Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Oka Udayamlo mana hrudayamlo (Parody) - Kalpana - Murali Mohan, Jayachitra
ప్రాపంచిక వ్యామోహము అనుకుంటాము కదా, అదే ఆ కల్పన, బ్రమ. అంతా మనదిగా, మన వారిగా ఉంటుంది, ఒకానొక బలహీన క్షణములో, ఏదీ మనది కాదు అనిపిస్తుంది, అందరూ అంతా మోసము చేసారు అనిపిస్తుంది, ఎందుకంటే మనది బలహీనమైన మనసు. మనము అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉన్నప్పుడు, అన్ని రంగులలో అందముగా కనపడతాయి. ఆ బ్రమలు వీడగానే, వాస్తవం బోధ పడుతుంది.
మరి ఎక్కడిది ఆ కల్పన? ఆ బ్రమ? కేవలం మన మనసులో ఉన్న బలహీనత, మన మనసు లో ఉన్న ఆలోచన. అందుకే మనసును అదుపు చేయాలి. అది అందరికీ సాధ్యము కాదు సుమీ. అది ఏ రోజైనా మన మనసులో తలంపు వచ్చింది అంటే, దాని ప్రకారం మన మాటలు చేష్టలు అన్ని మారిపోతాయి. అందుకే దానిని సాధన వైపు మరల్చాలి, మానసిక బలం పెంచాలి, అదుపులో ఉంచుకోవాలి.
లేకపోతే, మనిషి మనిషికీ, మధ్య పోరాటము ఎందుకో? అందరి మనసే అశాంతిగా, మనిషికి సుడిగా అంటే సుడిగుండాలుగా, వరుస కలతలు ఎందుకో, కన్నీరు ఎందుకో? తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పనా. అది ఒక కల్పన, అది మన సొంత కల్పన. ఆవును ఓడించి, నక్క పులి పాముకు ఓటు ఎవరు వేసింది? మనమే కదా? అది మన సొంత కల్పన.
దివ్వె దివ్వెలో వెలుగు, మన జపం సాగితే, పువ్వు పువ్వునా మధువు, మన ధ్యానం సాగితే కాబట్టి, ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం.
ఇది మన కల్పన.. కవితా..లా.పన..
ఒక ఉదయంలో..., మన హృదయంలో 2
విరిసిన మందా.రం, మెరిసిన సింధూ.రం 2
కల్పనా.., అది ఒక కల్పన.., అది మన కల్పన ||ఒక ఉదయంలో||
తార తారకి., నడుమ, ఆకాశం ఎందుకో
పాట పాటకి., నడుమ, ఆవేశం ఎందుకో.. - 2 సార్లు మొత్తము
మనిషి మనిషికీ, మధ్య పోరాటము ఎందుకో
మనసే అశాంతిగా.., మనిషికి సుడిగా..కలత ఎందుకో.. కన్నీరు ఎందుకో..
తెలియని ఆవేదనే., ఆ.లా.పన
తెలుసుకున్న వేదనే, కల్పనా..
అది ఒక కల్పన.. అది మన కల్పన...||ఒక ఉదయంలో||
దివ్వె దివ్వెలో.., వెలుగు, మన జపం సాగితే.
పువ్వు పువ్వునా.., మధువు, మన ధ్యానం సాగితే..- 2 సార్లు మొత్తము
కవి మనస్సులో, ఉషస్సు కారు చీకటౌతుంటే
మిగిలిన కథలో.., పగిలిన ఎదలో..ఈ కవితలెందుకో.. కవితలెందుకో..
తెలియని ఆవేదనే, ఆ.లా.పన
తెలుసుకున్న వేదనే, కల్పనా..
అది ఒక కల్పన.. అది మన కల్పన...||ఒక ఉదయంలో||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,788; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446 Dt : 14-Jul-2023, Upd Dt : 14-Jul-2023, Category : Songs
Views : 230
( + More Social Media views ), Id : 1835 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Oka ,
Udayamlo ,
mana ,
hrudayamloa ,
Parody ,
Kalpana ,
Murali ,
Mohan ,
Jayachitra ,
Balu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments