పాటతో పరమార్ధం - పిలిచే నా మదిలో (భక్తి పేరడి) - ఆడబ్రతుకు - ఎన్టీఆర్, దేవిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,110; 104 తత్వాలు (Tatvaalu) and views 225,888.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Piliche Naamadilo (devotional parody) - Aada Brathuku (1965) -NTR, Devika

మానసిక నియంత్రణ, ఇది చాలా మందికి కష్టం. చపలత్వముతో 2 నాల్కల తో, ఈ రోజు అన్న మాట మీద రేపు నిలబడరు. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, తమకు తోచిన విధముగా ప్రవర్తిస్తారు. తర్వాత, వాటి ఫలితాలు అన్ని, కన్నీళ్ళతో అనుభవిస్తారు.

మరలా ఇదంతా దేవుని లీల, ఆయనకు ఇన్ని పూజలు చేసినా కూడా కష్టాలలో ఆదుకోలేదు అంటారు. మొదట, మనసును నియంత్రించటమే మనకు తెలీనప్పుడు, మనది చిత్త శుద్ది పూజ ఎందుకు అవుతుంది? దేవుని ఎందుకు చేరుతుంది? ఖర్మ కాలిందాకా ఎవరూ వినరు ఈ మాట. ముదుసలి తల్లి దండ్రుల సేవ చేయరు, పిల్లలను సంస్కారంగా క్రుతజ్ఞత విశ్వసనీయతతో పెంచరు, ముందు వీరికే తెలీదు. ఖర్మ కాలినాక, సొంత వాళ్ళు కూడా కాపాడరు/ అండ ఉండరు.

అందుకే, ఈ సాంఘీక సినిమా పాట మీ కోసం, మీ మనసు మీ మాట వింటుంది అన్న నమ్మకము ఉంటే, ప్రయత్నము చెయ్యండి, భవిష్యత్ మీరే మార్చుకోండి. పామరులను భక్తి మార్గము లోకి తీసుకుని రావాలంటే, ఇలా పాటల ద్వారా కూడా, తెలికగా వారి మనసులలో దేవుని పీఠాన్ని నిలపవచ్చు.

నిస్వార్ధముగా స్పందించే హ్రుదయానికి, నిరంతర దేవుని నామ స్మరణ చేసే శక్తి ఉంటుంది. ఈ పాట పాడేటప్పుడు, ఈ పాటకు పేరడి కూర్చేటప్పుడు, ఈ పాటకు వివరణ మాటలు రాసేటప్పుడు, ఆ దేవుని స్మరణ జరుగుతూనే ఉంది. ఆయన బిడ్డలకు నైవేద్యము సమర్పణ జరుగుతుంది ఇది పంచుకుంటూ. మరి మీరు దేవునికి, ఆయన బిడ్డలకు నిస్వార్ధముగా పంచే నైవేద్యము మాతోనూ పంచుకోరు?

చావైన బ్రతుకైనా, మీ బాటలో ఉంటాము అని రామయ్య సాక్షిగా చెప్పేవారు ఎంతమంది? లోకమేమనుకున్నా, ప్రాపంచిక మోహములో మునగక సుఖాలతో పతనం కాకుండా, పంచభూతాలకు సాక్షిగా వున్నాము అని చెప్పగలమా, బిడ్డల మీద తల్లి దండ్రుల మీద ప్రమాణం చేసి? అలా చెప్పగలిగితే, ఎన్ని జన్మలకైనా, దెవునితో ఆత్మ బంధముండునులే.

పలికే మా మదిలో., స్మరణే మీదే సుమా.. 2
కష్టాలు ఎన్నైనా.., మా స్వామి మీ.రే. సుమా..

సాధనే. దైవమని., ఆ.చరిస్తు ఉన్నా.ము
లోకమే.మనుకున్నా.., సాక్షిగా.వున్నాము..
చావై.న బ్రతుకై.నా..,
మీబాటలో ఉంటాము..
పలికే మా మదిలో., స్మరణే మీదే సుమా

చుక్కలే. తెగిపో.నీ.., సూర్యుడే. దిగిరా.నీ.. 2
ఈ ప్రే.మ మా.రదులే.., ఈ జ్యో.తి ఆ.రదులే.. 2
ఎన్ని జన్మలకైనా..,
ఆత్మ బంధముండునులే..

పలికే మా మదిలో., స్మరణే మీదే సుమా.. 2
కష్టాలు ఎన్నైనా.., మా స్వామి మీ.రే. సుమా..
పలికే మా మదిలో., స్మరణే మీదే సుమా

చిత్రం : ఆడబ్రతుకు (1965); సంగీతం : విశ్వనాథన్ రామమూర్తి; సాహిత్యం : సి.నారాయణ రెడ్డి; గానం : పి.సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,110; 104 తత్వాలు (Tatvaalu) and views 225,888
Dt : 06-Jun-2023, Upd Dt : 06-Jun-2023, Category : Songs
Views : 283 ( + More Social Media views ), Id : 1778 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Piliche , Naamadilo , devotional , parody , Aada , Brathuku , NTR , Devika
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content