సజీవ గురువు సేవలో అరిషడ్ వర్గాల సాధనలో, మన మూలకారణం పంచభూతాలు లో కలవాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,956,872; 104 తత్వాలు (Tatvaalu) and views 231,102.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఓం నమో నారాయణ, ఓం శ్రీ మాత్రే నమః

ఓవైపు మనలాగే అరిషడ్ వర్గాల కు బానిసలైన దేశాలు మరియు వారి నేతలు, యుద్ధం ఆపాల్సిన నష్టం తగ్గించాల్సిన జీవితాలను కాపాడే ప్రయత్నం మాని, కొత్త ఆయుధాలు ఇవ్వడానికి మేము ఉన్నాము ముందుకు దూకండి అని రెచ్చగొడుతూ, అణుయుద్దం వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి.

తెలివి గా ఓ మెట్టు తగ్గి, సొంత ప్రజలను కాపాడాల్సిన ఆ దేశ నాయకుడు, అర్థం లేని యుద్ధం చేస్తూ, బాధ్యత ధర్మం పాటించని వ్యాపార శకుని దేశాల మాటలను తెలివితక్కువ తనం తో వింటూ, మూర్ఖంగా ప్రపంచంలో అనిశ్చితి పెంచుతున్నారు.

ఇంకోవైపు, వంద ఏళ్లుగా ఆగి ఉన్న భూకంపం సునామీ ప్రకృతి భీభత్సం, మాకు ఏ క్షణం లో అయినా, రావచ్చు అంట. నిన్న వాట్సప్ స్టేటస్ లో వార్త చదివారు కదా. ఎవరము కూడా తప్పించుకోలేము.

ఉన్న 4 రోజులూ నవ్వుతూ మనశ్శాంతి పొందుతూ, దానిని ఇతరులకు పంచే ప్రయత్నం చేస్తూ, సజీవ గురువు సేవలో అలాగే అరిషడ్ వర్గాల సాధనలో, మన మూలకారణం అయిన పంచభూతాలు లో కలసిపోవాలి. మిగతా సాధన తర్వాత జన్మలో చేయవచ్చు, ఈ సంస్కారం వాసనలతో.

మనం కావాలని జనం ఎదురు నటిస్తున్న, కాలం మనతో కూడా నటిస్తుంది సుమా. మనం నిజాయితీగా ఉండాలి, అదీ ధర్మం తో కూడి.

అరిషడ్ వర్గాల కు బానిసలమై న వారి, మోహం వ్యామోహం మాటలు పట్టించుకోనవసరం లేదు. వారు బానిసత్వం వదలరు, ఇతరుల ను వదలనీయరు.

వరాహం, బురదను వదులుతుందా, అదే సువాసన అనుకుంటుంది కదా?

ఆ ప్రాంత పరిధిలో ఉన్న, అందరి రాతకు, సర్వ మంగళం, ఒకే క్షణంలో ఒకే సమయంలో జరగవచ్చు.

కానీ శివుని ఆజ్ఞ లేనిదే, చీమైనా కుట్టదు కూడా. మన మనసు నిర్మలంగా ఉండాలి.

అమ్మ కు చెప్పిన, భూదేవి మనల్ని ఇక్కడ కలుపుకోవాలి అని, ఆ నారాయణ ఆదేశం తో అనుకుంటే, మనం ఆనందంగా అంగీకరించాలి తలవంచాలి.

ఎందుకంటే ప్రపంచంలో, ముందు ముందు రాబోయే భయంకరమైన విపత్తులు నుంచి, మనకు ముందే తేలికగా ఉపశమనం ఇస్తున్నారు.

ఇంకోటి అది కూడా, నా కోరిక ప్రకారం జరిగినట్లు గానే భావించాలి దేవుని దయతో, ఎందుకంటే చివరి ప్రయాణం అప్పుడు కూడా నీ చేయి పట్టుకుని, నేను జాగ్రత్తగా పైకి నడిపించి తీసుకుని వెళతాను, మనశ్శాంతి గా.

లేదా ఈ ప్రపంచానికి మనతో పని ఇంకా ఉంటే, ఇంకొందరికి ఉదాహరణగా చూపించాలని ఆ పరమాత్మ అనుకుంటే, ఆనాడు కారు యాక్సిడెంట్ తప్పిన విధంగా, చిన్న గీత తోనే పక్కకు వెళుతుంది.

ఎవరికీ రూపాయ మనం అప్పు లేము. మోసం చేసి పోయామని, ప్రపంచంలో ఒకరు కూడా ఏడవకూడదు, నిందించకూడదు.

అలాగే మన సంస్కారం లేని పాపపు సంతితి ని కూడా, ప్రజలకు ఇతర జీవులకు, మనశ్శాంతి దూరం చేసే, ద్రోహం చేసే విధంగా నూ, ప్రపంచం నెత్తిన వదలకూడదు, పాపం చక్ర వడ్డీ తో జమ అవుతుంది.

మనకు శాశ్వతమైన ఆనందం రక్షణ, మనం మనసు పవిత్రంగా ఉంటేనే, ఆయన సన్నిధిలో దొరుకుతుంది.

ఈ ప్రపంచంలో ఏదీ మనది కాదు, ఒంటరిగా బంధాలు లేకుండా, ఉత్త చేతులు తో ఏడుస్తూ వచ్చాము.

అలాగే ఇప్పుడు ఉత్త చేతులతో వెళతాము కానీ నవ్వుతూ నారాయణ స్మరణతో వెళదాం, నిత్యం ఏళ్లుగా సాధన లేనిదే, అది సాధ్యం కాదు సుమా.

చెడు పనులు దేనికి, ఏ ఒకరి కన్నీటి కి, మనం బాధ్యులం మరియు కారణం కారాదు.

వీరబ్రహ్మేంద్రస్వామి రాఘవేంద్రస్వామి యోగి వేమన, తెలుగు గురువు ల ఆధ్యాత్మిక అంతరాత్మ బోధలు సాధనలు మనతో ఉన్నాయి.

ఓం నమో నారాయణ, ఓం శ్రీ మాత్రే నమః

ముందు అమ్మ నాన్న పాద దాసుడు, ఆ తర్వాత నే హరి హర దాసుడు, ఈ మీ అజ్ఞాన శిష్యుడు శ్రీనివాసుడు, దైవ/ మీ మంచి హ్రుదయ ఆశీస్సులతో అండతో

practice Arishdvarg living guru service our root merge in Panchabhutas  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,956,872; 104 తత్వాలు (Tatvaalu) and views 231,102
Dt : 05-Mar-2022, Upd Dt : 05-Mar-2022, Category : General
Views : 621 ( + More Social Media views ), Id : 1309 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : practice , arishadvarg , living , guru , service , root , merge , panchabhutas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content