలుస్తారో, చక్కగా నేటి సినిమాలలో ( గోపాల గోపాల సినిమా వెంకటేష్ పవన్, ద్వారక సినిమా దేవరకొండ ) కూడా చూపించారు. అయినా మనం మారము. అదే మాయా మోహం లో పడతావు.

పీఠాధిపతులు కూడా, మేము దేవుడు అని చెప్పరు. ఆ స్ధానానికి రావాలంటే, ఎన్నో ఏళ్లుగా కష్టపడి రావాలి, కఠోర నియమాలను పాటించాలి, గురు పరంపర బహిరంగముగా ఉంటుంది.

మరి కొంత మంది నమ్ముతున్నారు కదా? నిజమే అది వారి ఇష్టము, వారి నమ్మకము. ఇప్పుడు ఎంతో మంది, తల్లి దండ్రులను వదిలేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, అందుకని, అది ధర్మమే కరెక్టే అన గలమా? జనము పాటించడము వ్యవహరించడము బట్టి, ధర్మము మారదు.

కలియుగ బాబాలు, గురువు, స్వాములు లు స్వార్ధ పరుల వ్యాపార సాధనాలు. వీరికి కఠోర నియమాలు ఉండవు, వారి గురు పరంపర మనకు కనపడదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 577 General Articles, 46 Tatvaalu
Dt : 19-Dec-2019, Upd Dt : 19-Dec-2019, Category : General
Views : 197 ( + More Social Media views ), Id : 259 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : guru sai baba
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content