Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఆధ్యాత్మికత అత్యున్నత ప్రమాణం కు సేవ త్యాగం అర్హత చేతలు మనసు నియంత్రణ ముఖ్యం, ఇతర దైవ సంతానాన్ని పట్టించుకోని కేవలం ఉట్టి మాటలు నామ జపం కాదు. మానవ సేవయే మాధవ సేవ. నరుని సేవయే నారాయణుని సేవ - శివయ్య, రామయ్య, క్రిష్ణయ్య, శంకరులు, రామానుజుల ఉదాహరణలు*
ఇతరులు రాసినదానిలో తప్పులు పట్టుకోవడం తేలిక, పట్టుకుంటే ప్రయోజనం (రూపాయి) ఆనందం ఉంటుందేమో కానీ, అదే మనము సొంతముగా, ముదుసలి తల్లి తండ్రి సేవ లో ఆచరిస్తూ, చాప పై నిద్రిస్తూ, శాఖాహారం తింటూ, రూపాయి అప్పు లేకుండా, అరిషడ్వర్గాల/ మనసు నియంత్రణ సాధన తో, ఓ 10 వ్యాసాలు 10 లైన్లు సొంతగా రాస్తే, మాత్రుమూర్తి మాత్రుభాష పై క్రుతజ్ఞతలు తో తెలుగులో, పది మంది కి పంపితే, (పది రూపాయల) ఆధ్యాత్మిక లాభం మనశ్శాంతి సాధన ఉంటుంది, దేవుని సంతానమైన సాత్వికులను ఒక్కరినైనా మెప్పిస్తే చాలు.
మేము కూడా గమ్మున మూల కూర్చుని జపం తపం చేసుకుంటా, ఇది రాయకుండా గమ్మున ఉండవచ్చు కదా? ఇతరులతో తిట్లు మాటలు అలకలు ఎందుకు? అప్పుడు శివయ్య/ క్రిష్ణయ్య/ గురువులు వచ్చి (పరిస్తితి కల్పించి), ఓ మొట్టికాయవేసి, మా అవతారాలు లీలలు నుంచి నీ కేమి అర్ధం అయ్యింది? ఉత్త థియరీ తో ఉపయోగం ఏమి? ప్రాక్టికల్ ఏది అంటే? మేమిచ్చిన జ్ఞానాన్ని ఇంట్లో పెట్టెలో భద్రముగా పెట్టి పూజిస్తూ, ఎవరికీ ఉపయోగం లేకుండా, నరుని సేవ లేకుండా నారాయణ సేవ, ఎలా సాధ్యం మూర్ఖుడా, అంటారు బుద్ది చెపుతారు. సాబ్రాణీ మల్లెపూల వాసన ఉపయోగం, వాటి కోసమా? అవి తరగకుండా దేవునికి వాడబడకుండా ఉపయోగం ఏమిటి అంటే?
మనము రాసే దాంట్లో కొన్ని తప్పులు దొర్లవచ్చు, అందుకే రాయించేది చెప్పించేది జ్ఞానం కల్గించేది, ఆ శివయ్యే ఆ విష్ణువే, శివాయ విష్ణు రూపాయా. శివ కేశవ బేధం లేదు, ఆత్మ పరమాత్మ బేధం లేదు. ఆచరణ సాధన లేనిదే అర్హత రానిదే అది అర్ధం కాదు. కాబట్టి పొగద్తలు తెగడ్తలు అన్ని ఆయనకే. క్రుష్ణుడు రాముడు గుణాలు మాటలు అంటేనే గిట్టని వారు ఆచరణలో పెట్టని చాలా మంది ఉన్నారు, మన రాత వారికి నచ్చుతుందా, నచ్చాలా? మీరు చదివే ప్రతిదీ, 1 వ తరగతి నుంచి ఈనాటి దాకా ఉన్న కనీసం ఒక్క స్నేహితులు బంధువులు పెద్దలు నాయకులు అందరికీ వెళుతుంది సుమా.
హనుమంతుడు రామ నామం తో, రాముని జయించే ప్రయత్నం, చేసారు. కానీ హనుమంతుడు స్తిత ప్రజ్ఞత, అర్హత సాధించినాక, చేసారు ఆ పని. లేక ముందే చేసారా? హనుమ జితేంద్రీయుడు అయ్యాకనే రామయ్య కనిపించారు, కాదా? ఆంజనేయుని గుండెల్లోనే ఉన్నారు రాముడు. తన ఇంద్రియాలను అరిషడ్వర్గాలను జయించి, ఆ పట్టు సడలకుండా మరువకుండా ఉండటానికి మాత్రమే, నామాన్ని వాడారు. శ్వాస ఎలాగో నామం అలాగా, నీతి నియమ నిష్ట చేతలు అలాగే, మరి మనకు? ముందు తనను తాను మలచుకున్నారు. రాముని సేవకునిగా ఎన్నో సేవలు ఘనకార్యాలు అందించారు. కేవలం నామ జపం చేసుకుంటూ కిష్కింద లో కొమ్మ పై ఉంటే, మనము ఆంజనేయుని కొలుస్తామా?
