రోజూ బస్సు ల తో మరియు డ్రైవర్ ల తో బిజీ, క్షణం తీరిక లేదు, ఫోన్ చెయ్యాలి అన్నా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,047,858; 104 తత్వాలు (Tatvaalu) and views 235,592.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అబ్బాయి మన రెడ్డి గారు ఎలా ఉన్నారు? క్షేమమేనా? ఏ మెసేజ్ కి జవాబు లేదు, నెలలు గా, చాలా బిజీ. వారు కులాసాగా ఉంటే చాలు, మనల్ని పట్టించుకోక పోయినా.

గతంలో నేను ఫోన్ చేసినప్పుడు అల్లా, రోజూ బస్సు ల తో మరియు డ్రైవర్ ల తో బిజీ, క్షణం తీరిక లేదు. ఫోన్ చెయ్యాలి అన్నా లేదా బాగున్నాను అని మెసేజ్ పెట్టాలి అన్నా కూడా అనేవారు.

ఇప్పుడు కూడా అంత బిజీ ఏనా? మీకు కనపడితే, అడిగినట్లు చెప్పగలరు. రెడ్డి గారు, మనకు సహాయం కూడా చేశారు, మరువకూడదు. వారు బాగుండాలి. పిల్లలు కు కూడా, ఇప్పుడు సెలవులే మరి.

కొత్త ఇల్లు బయట ఫోటో చూపించు అని, సంవత్సరం క్రితం ఇంట్లో చేరినప్పుడు అడిగా. అంతమంది కి భోజనం పెట్టి, నాకు మాత్రం వీధిలో ఫోటో కూడా చూపించలేదు, మా రెడ్డి గారు. అంతే లేండి, బిజీ తో తీరిక లేనప్పుడు ఏమి చేస్తాం.


నేనైతే మన ఊళ్ళో ఉండటం లేదేమో, పిల్లల హాస్టల్ దగ్గర లో ఉంటూ, వాళ్ళ ను చదివించుకుంటూ, మన ఊరు వచ్చి పోతూ, బస్సులు డ్రైవర్ లతో సమస్యలు తో, ఖాళీ లేక, ఊళ్ళో ఇంటి దగ్గర కు కూడా పోలేక, రోడ్డు బయట ఇంటి ఫోటో తీయలేదేమో అనుకుంటున్నా.

అంత కష్ట పడుతూ ఉంటే, మన మెసేజ్ లు చదివి, నేరుగా మనల్ని అడిగిన వాటికి కూడా, జవాబు చెప్పే సమయం ఉండదు కదా.

బయట వాళ్ళ కోసం, ఒళ్ళు హూనం చేసుకోవద్దు, శ్రమ తగ్గించుకో, మన ఇద్దరమూ కూడా రోగం తో మంచం ఎక్కితే, బయట వారు ఒకరు కూడా వచ్చి పలకరించరు, అని కూడా చెప్పా. సరే మనకు జవాబు, చెప్పినా చెప్పకపోయినా, రెడ్డి గారు బాగుంటే చాలు.


ఇంతకీ రెడ్డి గారి ఇంటి బయట ఫోటో, ఎందుకు అడిగానో తెలుసా? నన్ను అక్కడ కు తీసుకుని వెళ్లి, అంతా చూపించాడు, బాగు చేపీయక ముందు. రెడ్డి గారి బడి, పాత ఇల్లు, ఆఫీసు మొత్తం తిప్పారు, పాపం కష్టపడి.

కొత్త ఇల్లు ముందు, అంతా అస్తవ్యస్తంగా ఉంది అప్పుడు. తర్వాత, చాలా ఖర్చు ఉంది, ఇదంతా సరిచేయడానికి అన్నారు. మనమెళ్ళి చూసినప్పుడు, బయట వైపు, కనీసం ఎంత మార్పు జరిగిందో అని ఉంటుంది కదా.

బయట తిరిగే పదిమంది చూసినప్పుడు, మనం చూసిన తప్పు కాదు కదా, అందుకే అడిగాను అప్పుడు. ఇంటి లోపల చూపించమని మాత్రం అడగకూడదు, అది వారిష్టం, చుట్టాలు మరియు దగ్గర వాళ్ళ కు చూపించుకుంటారు.

ఏదైనా మా రెడ్డి గారు, బహు దొడ్డ వారు. ఈ సంవత్సరం లో అయినా, మాలాంటి జనం బలం లేని, చిన్న వారి వైపు, చూపు మరలా లని, సమయం దొరకాలని, దేవుని ప్రార్ధించడం కన్నా, చెయ్యగలిగినది ఏముంది అన్నాడు సోము, వీరయ్యతో.

రెడ్డి గారు మనకు సహాయం చేశారు. * మమ్మల్ని రైలు ఎక్కించారు * రెండు వారాలు చేబదులు ధనం ఇచ్చారు * స్లాబు కు మనుషులు ను మాట్లాడారు, తోడుగా ఉన్నారు * తను ఊళ్ళో ఉంటే మాత్రం, రోజు కు ఒకసారైనా రావడం లేదా కనీసం ఫోన్ అయినా అక్కడ ఉన్నన్ని రోజులు * ఇంకా చాలా . . .
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,047,858; 104 తత్వాలు (Tatvaalu) and views 235,592
Dt : 09-Apr-2020, Upd Dt : 09-Apr-2020, Category : General
Views : 869 ( + More Social Media views ), Id : 483 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : reddy garu , bassulu , busy life
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content