మన ప్రయత్నం, ఇతర ముదుసలి తల్లుల తండ్రుల, భవిష్యత్తు కన్నీళ్లు తుడువాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,971; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Our effort is to wipe away the tears of other older mothers and fathers of the future

కన్నతల్లి సేవ వద్దు అంటారో, స్పందన లేకుండా బండరాయిలా ఉంటారో? ఈ లక్షణాలు కొన్ని అయినా దొరకడం?

if they says no to parents service and be like a stone no response? finding atleast some of these qualities?

ఏవండోయ్, మీరు పంపేవి నేను చదివిందే గాక, ఇంకో విధంగా నూ మాకు ఉపయోగ పడుతున్నాయి. మా మిత్రులు లో అందరికీ, మోహమాటం లేకుండా పంపుతున్నా ఎన్నో నెలలుగా. ఎవరైతే కన్నతల్లి సేవ, సజీవ గురువు సేవ, మానసిక బలం దైవ పూజ గుణ పెంపు ఆచరణలో, గురించి పంపవద్దు అంటారో, లేదా స్పందన లేకుండా బండరాయిలా ఉంటారో, ఇంక వారిని నమ్మను, పైసా కూడా ఇవ్వను, మోసపోను గతములో లాగా. వారికి దూరంగా ఉండాలి. వారు అవసర అవకాశ వాదులు, వారికి వారి సంతానం కు విశ్వసనీయత కృతజ్ఞతలు సంస్కారం లేదు నేర్పరు, వారి ముదుసలి తల్లి తండ్రులు అత్త మామల ను దగ్గర ఉంచి సమాన సౌకర్యాలు తో చూడరు, అని స్పష్టం గా రుజువు గా పనిచేస్తుంది మాకు. ధన్యవాదాలు మీకు. 10 వేలు ఏప్రిల్ లో ఇప్పించడానికి ప్రయత్నం చేశాము మా ఊళ్ళో కూడా, ఎంత గాలించినా ఈ లక్షణాలు కొన్ని అయినా దొరకడం కష్టం సుమా, సాక్ష్యం అసలు లేదు, మమ్మల్ని మన్నించాలి, మా చేతులు మీదగా, భగవత్ కార్యక్రమంలో పాల్గొని, కనీసం ఒకరికి, నోటి మాట సహాయముతో ఇప్పించలేక పోయినందుకు, సిగ్గు పడుతున్నాం.

జవాబు, ధన్యవాదాలు, అంటే మీకు చిత్తశుద్ధి గలవారు ను, ఆచరణ భక్తి గల వారిని, ఫిల్టర్ అంటే వేరు చేయడానికి గుర్తించడానికి తేలికగా, ఈ కధనాలు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మా వరికే ఉపయోగం అనుకున్నాము, మీకు కూడా అన్న మాట.

మా ఏప్రిల్ 10 వేల సహాయం సఫలం కు ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే, మీ చేతుల మీదుగా, మాట మీదు గా, మీ ఊరిలో ఒకరికి, మంచి జరుగుతుంది. దానికి మీ మనసు స్పందించింది.

అలాగే ప్రయత్నం కొనసాగించండి, ఫలితాలు లేకపోయినా, ప్రయత్నం కు పరమాత్మ సంతోషం గా ఉంటారు.

అదీ మానసిక దైవ సేవ నే. ఒకరికి, అదీ సాత్విక గుణ సాధకులకు, కడుపు నింపడానికి వెదుకులాట. డబ్బు కావాలని అడిగే వారిని చూసారు ఇన్నాళ్ళు, గుణవంతునికి డబ్బు ఇస్తాము అని కొత్తగా చూస్తున్నారు ఈనాడు. మంచి పూర్తిగా చావలేదు, అని ఇది ఉదాహరణ కదా?

భగవద్గీత లో చెప్పింది అదే, ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాలు నాకు వదిలేయండి అని. అందుకే ఎంతమంది గేళి చేస్తూ నవ్వుతూ ఉన్నా, గమ్ముగా జీవిత సినిమా లు నిర్లక్ష్యముగా చూస్తూ ఉన్నా, 2020 నుంచి త్రికరణ శుద్ధి గా, కనపడిన అందరినీ మేము సందేశాలుగా పంపుతూ, మాట సాయం కు, బతిమాలుతున్నాము.

