పాటతో పరమార్ధం -పెళ్లి చేసుకొని(పేరడీ) -పెళ్ళి చేసి చూడు -ఎన్టీఆర్, వరలక్ష్మి, సావిత్రి, ఎస్వీఆర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2096 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2131 General Articles and views 1,976,535; 104 తత్వాలు (Tatvaalu) and views 231,929.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Pelli Chesukoni (Parody)- Pelli Chesi Choodu - NTR, Varalakshmi, Savitri, SVR

ప్రాపంచిక బ్రమలకు లొంగకుండా, గుణముతో కూడిన పెళ్ళి చేసుకొని, ఇల్లు చూసుకొని, చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లరు సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ అని మన పెద్దలు చెప్పారు.

కానీ వ్యామోహములో, వీలును బట్టి 20 నెలల నుంచి 20 ఏళ్ళు అయినా, మనము విడాకులకు కూడా, ఉత్సవాలు చేసుకుంటున్నాము, గర్వముగా అందరికీ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో.

అందుకనే ఇప్పుడు, ఏ ఇంటిలో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది, పైన పటారం లోన లొటారం లాగా, యాంత్రిక కపట నటన జీవితాలు నడుస్తున్నాయి. ఎప్పుడు ఏ ఉపద్రవం, ఏ ఇంట్లో ఏ మనసులో వస్తుందో తెలీదు, ఎందుకంటే వాట్సాప్ లో కూడా దొంగ చాటుగా ఉండే బుద్దులు పెద్దలకే ఉంటే, ఇక వారి పిల్లల పరిస్తితి?

అందుకే ఇప్పుడు కొత్త బాట, ముందు గుణం పెంచుకుని, శాంతి కూర్చుకుని, సాధన నేర్చుకుని, చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లరు సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ అన్ చెప్పాల్సి వస్తుంది.

సంపాదన లేదు అని ఓ భాగస్వామి ఎత్తిపొడుస్తుంటే, సంపాదన లో మునిగి మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇతరులతో కులుకుతూ ఏడాదికి ఒకసారి కూడా, అని ఇంకో భాగస్వామి బాధ. ఇల్లాలు ఇంటి పని చెయ్యడం లేదు అని ఒక భర్త ఏడుస్తుంటే, భర్త చేతనే తన్ని తిట్టి ఇంటి పని చేయిస్తుంది ఇంకో భార్య.

ఇరువైపులా అలాగే ఉన్నారు, ఒకరు బానిసత్వములో ఉంటే, ఆ కాపురాలు శాంతము గా పైకి కనపడుతాయి. నమ్మకం పోయాక, ఒకసారి కట్టలు తెంచుకుంటే, టీవీలో/ పేపర్లో వీధిన పడతాయ్.

వ్యామోహాల మోజులో, తమ జీవితాలనే, బలి చేసి, తమ సొంత కాపురములు కూల్చు, ఘనులకు శాస్తి కాగా, పట్నాల పల్లెల, దేశ దేశాల, దైవం పేరు చెప్పుకొని, ప్రజలు సుఖ పడగా, అనేట్లు మనము మనశ్శాంతి ఇవ్వాలి, మాటలు పాటలు ద్వారా.

అందుకే అందరూ, ఇంట బయట, సజీవ గురువు సేవ వలె, తమ ఆలోచనలు ఆచరణ లో చూపాలోయ్. క్రుతజ్ఞతలతో, దంపతులెపుడు, పెద్ద వయసులను, సొంత బిడ్డలుగా సాకాలోయ్. అలాగే సంస్కారముతో, దంపతులెపుడు, చంటి పాపలను సాకాలోయ్.

నవ భావముల, నవ రాగముల, దైవ గుణాలే ఆచరణలో చూపాలోయ్. భావ సాధన వలె, అందరికి తెలిసిన, సేవా పాటలు పాడాలోయ్, మనలాగా.

Parody

ఓ.., భావి భారత భాగ్య విధాతలార.,. యువతి యువకులార..,
స్వానుభవమున చాటు, మా సందేశమిదే.., వరెవహ్

శాంతి కూర్చుకుని, సాధన నేర్చుకుని, చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

వ్యామోహాల మోజులో, తమ జీవితాలనే, బలి చేసి
కాపురములు కూల్చు, ఘనులకు శాస్తి కాగా..
పట్నాల పల్లెల, దేశ దేశాల, దైవం పేరు చెప్పుకొని, ప్రజలు సుఖ పడగా ..

ఇంట బయట, గురువు సేవ వలె, ఆచరణ చూపాలోయ్ 2
క్రుతజ్ఞతలతో, దంపతులెపుడు, పెద్ద వయసులను సాకాలోయ్
సంస్కారముతో, దంపతులెపుడు, చంటి పాపలను సాకాలోయ్ ||శాంతి ||

నవ భా.వముల, నవ రా.గముల..., దైవ గుణాలే చూపాలోయ్ 2
భావ సాధన వలె, అందరికి తెలిసిన, సేవా పాటలు పాడాలోయ్ 2||శాంతి ||

Original

ఓ.., భావి భారత భాగ్య విధాతలా,ర.,. యువతి యువకులార..,
స్వానుభవమున చాటు, నా సందేశమిదే.., వరెవహ్

పెళ్ళి చేసుకొని, ఇల్లు చూసుకొని, చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో, మన జీవితాలనే, బలి చేసి
కాపురములు కూల్చు, ఘనులకు శాస్తి కాగా.
పట్నాల పల్లెల, దేశ దేశాల, మన పేరు చెప్పుకొని, ప్రజలు సుఖ పడగా..

ఇంట బయట, జంట కవుల వలె, అంటుకు తిరగాలోయ్ 2
కంటి పాపలై, దంపతులెపుడు, చంటి పాపలను సాకాలోయ్ 2 ||పెళ్ళి||

నవ భా.వముల, నవ రా.గముల..., నవ జీవనమె నడపాలోయ్ 2
భావ కవుల వలె, ఎవరికి తెలియని, ఏవో పాటలు పాడాలోయ్ 2||పెళ్ళి||

గానం: ఘంటసాల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2131 General Articles and views 1,976,535; 104 తత్వాలు (Tatvaalu) and views 231,929
Dt : 07-Sep-2023, Upd Dt : 07-Sep-2023, Category : Songs
Views : 278 ( + More Social Media views ), Id : 1910 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bhavi , Bharatha , Chesukoni , Parody , Pelli , Chesi , Choodu , NTR , Varalakshmi , Savitri , SVR
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content