పగలే వెన్నెల జగమే ఊయల - పూజా ఫలం - ఏఎన్ఆర్, సావిత్రి, జమున, జగ్గయ్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,188; 104 తత్వాలు (Tatvaalu) and views 226,144.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దేవుని పాట పాడటానికి మనస్కరించనివారు, కనీసం ప్రక్రుతి పాటైనా, పాడుతారు కదూ.

పంచభూతాలతో నిండిన, మన చుట్టూ ఉండే ప్రక్రుతిని, ఆస్వాదించని ప్రేమించని వారికి ప్రేమ, మమత, త్యాగం, ఆప్యాయత అనేవి తెలీదు, హ్రుదయస్పందన ఉండదు. కానీ వారికి పెళ్ళిళ్ళు తో పిల్లలు ఉంటారు, కాని బంధాలు అనుబంధాలు ఉండవు, అంతా యాంత్రికం, సొంత వారి మీదే జాలి మానవత్వం దయ ఉండవు.

నింగిలోన చందమామ, తొంగి చూచే, నీటిలోన కలువభామ, పొంగి పూచే, ఈ అనురాగమే, జీవనరాగమై అంటూ పులకించని హ్రుదయం ఒక హ్రుదయమేనా? ఆ పదాల వరుస చూడంది, పాటనా, కవితనా?

కడలి పిలువ, కన్నెవాగు, పరుగు తీసే, మురళి పాట, విన్న నాగు, శిరసు నూపె,
ఈ అనుబందమే, మధురానందమై అంటూ మనసు స్పందించి ఆనందించే వారూ ఉంటారు.

నీలిమబ్బు, నీడలేచి, నెమలి ఆడే, పూల ఋతువు, సైగచూచి, పిఖము పాడే, మనసే వీణగా,
బ్రతుకే, పున్నమిగా, విరిసిపోదా? నిజమే కదా?

ఆ ఆ ఆ ఆ పగలే వెన్నెల, జగమే ఊయల..
కదలే ఊహలకే, కన్నులుంటే....||పగలే వెన్నెల||

నింగిలోన చందమామ, తొంగిచూ.చే..
నీటిలోన కలువభామ, పొంగి పూ.చే.. ..
ఈ అనురాగమే., జీవనరాగమై..2
యెదలో, తేనె జల్లు, కురిసి పోదా ...||పగలే వెన్నెల||

కడలి పిలువ, కన్నెవాగు, పరుగు తీ.సే..
మురళి పాట, విన్న నాగు, శిరసు నూ.పె..
ఈ అనుబందమే., మధురానందమై. 2
ఇలపై నందనాలు, నిలిపి పోదా..||పగలే వెన్నెల||

నీలిమబ్బు, నీడలేచి, నెమలి ఆ.డే..
పూల ఋతువు, సైగచూచి, పిఖము పా.డే..2 సార్లు మొత్తము
మనసే వీణగా., ఝనఝన మ్రొయగా..
బ్రతుకే, పున్నమిగా, విరిసిపోదా||పగలే వెన్నెల||

పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల

Pagale Vennela Jagame Ooyala - Pooja Phalam - ANR, Savitri, Jamuna, Jaggayya

Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , Jaggayya / జగ్గయ్య ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,
Singer : S. Janaki / యస్. జానకి ,  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,188; 104 తత్వాలు (Tatvaalu) and views 226,144
Dt : 08-Jan-2023, Upd Dt : 08-Jan-2023, Category : Songs
Views : 505 ( + More Social Media views ), Id : 1693 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pagale , vennela , jagame , ooyala , pooja , phalam , anr , savitri , jamuna , jaggayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content