ముఖ్యంగా శనివారం పంపేవి, ఇంట్లో వారు అలాగే ఇతరుల చేత కూడా చదివించండి లేదా చదివి వినిపిస్తూ అర్థం వివరించండి, ఎందుకంటే చాలా మందికి అందులో పదాలు అర్ధం కావు. ఉదాహరణకు జలనేతి, మానసిక సాధన, అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు, చేతివేళ్ళతో నామస్మరణతో 108 ప్రదక్షిణాలు ఉత్త పాదాలతో పరగడుపుతో. మనసులో నాటుకోవాలి. తినగ తినగ వేము తీయన. వారు చిన్నగా సాధన మొదలు పెట్టాలి ఆచరణలో. 30 దాటినాక, వారికి రోగాలు వ్యసనాలతో, మనశ్శాంతి లేక, సాధన చేయలేరు, మనసు అంగీకరించదు, ప్రాపంచిక మోహాలు సంపాదనలో పడి.

మన ప్రయత్నం, ఇతర ముదుసలి తల్లుల తండ్రుల, భవిష్యత్తు కన్నీళ్లు తుడువాలి, వారి జీవితం సరిచేసే అవకాశం ఇవ్వాలి, ప్రాపంచిక మోహ భ్రమ ల నష్టం వివరించి, ప్రతి వారం పంపే ఉదాహరణలతో. అదీ పుణ్యమే, మనల్ని, మన బలం, బలహీనతను తెలుసుకోలేని, అంగీకరించలేని, జన్మ వృధా. కనీసం మీలా జవాబు చెప్పడానికి, పశ్చాత్తాపం పడటానికి, ఎంత మందికి సంస్కార సంసార పెంపకం ఉంటుంది?

మన మనవళ్లు మరియు మన పిల్లల ను సంస్కారం గా పెంచాలి అన్నా, మనల్ని ముదుసలి తనం లో ప్రేమగా చేయి పట్టి నడపాలన్నా, వీళ్ల ను వీరు, అరిషడ్ వర్గాలు అష్ట వ్యసనాల బానిసత్వం వీడి, పంచభూతాల శిక్షణ కు గురి కాకుండా, కాపాడుకోవాలంటే, ఇంతకన్నా ఎక్కువ కఠిన సాధన చేయాలి, మానసిక దైవ బలం పెరగాలి మరి.

అది ఒక రోజు, ఒక సంవత్సరం లో రాదు. కఠినమైన సజీవ గురువు సేవ కూడా ఉండాలి, విసుగు లేకుండా రాత్రిళ్ళు నిద్రలేచి అన్ని అందించాలి, మంచము మీదవి ఎత్తి పోయాలి, అవసరమైతే ఎమెర్జెన్సీ కి తీసుకు పోవాలి, రోజూ మైలు నడక నడిపించాలి, ప్రేమగా తినిపించాలి, బూట్లు తొడగాలి, సాక్స్ విప్పాలి, జడ వేయాలి, రంగు పూయాలి, మందులు సమయానికి తెచ్చి వేయాలి, మంచి డాక్టరుకు చూపించాలి, మనతో 10 చోట్లకు తిప్పాలి. కన్న కూతురు తో సమానముగా చూడాలి.

విష్ణు లేదా జగన్మాయ ను దాటడం అంత తేలిక కాదు సుమీ. ఇంత సాధన చేస్తున్నా కూడా, ఇప్పుడు మనల్నే పతనం చేయడానికి, వంద భ్రమలు కోరికలు సుఖాలు మోహాలు సౌకర్యాలు, అందుబాటులో ఉన్నాయి, ఆకర్షిస్తున్నాయి, వేటికీ లొంగము లొంగకూడదు, 9 ఏళ్ళు పైగా.

ఎందుకంటే వాటి అంతిమ ఫలితాలు, దైవం కు దూరం చేసి, శారీరక మరియు మానసిక బలహీనులని చేసి, పతనం చేయడమే. మరు పాప జన్మల సంఖ్య విపరీతముగా పెంచడమే. మరలా ఈ సినిమా కష్టాలు, మరలా మరలా వద్దు తండ్రి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,971; 104 తత్వాలు (Tatvaalu) and views 225,185
Dt : 09-Apr-2023, Upd Dt : 09-Apr-2023, Category : General
Views : 453 ( + More Social Media views ), Id : 1743 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parents , old , mom , dad , service , stone , response , finding , qualities , effort , wipe , tears , future
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content