పాటతో పరమార్ధం - ఓం నమో నమో, నటరాజ నమో - నాగల చవితి - జానకి, జమున, నాగభూషణం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1946 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1981 General Articles and views 1,681,003; 102 తత్వాలు (Tatvaalu) and views 207,968.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Om Namo Namo Nataraja namo - Nagalu Chavithi - Janaki, Jamuna, Nagabhushanam, Raghurammayya

ఓం నమఃశ్శివాయ అంటూ, శివయ్య భక్తులు నోరారా ప్రేమగా ఆరాధిస్తారు. మరి శివయ్య లక్షణాలు ఆచరణలో చూపండి అంటే, మాత్రం వెనకడుగు వేస్తారు.

శివయ్య ఎప్పుడూ ధ్యానం లో ఉంటారు, మరి శివ భక్తులు గా మీరూ, రోజు అరగంట అయినా ధ్యానం చేస్తారా? శివయ్య రోజూ, శివ తాండవం చేస్తారు, మరి మీరు యోగా వ్యాయామం చేస్తారా అంటే, మరలా కష్టం.

లేదా శివయ్య లాగా అరిషడ్వర్గ అష్టవ్యసనాల నుంచి దూరం గా ఉండగలరా అంటే, జవాబు చెప్పలేరు.

పోనీ శివయ్య లాగా, ప్రజల కోసం గరళము తాగి, ఓర్పు సహనము చూపిస్తారా? పోనీ శివయ్య లాగా, అందరికీ ఉదారముగా సహాయం చేస్తారా? పోనీ శివయ్య లాగా పిల్లలను సంస్కారంగా, ప్రజా రక్షణ కోసం పెంచగలరా? అబ్బే మా వలన కాదండి. మొక్కుబడి పూజలు వేరు, ఆచరణ దోవలు వేరు అని వారికి తెలుసు.

కనీసం శివయ్య లాగా, అప్పు లేకుండా ఉందామా అంటే, అది కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడైనా శివయ్య నిరాడంబరతనం మనకు అలవాటు అయితేనే, మోక్షానికి దోవ కనపడుతుంది. లేదంటే, ఎన్నో జన్మలు ఎత్తి, ఇవే సాధనలు చెయ్యాలి, లేదా ఇవే నరక యాతనలు పడాలి.

ఛాయిస్ మనదే, కాళ్ళు చేతులు ఆడినంత వరకు మన బతుకు దోవ మార్చుకోవడానికి, ఆ తర్వాత ఛాయిస్ పంచభూతాలదే, మనము నిమిత్త మాత్రులము. మరి ఈ చక్కని గీతాన్ని పాడి అందరికీ వినిపిస్తారు కదూ?

ఓం నమఃశ్శివాయః, ఓం నమఃశ్శివాయః 2

ఓం నమో నమో, నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో, నటరా.జ.
నమో నమో నటరా.జ. - మొత్తము 2 సార్లు

గంగా గౌరి, హృదయ విహారి .. 2
లీలా కల్పిత సంసారి.. 2
[గంగా గౌరి హృదయ విహారి, లీలా కల్పిత సంసారి]
భళిరే, భాసుర, బ్రహ్మచారి 2
భావజ, మద సంహా.రి 2 ||ఓం నమో నమో||

ఫణిభూషా.., బిక్షుకవేషా... 2
ఈశా, త్రిభువన సంపోషా 2
అఖిల చరాచర, అమృతకారీ 2
హాలాహల, గళధా.రి. 2 ||ఓం నమో నమో||

మహాదేవ జయ, జయ శివశంకర..
జయ శివశంకర
జయ త్రిశూలధర, జయ డమరుక ధర..
జయ డమరుక ధర
హే దేవాది, దేవ మహేశ, జయజయ గౌరీశా 2
జయజయ శ్రీ గౌరీశా ||ఓం నమో నమో||

ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః

ఓం నమో నమో నటరాజ నమో పాట లిరిక్స్, నాగుల చవితి (1956)

చిత్రం : నాగుల చవితి (1956); సంగీతం : గోవర్థనం, సుదర్శనం; సాహిత్యం : పరశురాం; గానం : టి.ఎస్.భగవతి
R. Nagendra Rao, K. Raghurammayya రఘురామయ్య  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1981 General Articles and views 1,681,003; 102 తత్వాలు (Tatvaalu) and views 207,968
Dt : 13-Sep-2023, Upd Dt : 13-Sep-2023, Category : Songs
Views : 214 ( + More Social Media views ), Id : 1917 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Om , Namo , Nataraja , Nagalu , Chavithi , Janaki , Jamuna , Nagabhushanam , Raghurammayya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content