Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Palli Kattu Sabarimalaikku - Lord Ayyappa Swamy - Bhajana
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
Ayyappa Swamulu's deeksha details i.e. rules and methods are fully explained in the words of this song. And you too, can you at least do such deeksha with devotion to God? If there are such mentally strong people in our house, do a soul test.
అయ్యప్ప స్వాములు తీసుకున్న దీక్ష వివరాలు అంటే నియమాలు పద్దతులు పూర్తిగా తెలిపారు ఈ పాట మాటలలో. మరి మీరు కూడా, కనీసం దేవుని మీద భక్తితో ఇలాంటి దీక్షలు అయినా చేయగలరా? మన ఇంట్లో అంత మానసిక బలవంతులు ఉన్నారా, ఒక్కసారి ఆత్మ పరీక్ష చేయండి.
See if you can't do, 11+ years of living guru seva for 79+ years Mom, 260+ weeks of 108 pradakshin, 20+ years of vegetarianism sleep on a floor mat, leaving govt job, at least do the deeksha of mandala days.
11+ ఏళ్ళ సజీవ గురువు సేవ 79+ ఏళ్ళ అమ్మకు, అలాగే 260+ వారాల పైగా 108 ప్రదక్షిణాలు, 20+ ఏళ్ళ పైగా శాఖాహారం నేల చాప నిద్ర, ప్రభుత్వ ఉద్యోగం వదలడం చేయలేకపోయినా, కనీసం మండల రోజుల దీక్ష అయినా చేయగలరేమో చూడండి.
ప్రతి రోజూ వేకువజామున నిద్రను లేచి, అయ్యప్పను తలచుకుని, బద్దకం నిర్లక్ష్యం వదలి, శీతలస్నానం శ్రద్ధగా చేసి, అయ్యప్ప మాలను దాల్చి శీఘ్రముగా, దీక్షారంభము చేసితిమి. గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతః కాలపు వేళలు తలచి, స్వామి అయ్యప్ప శరణు ఘోషతో, మండల దీక్షలు చేసితిమి అంటున్నారు.
ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి, అందమైన బట్టలపై మమకారం విడచి, నల్లని వస్త్రములు ధరియించి, శ్రీ శని భగవానుని కొలిచెదెము. చూడండి ఏలినాటి శని అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని ఉన్నవారికి కూడా ఇది ఉపయోగము. ఎంత బాధైనా ఓర్చుకుంటూ, సౌకర్యాలను వదులుతూ, కాలికి చెప్పులు లేకనే తిరుగుతూ, అయ్యప్పలను స్తుతించితి, సంధ్యాసేవలు చేయుచు, స్వామిని ఆనందముగా కొలిచెదెను అంటున్నారు.
దగ్గరలో, నీతి నియమాలతో భజనలు చేసే స్వాముల గృహములు, పిలవకపోయినా బంధువులుగా భావించి వెతికే వెళ్ళితిమి. పడిపూజలతో మణిధరుని, జ్యోతిగ చూసి మురిసితిమి. స్వామి ప్రసాదము భక్తి గా సేవించి, మంచాలను వదలి, నేలను నిద్దుర పోయితిమి. ఆ దీక్షా మండలమంతా ఇటులే అయ్యప్పను నే కొలిచితిని. దేహబలంధ పాదబలంద అంటూ వేడితిమి. స్వామి ఇచ్చిన ధైర్యము తోటి దీక్షను ముగియించి, గురుస్వామిని గని భక్తిగా కొలిచి, ఇరుముడి దాల్చితిని.
అబద్దాలు నాటకాలు లేకుండా, సత్య వాక్కులను పలుకుచు నే, నిత్యం స్వామి నామములు తలచితినీ, మానసిక నియంత్రణ చేసి. అరిషడ్వర్గం అష్టవ్యసనాలను వీడి, దుశ్చింతలను మదిలో మాని, అయ్యప్పను యద దాల్చితిని, మానసమందున మురిసితిని. పదునెంది మెట్లెక్క తలచితిని, అయ్యప్ప స్వామినే కాంచెదను, మకర జ్యోతినే చూసెదను, స్వామి సన్నిధిలో నన్ను నే మరిచెదను అని సంకల్పము చేస్తున్నారు అయ్యప్పలు. మరి మీరు కొన్ని అయినా చేయగలరేమో చూడండి.
+ + +
ఇరుముడితోటి., నిను మదినింపి., కదిలేము స్వామి..,
అండగా నుండి., నీడగా నిలిచి., దీక్షను కావవయ్యా....
పల్లికట్టు, శబరిమలైక్కి, కల్లుమ్ ముల్లుమ్, కాలికి మెత్తెయి, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 2
పల్లికట్టు, శబరిమలైక్కి, కల్లుమ్ ముల్లుమ్, కాలికి మెత్తెయి, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 2
నెయ్యాభిషేకం చేయండి., హారతులిచ్చి కొలవండి.,
ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి, వేదన తీరగ వేడండి, అయ్యప్పను కని పిలవండి
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
1 వేకువజామున నిద్రను లేచి, శీతలస్నానం శ్రద్ధగా చేసి,
మాలను దాల్చి శీఘ్రముగా., దీక్షారంభము చేసితిమి
గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతః కాలపు వేళలు తలచి, స్వామి అయ్యప్ప శరణు ఘోషతో, మండల దీక్షలు చేసితిమి
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
2 ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి,
నల్లని వస్త్రములు ధరియించి, శ్రీ శని భగవానుని కొలిచెదెము
కాలికి చెప్పులు లేకనే తిరుగుతూ అయ్యప్పలను స్తుతించితి, సంధ్యాసేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదెను
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
3 భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళితిమి.,
పడిపూజలతో మణిధరుని, జ్యోతిగ చూసి మురిసితిమి
స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దుర పోయితిమి, మండలమంతా ఇటులే అయ్యప్పను నే కొలిచితిని
దేహబలంధ పాదబలంద, దేహబలంధ పాదబలంద,
స్వామి ఇచ్చిన ధైర్యము తోటి దీక్షను ముగియించి., గురుస్వామిని గని భక్తిగా కొలిచి, ఇరుముడి దాల్చితిని., నే ఇరుముడి దాల్చితిని
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
4 సత్య వాక్కులను పలుకుచు నే, స్వామి నామములు తలచితినీ...
దుశ్చింతలను మదిలో మాని, అయ్యప్పను యద దాల్చితిని, మానసమందున మురిసితిని...
పదునెంది మెట్లెక్క తలచితిని.. అయ్యప్ప స్వామినే కాంచెదను.,
మకర జ్యోతినే చూసెదను., స్వామి సన్నిధిలో నన్ను నే. మరిచెదను.....
పల్లికట్టు, శబరిమలైక్కి, కల్లుమ్ ముల్లుమ్, కాలికి మెత్తెయి, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 2
శరణం శరణం అయ్యప్పా., స్వా.మి శరణం అయ్యప్పా. 6
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2268 General Articles and views 2,584,782; 104 తత్వాలు (Tatvaalu) and views 276,085
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments