పూలరంగడు - చిల్లర రాళ్ళకు, మొక్కుతు ఉంటే, చెడిపోదువురా - ఏఎన్ఆర్, జమున, శోభన్ బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,240; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చిల్లర మనసు తో చిల్లర పనులు తో, దేవుని మొక్కుతు ఉంటే, చెడిపోదువురా ఒరే ఓరే అంటే కరెక్టు గా ఉంటుంది కదూ. కొందరు మోసగాళ్ళు, స్థలాలను ఆక్రమించడానికి, ఎక్కడపడితే అక్కడ ఒక రాయి పెట్టి బొట్లు పెడుతున్నారు. దేవుని పల్లకి మోస్తారు కానీ, ముదుసలి వారిని పట్టుకుని రోజూ నడిపించరు, సేవ చేయరు.

మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినా, నరుని సేవ నారాయణ సేవ అని ఎంత మొత్తుకున్నా, మన జనానికి ఎక్కడం లేదు. ఒంటరి వారిని, అనాధలను, రోగగ్రస్తులను, ఆఖరికి విశ్వసనీయత క్రుతజ్ఞత మరచి తమ ముదుసలి తల్లి దండ్రులను కూడా గాలికి దూరముగా వదిలేస్తున్నారు.

సుఖాలు సంతోషాలు సంపాదన ఆస్తులు కై ఆరాటపడుతూ, పిల్లల సంస్కార పెంపకం కూడా వదిలేసి, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు కు బానిసలై, పశ్చాత్తాపం లేకుండా ఎన్నో తప్పులు చేస్తూ, ఇతరులను అవమానిస్తూ మోసం చేస్తూ, గుడులు బాబాలు నాయకులు బ్రమలు మత పెద్దలు వెంట తిరిగే మూర్ఖులకు కనువిప్పు పాట ఇది.

ఇలాంటి వారు, గుడిలో, మందిరములో రాయి ఉంది అనుకోబట్టే కదా, మరలా తప్పులు చేస్తుంది, కాదా? దేవుడు ఉన్నాడు అనుకుంటే, మరలా తప్పు చేస్తారా? చిల్లర మనుషులు చిల్లర రాళ్ళు గా భావించి, అర్ధం లేని విహార యాత్రలు, భజనలు చేస్తారు. ఏ దేవుని, గురువు లక్షణమైనా, వారి ఆచరణ లో కనపడుతుందా?

రాముని నమ్మాను, కాబట్టి ఒకే మాట ఒకే బాట అంటారా? క్రిష్ణుని నమ్మాను, కాబట్టి ధర్మం వైపే నా అడుగులు పదిమంది కోసం అంటారా? పోనీ ఏ మతమైనా, ఆ మత గురువు లక్షణాలను పాటిస్తున్నారా? పుస్తకం లో చెప్పింది ఒకటి, వీరు చేసేది, ఇంకోటి. మాట వేరు, ఆచరణ వేరు.

నీతి నిజాయితీ, మానవత్వం సమత లేనప్పుడు, వీరు చిల్లర మనసులతో, చిల్లర రాళ్ళకు మొక్కుతున్నాము, అని వారే నిరూపించినట్లే కదా? లేకపోతే, ఎందుకు వారి తప్పుడు గుణాలు, ఎన్ని ఏళ్ళు అయినా మారవు?

వారు ఎన్ని నాటకాలు ఆడినా, ఈ జన్మలో నానా పాట్లు అగచాట్లు పడి, శిక్ష అనుభవించకుండా ఎటూ పోరు. తర్వాత జన్మ ఎటూ నరకమే, తినడానికి తాగటానికి నీళ్ళు దొరకకుండా. ఎందుకంటే, ఏదితే అక్రమముగా దోచామో దాచామే, అది మరుజన్మలో దొరకదు సుమీ. నిస్వార్ధ మానవ సేవ లేని వారి బ్రతుకులు విఫలం.

చిల్లర రాళ్ళకు, మొక్కుతు ఉంటే, చెడిపోదువురా ఒరే ఓరే..
ఒక్కడైన ఆ పరమేశ్వరునకు, మొక్కిచూడరా హరే హరే ||చిల్లర||

నుదుట రాసిన రాతను తుడుచుట, నీ తరమౌనటరా, అది నీ తరమౌనటరా
ఎన్ని జన్మలూ ఎత్తిచూసినా, అనుభవించవలెరా.., కర్మము అనుభవించవలెరా..

పాపం చేయుచు భగవంతునిపై, నిందలు వేయకురా.., అపనిందలు వేయకురా ..
చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే, అనుభవించవలెరా.., తప్పక అనుభవించవలెరా.. ||చిల్లర||

బాధ గురువుల పంచన చేరితే, బాధలు తప్పవురన్నా.., యమబాధలు తప్పవురన్నా..
బోధ గురువుల ఆశ్రయించుకుని, బాగుపడర ఓ రన్నా, బాగుపడర ఓ రన్నా..

ప్రజలను నిలువున దోచే ఘనులే బాధ గురువులన్నా.., యమబాధ గురువులన్నా..
పరులసుఖానికి శ్రమపడు బీదలే, బోధ గురువులన్నా.., నిజమగు బోధ గురువులన్నా..||చిల్లర||

చేసేవాడూ అతడే.., చేయించేవాడూ అతడే.. 2
చిత్తములోన, శివుని భజించిన, జన్మ తరించునురా.., నీ జన్మ తరించునురా. ..

చేసేవాడవు నీవే.., చేయించేదీ నీ మనసే...2
సాటివారికి సేవలు చేసిన జన్మ తరించును రా, నీ జన్మ తరించును రా. ||చిల్లర||

పూలరంగడు - చిల్లర రాళ్ళకు, మొక్కుతు ఉంటే, చెడిపోదువురా ఒరే ఓరే - ఏఎన్ఆర్, జమున, శోభన్ బాబు, విజయ నిర్మల

Poolarangadu - Chillara Rallaku mokkutu untea, chedipoduvura ore ore- ANR, Jamuna, Sobhan Babu, Vijaya Nirmala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,240; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825
Dt : 03-Jan-2023, Upd Dt : 03-Jan-2023, Category : Songs
Views : 373 ( + More Social Media views ), Id : 1678 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : poolarangadu , chillara , rallaku , mokkutu , chedipoduvura , ore , anr , jamuna , shobhan , vijayanirmala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content