పాటతో పరమార్ధం- రాయిని ఆడది చెసిన రాముడివా - త్రిశూలం - కృష్ణంరాజు, శ్రీదేవి, జయసుధ, రాధిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,442; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Raayini Aadadi Chesina - Trisulam - Krishnam Raju, Sridevi, Jayasudha, Radhika

ప్రతి ఇంట్లో ఉండే సమస్య, ఆడ మగ లో ఎవరు గొప్ప? దాదాపుగా ఉద్యోగం, సంపాదన, ఆస్తి, అందం, వీసా, బలగం, కట్నం, చదువు, హోదా లను బట్టి ఎవరికి వారు, నిర్ణయం చేసుకుని, అహంకారముతో పెత్తనము సాగిస్తూ, ఆ యింటిని, అలాగే పిల్లల పెంపక సంస్కారం ను పతనం చేస్తుంటారు. ముదుసలి అమ్మ నాన్న అత్త మామను వదిలేస్తారు లేదా ఇంట్లో ఉంచినా నరకం చూపిస్తారు.

ఎవరు గొప్ప అని నిర్ణయం చేసేది పై అరిషడ్వర్గాలు వేటిని బట్టి కాదు, కేవలం సాత్విక లేదా ఇతర గుణం స్థాయి ను బట్టి. వారే ఇంటిని మరియు పిల్లలను సంస్కార పెంపకముగా ఉన్నతికి తేగలరు.

ఇంట్లో పెద్దలు లేదా ఇద్దరి గురించి క్షుణ్ణముగా తెలిసిన బయటి స్తిర చిత్తం కలవారు మాత్రమే, ఎవరికి సంస్కార గుణం ఉందని చెప్పగలరు.

ఇద్దరు గుణ వంతులు ప్రేమికులు గా, దంపతులు గా, స్నేహితులు గా ఉంటే, వారు ఇరువురినీ ఎలా గౌరవించుకుంటారో తెలిపేది ఈ గీతం. గుణవంతులు, ఎలా తమ తప్పులను అంగీకరిస్తారో, సరి చేసుకుంటారో, అలాగే ఇతర గుణవంతులు ఆ తప్పులను క్షమిస్తూ అండగా ఆదర్శముగా ఉంటారో, చెప్పేది ఈ పదాల అర్ధం.

గుణవంతులు తప్పు ఒప్పులను, స్పష్టముగా చెపుతారు, కట్టుబడి ఉంటారు. ప్రతి మంచి పనికి, వీరికి హ్రుదయ స్పందన ఉంటుంది. మానసిక నియంత్రణ ఉంటుంది.

చూడండి, మీలో ఎంతో మంది 5 ఏళ్ళుకు పైగా, స్పష్టముగా మీ అభిప్రాయాలను తెలియచేసారు - అది తప్పు గానీ, ఒప్పు గానీ. మన్ను తిన్న పాములాగా ఎప్పుడూ ఉండలేదు. ఉన్నారు అంటే, ఇంక మీ కుటుంబములో అంత కన్నా, ఎక్కువ మంచి ఎటూ మీరు చేయలేరు. మన పిల్లల దగ్గర, ముదుసలి తనములో మనకు ఉండే చాన్స్ లేదు అని, పంచభూతాల శిక్షణకు మనము పోతున్నాము అని, మనమే ఒప్పుకున్నట్లే.

రాయిని ఆడది చేసిన రాముడివా అంటే, నువు రాయివి కావు నే రాముడు కాను, కేవలం నీ తోటి మనిషిని. నేనేంటి, నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి? అంటే నీకేంటి, నువు చేసిన తప్పేంటి, ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి? అని ఇంకొకరి ఓదార్పు. అది అవసర అవకాశం కా కూడదు సుమా.

హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు అంటే, ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు అంటూ మనసున్న మనిషి ప్రతి సమాధానం, చేతలలో కూడా సుమా. మరి ఇప్పుడైనా, మన కరకు హ్రుదయాలను కదిలించి, అరిషడ్వర్గం అష్టవ్యసనాలను వీడి, మన గురించి మనము తెలుసుకుందాం. రాత, మాట, పాట, పనులలో, మన సంస్కార పెంపకం, మానసిక నియంత్రణ బలము మనది, మన పిల్లలది, పది మందికి చూపిద్దాము.

1)రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
గంగను తలపై మోసే శివుడివా ఆ - మొత్తము 2 సార్లు
ఏమనుకోను నిన్నేమనుకోను 2

నువు రాయివి కావు, గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను - మొత్తము 2 సార్లు
తోడనుకో నీవాడనుకో 2

2)నేనేంటి, నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి

నీకేంటి, నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా - మొత్తము 2 సార్లు

అది కథే కదా
మన కథ నిజం కాదా - మొత్తము 2 సార్లు ||రాయిని ఆడది||
తోడనుకో నీవాడనుకో

3)ఈ ఇల్లు, తోడొచ్చిన నీ కాళ్లు
నాకెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు, కోవెలలో దివ్వెల్లు
కన్నీల్లతో వెలిగించే హృదయాలు

హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు - మొత్తము 2 సార్లు

అది నువ్వే కదా
నేనూ నువ్వే కదా - మొత్తము 2 సార్లు

నువు రాయివి కావు, గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను

Movie : Trisulam (త్రిశూలం); Cast : Krishnam Raju, Sridevi, Jayasudha, Radhika; Director : K. Raghavendra Rao; Music Director: K V Mahadevan; Singer : SP Balasubrahmanyam , Suseela; Lyricist : Aatreya; Song Lyric : Raayini adadi chesina ramudiva

raayini-aadadi-chesina-trisulam-krishnam-raju-sridevi-jayasudha-radhika  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,442; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964
Dt : 29-May-2023, Upd Dt : 29-May-2023, Category : Songs
Views : 552 ( + More Social Media views ), Id : 1766 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : raayini , aadadi , chesina , trisulam , krishnam , raju , sridevi , jayasudha , radhika
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content