పాటతో పరమార్ధం- ప్రియతమా నా హృదయమా (భక్తి పేరడీ) - ప్రేమ - వెంకటేష్, రేవతి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,649; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Priyatama Naa Hrudayama (Devotional Parody) - Prema - Venkatesh, Revathi

బతుకును ఇచ్చిన దేవునికి ఎన్ని రకాలుగా నైవేద్యం పెట్టినా తప్పులేదు. అది కళతో, అంటే పాటతో పద్యము తో అయితే, ఇంకా ఎక్కువ కాలం మన్నిక. ప్రతి సారీ చెప్పక పోయినా, దేవుడు అంటే, మాత్రు పిత్రు దేవోభవ కూడా వస్తుంది సుమీ, మరువద్దు. హ్రుదయములో ఉన్న దేవునితో పాటు, జన్మనిచ్చిన దేవుళ్ళకు కూడా, అలాగే మనకు తోడ్పాటు ఇచ్చిన దేవుళ్ళకు కూడా. మనుషుల్లో మానవత్వమే దైవత్వం.

అమ్మ నాన్న దైవం, ఎంత చేసారు మనకు? శిలలాంటి మనకు, జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, సజీవ గురువు సేవన్న తీపి, తొలిసారి చూపి, ఎదలోని దిగులు అడుగంట మాపి, నులివెచ్చనైన ఓదార్పు వాళ్ళై, శృతిలయ లాగ, జతచేరినాము. వారు లేని మనల్ని, ఊహించలేమూ, మన ఆనందం ఆవేదనంతా, ఇంకెవరికీ నివేదించలేము, అమరం అఖిలం, ఆత్మ బంధం కాదంటారా?

మన పెదవి పైనా శ్లోకాలు పలుకు, మన కనులలోన కన్నీరు చిలుకు, ఆ కన్నీటి చుక్కే, పన్నీరు వారికి, అది వెల్లువల్లే వారి పాదాలు కడుగుతుంది. ఏ కారుమబ్బు, ఎటు కమ్ముకున్నా, ఎన్ని కష్టాల మహా సాగరాలే మనల్ని మింగుతున్నా, ఈ జన్మలోనా ఎడబాటు లేదు, పది జన్మలైన ముడే వీడిపోదు, అమరం అఖిలం, ఆత్మ బంధం - అమ్మా నాన్న దైవామా మా హృదయమా, ప్రేమ/సేవ కే ప్రతిరూపమా, మా గుండెలో, నిండిన నాదమా, మము మనిషిగా చేసిన వేదమా, మీకు శిరస్సు వంచి కన్నీటితో సాష్టాంగ నమస్కారము.

దైవమా, మా హృదయమా 2
ప్రేమ/సేవ కే, ప్రతిరూపమా.. 2
మా గుండెలో, నిండిన నాదమా., మము మనిషిగా చేసిన వేదమా. ||దైవమా ||

శిలలాం.టి మా.కు, జీవాన్ని పోసి .. కలలాం.టి బ్రతుకు, కళతోటి నింపి
గురుసేవన్న తీపి, తొలిసారి చూపి .. ఎదలోని దిగులు, అడుగం.ట మాపి
నులివెచ్చనై.న. ఓదార్పు మీరై. .. శృతిల.య. లాగ, జతచే.రినాము
మిము లేని మమ్ము, ఊహించలే.మూ .. మావేదనంతా, నివేదించలే.ము
అమరం అఖిలం, ఆ.త్మ బంధం ||దైవమా ||

మా పెదవి పైనా., శ్లోకాలు పలుకు.. మా కనులలోన., కన్నీరు చిలుకు
ఆ కన్నీటి చుక్కే, పన్నీరు మీకు .. అది వెల్లువల్లే, పా.దాలు కడుగు
ఏ కారుమబ్బు, ఎటు కమ్ముకు.న్నా. .. మహా సాగరాలే, మము మింగుతున్నా.
ఈ జన్మలోనా, ఎడబాటు లేదు..పది జన్మలైన., ముడే. వీడిపోదు
అమరం అఖిలం, ఆ.త్మ బంధం !

దైవమా, మా హృదయమా 2
ప్రేమకే, ప్రతిరూపమా.. 2
మా గుండెలో, నిండిన నాదమా., మము మనిషిగా చేసిన వేదమా. ||దైవమా ||

Daivamaa Maa Hrudayama (Devotional Parody) - Priyatama Naa Hrudayama
దైవమా, మా హృదయమా (భక్తి పేరడీ) - ప్రియతమా నా హృదయమా

1989  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,649; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441
Dt : 20-Jun-2023, Upd Dt : 20-Jun-2023, Category : Songs
Views : 327 ( + More Social Media views ), Id : 1808 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Priyatama , Hrudayama , Devotional , Parody , Prema , Venkatesh , Revathi , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content