మనం కూడా, మొదటి మెట్టుగా సాధనకు నామం వాడొచ్చు, కానీ అబద్దాలు లేకుండా సత్యాన్ని ఆచరిస్తూ, ఆదరిస్తూ, మంచి చేస్తూ, మంచి చెపుతూ ప్రోత్సాహమిస్తూ, చేతలలో ఉండాలి చూపాలి. పిల్లలు చెక్కబండి లేదా తల్లి/తండ్రి చెయ్యి (నామం/ కీర్తన/ పూజ) పట్టుకుని తప్పకుండా నడక (ఆధ్యాత్మికత) నేర్చుకోవాలి, కానీ జీవితాంతము అదే పట్టుకుంటాను, ఇంకేమి చెయ్యను, ఇతరులకు మాట చేయూత కూడా ఇవ్వను, అంటే? దివ్యాంగులు అంటాము కదా? గురువులు ఉండి కూడా, ఆధ్యాత్మిక దివ్యాంగులు ద్రుతరాష్ట్రుడు దుర్యోధనుడు రావణుడు, ఎదురుగా దేవుడు ఉన్నా, వినరు గౌరవించరు గుర్తించరు.
బోయవానిగా వాల్మీకి ని, రామ అనమంటే, మరా మరా అన్నారు, కానీ దేవుడు వరమిచ్చారు. అక్కడ నామం కాదు ముఖ్యం, త్రికరణ/ చిత్త శుద్ది. అది ఉంటే, మన రోజూ వారి చేతలు మాటలలో స్పష్టముగా, ఇతరులకు అది కనపడుతుంది, దేవునికి అది చేరుతుంది అర్ధం అవుతుంది.
ప్రపంచములో, ధార్మిక పనులలో ఇంకో మత సంస్థ పోటీ లేని, అతి పెద్ద సంస్థ, ఇస్కాన్ వారు, నామ సంకీర్తన చేస్తూ, ఒక సంస్థ గా ఎన్నో దేశాలలో, ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వారి ప్రధాన దేవాలయం అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో రాష్ట్రం లో ఉంది, ఎన్నో సార్లు దర్శించాము. వారు తిరిగి పుస్తకాలు పంచుతున్నారు, ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు ఉచితముగా. అవి రెండూ కలిపి లేకపోతే, ప్రయోజం ఏమిటి? మనము, మన సమాజాన్ని అందరూ దేవుని సంతానం అని సేవించకుండా, దేవుని ఎలా సేవించగలము? మనము మధ్యతరగతి బీద వారము కాబట్టి, నామ స్మరణ కీర్తన లాంటివి చేస్తూ, చేతలలో ఇంటి లేదా చుట్టుపక్కల సజీవ గురువులు మరియు ఇతరుల సేవ కూడా చేయాలి.
1) మనకు, భగవంతునికి అసలు బేధం లేదు. మనం ఎలా ఎప్పుడు మారాలి, దేవునిగా చేతలలో? ఊరికే జపం చేసుకుంటే చాలా? జపము తపము అనేది, మన కోతి మనసు నియంత్రణకు మాత్రమే.
అది తెలీకే నారదుడు, త్రిలోక సంచారి గా తిరిగారా? నారాయణ అవతార రహస్యం ఏమిటి? శంకరాచార్యులు 3 సార్లు, దేశ యాత్ర వద్దు అంటారా మీరు?
మనం/ భాగస్వామి, నామ సంకీర్తన చేస్తూ, పూజ గదిలో రోజంతా గడిపితే, సరుకులు తెచ్చి భోజనం వండేది ఎవరు? పిల్లలకు వడ్డించేది ఎవరు? మన పిల్లలకు మనము మంచి చేస్తే, ఇతరులకు చేయమా? దేవుడు నగర ఊరేగింపుకు ఎందుకు వస్తున్నారు?
2) అరిషడ్వర్గాలైన కామ క్రోధ మోహ లు అన్ని, మన ప్రయత్నం సాధన లేకుండా జయించలేము, నోటి మాటతో కేవలం, జపంతో తీర్ధయాత్రల తో.
రావణుడు, విశ్వామిత్రుడు దేవుళ్ళ ను చూసి మాట్లాడి కూడా, అరిషడ్వర్గాలు కు లొంగారు.
త్రికరణ శుద్ధి అంటే ఆలోచన, పలుకు, చేతలు కలవాలి, మంచికోసం. మానవసేవ మాధవసేవ కాదా? చేతలు లేకుండా, మనసు శుద్ది, బయటకు ఎలా తెలుస్తుంది?
ఊరక కరెంట్, ఓ మూలన ట్రాన్స్ఫారం లో ఉంటే లాభం లేదు కదా? అందరి ఇళ్ళలో ఫాన్ తిరిగితే నే కరెంట్ శక్తి కి విలువ.
