అక్కినేని జానకి, రోజులు మారాయి - కల్లా కపటం కానని - ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,349; 104 తత్వాలు (Tatvaalu) and views 224,669.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*అక్కినేని జానకి, రోజులు మారాయి - కల్లా కపటం కానని - ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా*

రైతు అంటే గౌరవము అని ప్రతి ఒక్కరూ చెపుతారు, గొంతు పై నుంచి వచ్చే మాటేకదా? వారిని దోచుకుంటున్న దళారీలు ఎందరు, మిల్లర్లు, నాయకులు, ఎవరికి అందినంత వారు.

రైతన్న, అంటే సన్నకారు చిన్న రైతు మాత్రమే. భూస్వామి కామందు కాదు, వారు పొలములో దిగి నాటు వేయరు, కోత కోయరు.

రైతన్న పాదాలకు నమస్కరించి, వారి పాదధూళి మన నెత్తిన చల్లుకున్నా, తప్పులేదు. మీ అందరి ఎదురుగా మేము చల్లుకుంటున్నాము. నాట్లు వేసిన పొలములో తిరగాలి అంటే చిన్నప్పుడు భయం, బురదలో పడతానేమో, పాము వస్తుందేమో అని. వాళ్ళు చెయ్యి పట్టి నడిపించారు.

కనీసం రైతన్నకు క్రుతజ్ఞత గా, 4 మాటలు రాద్దాము, కొన్న పాటలు పాడదాము, అదే ఇచ్చి పుచ్చుకునే గౌరవము పద్దతి. ఎంత కంప్యూటర్ లు వాడే వారైనా, గొంతులోకి ముద్ద దిగక పోతే, చస్తారు. అంతరిక్షములోకి అయినా ఆహారము తప్పదు. అక్కడ కూడా సేద్యము చేసి, సంపాదించాలని చూస్తున్నారు.

క్రాస్ బ్రీడ్ అని సంకర జాతి ధాన్యం తెచ్చి, ఎక్కువ దిగుమతులు అని చెప్పి, మనల్ని సారం లేని పిప్పి తిండి తినిపిస్తున్నారు, శాస్త్రజ్ఞులు. డాక్టర్లు ఏమో, బియ్యం తినడం మానేయి అంటున్నారు.

సరే ఈ పాట చూడండి, రైతు చేసే ప్రతి పని ని బాగా చెప్పారు. కొన్ని పదాలు అర్ధం గాక, అమ్మని అడిగితే, కొన్ని చెప్పింది, అమ్మ కూడా నాట్లు వేసింది అంట.

అందుకే ఒళ్ళు వంచి పని చేసే వారికి ఏ రోగాలు రావు, వచ్చినా తట్టుకుని నిలబడతారు, కపటం అబద్దాల వారికే, అన్ని జబ్బులు, మందులు, ఆసుపత్రులు.

నవధాన్యాలను గంపకెత్తుకుని, సద్ది అన్నము మూటగట్టుకుని రైతులు పొలానికి పంట వేయడానికి వెళతారు. కోటేరును సరిజూసి పన్నుకో, యలపాట దాపట ఎడ్ల దోలుకో అన్నట్లు గానే చేస్తారు.

పల్లేటూళ్ళలో చెల్లనివాళ్ళు, పాలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు, ప్రజాసేవయని అరచే వాళ్ళు, ఒళ్ళు వంచి, చాకిరికి మళ్ళరు అని మన గురించి ఎంత బాగా చెప్పారో చూడండి.

పదవులు స్థిరమని, బ్రమిసే వాళ్ళే, ఓట్లు గుంజి, నిను మరిచే వాళ్ళే, నీవే దిక్కని వత్తురు పదవోయ్ అని మన నాయకుల పరిస్తితి కూడా బాగానే చెప్పారు.

కాబట్టి, ఇప్పుడు అయినా బుద్ది తెచ్చుకుని, ఆవులాంటి మంచి నాయకులను ఎన్నుకుని, రైతుకు అండగా నిలవండి.

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా - 2 లైన్లు 2 సార్లు
ఏరువాక సాగారో, రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురో, రన్నో చిన్నన్నా

నవధాన్యాలను గంపకెత్తుకుని
సద్ది అన్నము మూటగట్టుకుని - 2 లైన్లు 2 సార్లు
ముల్లు గర్రను చేత బట్టుకుని
ఇల్లాలిని నీ వెంట బెట్టుకుని ||ఏరువాక||

పడమటి దిక్కున వరద గుడేసే
ఉరుముల మెరుపుల వానలు గురిసే - 2 లైన్లు 2 సార్లు
వాగులు వంకలు, ఉరవడిజేసే
ఎండిన బీళ్ళు, ఇగుర్లు వేసే ||ఏరువాక||

కోటేరును సరిజూసి పన్నుకో - సరి చూడు
యలపాట దాపట ఎడ్ల దోలుకో, హెయ్ హెయ్
సాళ్ళు తప్పక పొండ్ర వేసుకో
విత్తనము విసి రిసిరి జల్లుకు ||ఏరువాక||

పొలాలమ్ముకుని పోయేవాళ్ళు
టౌన్ లో మేడలు కట్టే వాళ్ళు
బ్యాంకుల డబ్బు దాచే వారు
నీ శక్తిని గమనించరు వారు ||ఏరువాక||

పల్లేటూళ్ళలో చెల్లనివాళ్ళు
పాలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు
ప్రజాసేవయని అరచే వాళ్ళు 2
ఒళ్ళు వంచి, చాకిరికి మళ్ళరు ||ఏరువాక||

పదవులు స్థిరమని, బ్రమిసే వాళ్ళే
ఓట్లు గుంజి, నిను మరిచే వాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవోయ్... 2

రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ||ఏరువాక||

Rojulu Marayi Movie Songs - Kallaakapatam Song - ANR - Shavukar Janaki - Relangi
రోజులు మారాయి మూవీ సాంగ్స్ - కల్లా కపటం కానని వాడా సాంగ్ - ఏఎన్ఆర్ - షావుకార్ జానకి - రేలంగి
Rojulu Marayi-Kalla kapatam kanani eruvaka sagaro ANR Janaki Relangi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,349; 104 తత్వాలు (Tatvaalu) and views 224,669
Dt : 13-Sep-2022, Upd Dt : 13-Sep-2022, Category : Songs
Views : 422 ( + More Social Media views ), Id : 1517 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rojulu , marayi , kalla , kapatam , kanani , eruvaka , sagaro , anr , janaki , relangi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content