రామయ్య సుగుణాలను పొగుడుతూ, రాక్షసుల దుర్గుణాలను కూడా తలచుకుని - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1220 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1250 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శ్రీ రామ నవమి పూర్తి అయినది నిన్న వైభవంగా. కళ్యాణ వైభోగమే, మా సీతారాముల కళ్యాణమే. రామయ్య సుగుణాలను పొగుడుతూ, రాక్షసుల దుర్గుణాలను కూడా తలచుకుని, వారికి మరియు వాటికి దూరంగా ఉండాలి.

అందరం తప్పులు చేస్తాం, పశ్చాత్తాపం తో మరలా, అదే తప్పు తిరిగి చేయకూడదు. పెద్దలు మరియు తల్లి దండ్రుల మాట వినాలి. ఇప్పటికీ అమ్మ మాట విని, వేపాకు పొడి, పచ్చి అల్లం వెల్లుల్లి కాకర రసం, కషాయ నిమ్మ రసం తాగుతాం, రోగనిరోధక శక్తి పెరగడానికి.

త్రిగుణాలు, అంటే సత్వ రజో తమో గుణాలు, అందరిలోనూ ఉంటాయి. ఏది ఎక్కువ పాళ్ళు ఉంటుందో, ఏది ఎక్కువ పాళ్ళు ఉంచే ప్రయత్నం చేస్తామో, ఆ గుణం ఫలితాలు, మనం అదే జన్మ లో లేదా పునర్జన్మ లో అనుభవిస్తాము.

రాముడు లో సత్వగుణం ఎక్కువ, కష్టాలు అవమానాలు పొందారు, 14 సంవత్సరాలు అరణ్య వాసం చేశారు. మనం నెల రోజులు ఇంట్లో ఉండలేక, పోలీసులు తో చెప్పించు కుంటున్నాము, వారిని శ్రమ పెట్టి.

రాముడు, తన బిడ్డ ల ను అరణ్యములో మునుల వద్ద, కఠిన శిక్షణ ఇప్పించారు, అన్ని విద్యలలో. మనం కనీసం ప్రభుత్వ డాక్టరు లేదా పాఠశాల కు కూడా పోము. చివరకు అంతా శుభం జరిగింది రామయ్య కు.

మరి రావణుడు, మూడు గుణాల మధ్య అటు ఇటు మారుతూ, శివుని పొంది కూడా, లంక ను బంగారు రాజ్యం గా చేసి కూడా, లంక ప్రజలకు ఆని సౌకర్యాలు ఇచ్చి కూడా, భోగాలు లో తేలుతూ, రజో తామస గుణాలలో చిక్కి, మొహం వ్యామోహం లో పడి, కుటుంబం వంశం మొత్తం చివరకు పతనమయ్యారు. వారి ఐశ్వర్యం భోగాలు, మంది మార్భలం, వారిని కాపాడలేదు.

చూడండి, ముగ్గురు రాక్షసుల చిత్త ప్రవుర్తిని. రావణుడు, రజో గుణం. తాను జనం మీద పడి, వారిని ఏడిపిస్తూ, తాను ఏడుస్తూ, సగం లో నే జీవితం ముగించారు.

కుంభ కర్ణుడు, తమో గుణం. తినడం, నిద్రపోవడం, చుట్టూ పరిస్థితులు, చుట్టూ జనాన్ని పట్టించుకోకుండా ఉంటారు. తనకూ చివరకు పతనమే.

మూడవ వారు, విభీషణుడు. జన్మతః రాక్షసుడు అయినా, అన్ని సాత్వికంగా ఆలోచన చేస్తారు, ధర్మ బద్దంగా ఉంటారు. అన్నకు వ్యతిరేకముగా ధైర్యంగా, నిండు సభలో, మనం చేస్తున్నది అంతా తప్పు, సీతమ్మ ను వెనక్కి ఇచ్చి దండం పెట్టి వంశాన్ని కాపాడు అన్నారు బతిమిలాడారు. తోటి అన్నలు, బంధువులు, జనం గేళిచేసారు, వెళ్ళగొట్టారు.

ఆ తర్వాత కాలములో, విభీషణుడు ని అవమానించిన వారు, ఒకరు కూడా బతికి బట్ట కట్టలేదు. విభీషణుడు మాత్రమే బతికారు, సాత్వికంగా ఆలోచన చేసి, రాముని పక్కన చేరి.

అందుకే మనము కూడా, రజో తమో గుణం ఉన్న వారు గేళిచేసినా అవమానించినా, సాత్వికులు తాము నమ్మిన, సాత్విక దోవలలో నే ప్రయాణం చేస్తారు.

వారికి కావలసిన ది దేవుని మెప్పు మాత్రమే. దేవుడు ఎక్కడో లేరు, మనందరి లో నూ ఉన్నారు. సాత్వికతను పెంచుకునే బుద్ధి జ్ఞానం ఇచ్చారు. అటా, ఇటా తేల్చుకోవాలసింది మనమే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1250 General Articles, 47 Tatvaalu
Dt : 03-Apr-2020, Upd Dt : 02-Apr-2020, Category : Devotional
Views : 324 ( + More Social Media views ), Id : 468 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sita rama kalyanam , ravana , triguna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content