3) ముందు ఇంట్లో ముదుసలి తల్లి తండ్రి ని అనుసరించని వాడు, సేవ చేయని వాడు, గురువు ను దైవాన్ని ఆశ్రయించలేడు. జీవిత రహస్యాన్ని, దేవుని, ఏనాటికీ తెలుసుకోలేడు.
పసివాడైన ప్రహ్లాదుడు అది గ్రహించి, ఆ వయసులోనే త్రికరణ శుద్ది గా, ఆచరణలో చూపాడు కాబట్టె, దేవుడు దిగివచ్చాడు.
మనకు 70-100 ఏళ్ళు అయినా, అసలు అనుభూతే ఉండదు, ఎందుకు? మనము విన్నవి, తెలిసినవి ఆచరించము, అరిషడ్వర్గాలకు బానిసలము.
ఓ భక్తుడు, దేవునే ఇంటి బయట నిలబెట్టాడు, అమ్మ నాన్న సేవ తర్వాతనే, మీరు అని. దేవుడు నిలబడ్డాడు, ఎందుకంటే మాత్రు దేవోభవ అని చెప్పింది ఆయనే, అక్కడ అమ్మ నాన్న గా సేవ అందుకుంటున్నది ఆయనే, బేధం లేదు, ఆయనకు సంతోషమే అది ఆయనకు చిత్తశుద్ది పూజనే.
మాతో కూడా కొంతమంది స్నేహితుల పిల్లలు అంటారు, అమ్మకు నాన్నకు ఈ విషయాలులో మేము సహాయం చేసాము అని. మంచి పని పిల్లలూ, మీరు మాకు సహాయం చేసినట్లే అది. వారికి భవిష్యత్ లో అండగా ఉంటాము.
శంకరులు తల్లి అనుమతి తీసుకుని, బ్రహ్మచారిగా ఇతరుల అజ్ఞానం తెంచడానికి దేశ పర్యటనకు వెళ్ళారు. ఎందుకంటే ఇతరులు కూడా, శివ స్వరూపులే. ఆ జ్ఞానం వారికి కల్గించాలి.
4) మాతృ దేవోభవ పితృదేవోభవ, ముందు ఇంటి సజీవ గురువు సేవ. పిల్లలకు సంస్కారం కూడా నేర్పాలి పెళ్ళి అయ్యి వారు ఉంటే. అసలు పెళ్ళిళ్ళే, గుణము చూడకుండా, ధనము తో చేస్తున్నాము. గుణం లేని 75 శాతం ఉన్న మనం, గుణం లేని నాయకులను అలాగే ఎన్నుకుంటున్నాము.
అది సరిగ్గా చేయకుండా, లక్ష జపాలు చేసినా, లక్ష ఒత్తులు యాగాలు చేసినా, 100 తీర్ధ యాత్రల మునక వలన, ఫలితం శూన్యం. గరుడ పురాణం చదవండి. పంచభూతాలు అందరికీ ఇస్తున్న ఫలితాలు ఒక్కసారి, మనసుతో గమనించండి. ప్రతి పాపానికి శిక్ష ఎవరూ తప్పించుకోవడం లేదు.
5)భగవంతుడు కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి, పది మంది కష్ట సుఖాలను వినాలి అని చేసి చూపించారు. లేకపోతే ఆయన యోగ నిద్రలో ఉండవచ్చు కదా. అవతారాలు గా ఎందుకు వచ్చారు? 10 మంది మనలాంటి వారి కోసమే. మరి మనము ఇతరుల బాధ కనీసం వినలేమా? ఓదార్చలేమా? దానికి ఖర్చు ఏముంది? ఆత్మ బలం ఇవ్వడానికి?
అందరూ దైవ బిడ్డలు అని మనం నమ్మమా? మరి, దేవుడు మన బాధ ఎందుకు వినాలి? రాముడు కృష్ణుడు, చెడు సంహారం ఎందుకు చేయాలి. రామానుజుడు గోపురం ఎక్కి చెప్పింది? ఇతరులు, నారాయణ స్వరూపులు కాదా?
అందుకే ముందు ఇంటి లేదా ఇంటి చుట్టుపక్కల ఉన్న సజీవ గురువుల సేవ చెయ్యి, ఆచరణలో దైవత్వాన్ని చూపించు, అప్పుడు మీరే/ మనమే దేవుళ్ళము. మాత్రు దేవోభవ, పిత్రుదేవోభవ, మొదట గురువులు ఆచార్యులు వీరే కాబట్టి ఆచార్యదేవోభవ. మానవ సేవయే మాధవ సేవ. నరుని సేవయే నారాయణుని సేవ.
Qualifying works for spirituality Mind control is imp, not just name word care about others rama krishna shiva
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1792 General Articles and views 1,380,874; 93 తత్వాలు (Tatvaalu) and views 183,834 Dt : 23-Jun-2022, Upd Dt : 23-Jun-2022, Category : General
Views : 426
( + More Social Media views ), Id : 1438 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
qualifying ,
quality ,
works ,
spirituality ,
mind ,
control ,
care ,
rama ,
krishna ,
shiva ,
nam ,
jap Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments