ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా - ఇద్దరూ ఇద్దరే - అక్కినేని, నాగార్జున, కె.ఆర్.విజయ, రమ్యకృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,896; 104 తత్వాలు (Tatvaalu) and views 225,182.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఓనమాలు నేర్పాలని, అనుకున్నా కన్నా, అందనంత ఎదిగిన, నిను చూస్తున్నా నాన్నా? మన అమ్మా/ నాన్న ఈ మాటలు అంటే, మనకు జన్మ ధన్యము అయినట్లే. మన అమ్మా/ నాన్న ఎప్పుడైనా అన్నారా అలాగా? అలా మనము ఎప్పుడైనా ఉన్నామా? విశ్వసనీయత క్రుతజ్ఞత తో, రుణం తీర్చుకుంటూ? వ్యక్తిత్వం లో ఎదిగామా?

అందనంత ఎత్తుకు ఎదగడము అంటే, చాలా మందికి తెలీదు, దేనిలో? ధనము, ఆస్తి, పదవి, అధికారం, సంస్కారం, త్యాగం, సేవ, ఆత్మీయత, బాధ్యత లోనా? అందరూ పెద్ద ఉద్యోగము, కంపెనీలు, విదేశాలు, పదవి అనుకుంటారు.

ఉదాహరణకు, విదేశాల్లో లేదా (పక్క) రాష్ట్రం లో 3 జిల్లాలు కొనే శక్తి ఉన్న పెద్ద చదువులు చదివిన మనుషులు, తన ముదుసలి అమ్మా నాన్నకు (మరియు అత్త మామకు) మాత్రం, ఇంట్లో చోటు ఇవ్వరు, ఉత్తమ వైద్యం ఇవ్వరు, చేయి పట్టి రోజూ నడిపించరు, నోటిలో ముద్ద పెట్టరు. ఎవరికి ఆ ఉన్నత పదవి ఆస్తులు చదువులు పదవులు స్తితి వలన ఉపయోగం? అవి శాశ్వతమా?

తల్లి దండ్రులు, తమ పిల్లలు మంచి చోట మంచి వసతులతో ఉండాలి అని తమ రక్తం చిందించి చదివిస్తే, ఉద్యోగాలు తెప్పిస్తే, వీరు మాత్రం, మా పెద్దలు మాతో ఉండటానికి అర్హత లేదు అని ఖరా ఖండిగా దూరం గా ఉంచుతున్నారు.

అదేమంటే, పాపాత్ములమైన మేము పరాయి నేల పై పోయినా, తమ తల్లి దండ్రులు మాత్రం తమను కన్న పాపానికి, అక్కడే ఒంటరిగా అనాధలు గా పోవాలి అంటున్నారు. వీరు పరాయి నేల నుంచి వచ్చిన దాకా, ఆ పెద్దల కు చివరి సంస్కారములు కూడా లేటు చేస్తున్నారు, మనశ్శాంతి తో పోనీయక.

పోనీ వారైనా సుఖముగా ఉన్నారా, అదీ లేదు, ప్రాపంచిక బ్రమలలో పరుగులు తీస్తూ, ఇంట్లో మాటవినని జనాలతో, రోగాలతో, ఒత్తిడిలతో, మనశ్శాంతి లేక సతమతమౌతున్నారు.

కాబట్టి అందనంత ఎదిగినా అంటే, అన్ని సౌకర్యాలు ఇచ్చి, వారిని పాపాయిలుగా మనం సాకటమే. మన తల్లి దండ్రులు మనల్ని చిన్న పిల్లలుగా సాకారు. మనమూ వారి ముదుసలి వయస్సులో, వారి చేతులు పట్టుకుని నడిపిస్తూ, వారి నోట్లో ముద్ద పెడుతూ, మనతో వారిని పండేసుకుని పసి పిల్లలుగా లాలిస్తే, అదే గొప్ప భాగ్యం మనకు వారికి కూడా. అప్పుడు వాళ్ళు ఆనంద భాష్పాలు రాలుస్తారు, దేవుడు మనల్ని భుజము తట్టి, ఉత్తమ మరుజన్మ ఇస్తారు.

కలిసొచ్చిన కాలానికి, నడిచొచ్చిన పిల్లలు కి, స్వాగతం చెబుతారు. నేనే పసివాణ్ణై, నీ నీడ చేరుకున్నా అంటారు. ఈ పాట పాడి అమ్మా నాన్నలకు, సంతోషం కలిగిస్తారు కదూ.

ఓనమాలు నేర్పాలని, అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన, నిను చూస్తున్నా నాన్నా.. మొత్తము 2 సార్లు
కలిసొచ్చిన కా.లానికి, నడిచొచ్చిన కొడుకుకి 2
స్వాగతం చెబుతున్నా..
నేనే పసివాణ్ణై, నీ నీడ చేరుకున్నా

జీవితాన ప్రతి పాఠం, చేదే అనుకున్నా
తీయనైన మమతల రుచి, నేడే చూస్తున్నా
అనుబంధపు తీరా.నికి, నడిపించిన గురువని 2
వందనం చేస్తున్నా..
నేనే గురుదక్షిణగా అంకితమౌతున్నా.. ||ఓనమాలు ||

ఉడుకు నెత్తురున్న కొడుకు, దుడుకును ఆ.పా.లని
ఆపదలో పడనీయక, దీపం చూపాలని - మొత్తము 2 సార్లు
వచ్చిన ఈ పిచ్చి తండ్రి, పితృ ఋణం తీర్చి
చల్లారిన ఒంటికి నీ, వేడి రక్తమిచ్చి
తోడైన, నీ ముందు ఓడానా.. గెలిచానా..

ఒకే తండ్రి నుంచి, రెండు జన్మలందుకున్నా
తీరని ఆ ఋణం ముందు, తలను వంచుతున్నా..||ఓనమాలు ||

పగలే. గడిచింది, పడమర పిలిచింది
వయసు పండి, వాలుతున్న సూర్యుణ్ణి నే,ను
కాచుకున్న కాళరాత్రి, గెలిచే సులువేమిటో
కాటుక నది ఈదొచ్చిన, నువ్వు చెప్పు వింటాను

రాతిరి కరిగింది, తూరుపు దొరికింది
కళ్ళు తెరిచి ఇపుడిపుడే ఉదయిస్తున్నాను
అచ్చమైన స్వచ్చమైన,తెలుపంటే ఏవిటో
మచ్చలేని నీ మనసును, అడిగి తెలుసుకుంటాను

ఇన్నా.ళ్ళ మన దూరం, ఇద్దరికీ గురువురా
ఒకరి కధలు ఇంకొకరికి, సరికొత్త చదువురా
పాటలు ఏవైనా, నీతి ఒక్కటే నాన్నా
చీకట్లు చీల్చడమే, ఆయుధమేదైనా ||ఓనమాలు ||

ఇద్దరూ ఇద్దరే - అక్కినేని, నాగార్జున, కె.ఆర్.విజయ, రమ్యకృష్ణ
Onamalu Nerpalani Anukunna Kanna - Iddaru Iddare - Akkineni, Nagarjuna, KR Vijaya, Ramyakrishna  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,896; 104 తత్వాలు (Tatvaalu) and views 225,182
Dt : 01-Jan-2023, Upd Dt : 01-Jan-2023, Category : Songs
Views : 510 ( + More Social Media views ), Id : 1671 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : onamalu , nerpalani , anukunna , kanna , iddaru , iddare , akkineni , nagarjuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content