దేశం లో ఉండి పేరెంట్స్/సమాజం ను చూడని వారికన్నా, రోజూ చూసి మాట్లాడే ఎన్నారై మిన్న కాదా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,074; 104 తత్వాలు (Tatvaalu) and views 224,934.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పుట్టిన గడ్డ మీద పెరిగి, చదివి, వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తూ , తల్లి దండ్రులు ను తనతో పాటుగా ఇంట్లో ఉంచుకొని , తగిన మర్యాద తో చూసేవాళ్ళు ధన్య జీవులు. అలాంటి వారు, నూటికి 10 మంది కూడా ఉండరు ఈ రోజుల్లో.

అంటే ఉదాహరణకు ఒక చిన్న పట్టణం వరంగల్ లేదా కడప లేదా ఒంగోలు లో పుట్టిన వ్యక్తి, తన జీవితం మొత్తం ను అక్కడే గడపడం, తల్లి దండ్రులు తో. వారు నిజంగా గొప్ప వారు, సందేహము లేదు.

కానీ పాత రోజుల లో కాలేజీ లే లేవు, కనీసం జిల్లా లో కూడా లేవు. ఇప్పుడు ఉన్నా, మంచి కాలేజీ లేదా డబ్బు కాలేజీ కోసం జిల్లాలు రాష్ట్రం లు దాటుతున్నము. ఇంకా ఘోరం ఏమిటి అంటే, పదవ తరగతి లోపు కి కూడా ఊరు , జిల్లా దాటిస్తున్నాము హాస్టల్ లో వెస్తున్నాము. కారణం ఏదైనా కన్న ఊరు దాటుతున్నం, అక్కడే మన నిజాయితీ మంట కలిసింది.

ఉద్యోగం కి కూడా మహనగరాలు, వేరు రాష్ట్రం లు దాటుతున్నాము. మరి తల్లి దండ్రులు బరువు, బిడ్డలు తో లేదా పెళ్ళి తర్వాత వచ్చిన వారితో పొసగదు. పేరెంట్స్ కి జబ్బు చేస్తే అర్జంట్ అంటే మద్రాసు లో , ముంబైలో, ఢిల్లీలో ఉన్నా కూడా వస్తారో రారో? గంటలో అయితే రారు , ప్రాణాలు ఉంటాయా?

కన్న ఊరు దాటాక , తల్లి దండ్రులు ను విడిగా పెట్టాక , వారు పక్క బజారు , జిల్లా, రాష్ట్రం, దేశంలో ఉన్నా తేడా ఏమిటి? మనసు లు కలవనప్పుడు, కృతజ్ఞతలు లేనప్పుడు బిడ్డలు, అదే ఊళ్ళో ఉన్నా , విదేశాల్లో ఉన్నా తేడా లేదు.

నాకు తెలిసి విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా, ప్రతి రోజూ, పేరెంట్స్ తో మాట్లాడుతూ చూస్తూ, డబ్బు ఇస్తున్న వారూ ఉన్నారు. మరి స్వదేశం లో ఉండీ, దేశానికి, రాష్ట్రం కి , సొంత ఊరికి , కనీసం సొంత తల్లి దండ్రులు కు ఉపయోగం లేని, కుటుంబం కి సంపాదనకు బానిసై ప్రతి రోజు చూడని మాట్లాడని, గడ్డలు లాంటి బిడ్డలు ఉన్నారు. కనీసం ఓటు కూడా వేయరే , వేసినా డబ్బు ఇవ్వాలే. దీన్ని దేశ సేవ అంటారా?

ఒక ఎన్నారై సంవత్సరం కు సొంత ఊరికి వచ్చి, కొన్ని రోజులు ఉండి పోతే చాలు, దానం కూడా చేయక్కరలా, ఆ ఊరికి లేదా ఆర్థిక వ్యవస్థ కు, కనీసం తక్కువ లో తక్కువ లక్ష రూపాయలు పైగా ఖర్చు పెడతారు, విమాన ఖర్చులు గాక. అది ఆ ఊరి జనులు పన్నులు కు ఉపయోగం కాదా?

ఒక చిన్న ఎన్నారై ఊరికి వెళితేనే ఒక పనిమనిషి, బట్టలు షాపు , ఆటో , కారు , కిరాణా, తిండి, సినిమా, షికారు, హోటల్, రూము , గుడి , చందాలు , విరాళాలు, బహుమతులు ఇంకా ఎన్నో. ఎంతో మందికి చేతి నిండా పని డబ్బు వస్తున్నాయి నిజం కాదా?

అందుకే దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విదేశీ మారక ద్రవ్యం కోసం, రండి, వీలైనంత పంపండి, ఖర్చు చేయండి అని ఎన్నారై ల ను ప్రోత్సాహం చేస్తుంటాయి. ప్రయాణం లో మధ్య దేశాలు కూడా, ఒక్క రోజు మాతో ఇక్కడ ఉండి, భారత్ వెళ్ళండి అని, అన్ని సదుపాయాలు ఇస్తాయి.

ఊళ్ళో(దేశం లో) ఉండి కూడా పన్నులు కట్టకుండా, ఓటు వేయకుండా, రూల్స్ పాటించకుండా, కన్న ఊరికి ఉపయోగం లేకుండా, దొంగ వ్యాపారం చేస్తూ లేదా రోజూ తల్లి దండ్రులు ను చూడని మాట్లాడని గౌరవించని వారికన్నా, విదేశాల్లో దూరంగా ఉండి తల్లి దండ్రులు తో రోజూ చూసి మాట్లాడుతూ, కనీసం సొంత ఊరులో ఖర్చు చేశే ఎన్నారై మిన్న కాదా. ఆలోచన చెయ్యండి.

మంచి ని ఒప్పకోవాలన్నా కూడా సంస్కారం కావాలి, పెద్ద మనసు ఉండాలి. నా బిడ్డాలు కుటుంబము ముఖ్యమా, నా తల్లి దండ్రులు ముఖ్యమా అనే వితండ వాదులకు, జవాబు చెప్పలేము. అదే వారి పేరెంట్స్ అనుకుంటే, తను రోడ్ మీద ఉండేవారు. ఇద్దరూ ముఖ్యమే, వారు లేక నీవు లేవు, నీవు లేక వీరు లేరు. అలాగే, దేశం లో అయినా, విదేశము లో అయినా మంచి వారు ఎక్కడ ఉన్నా ఒకటే, ఎవరూ గొప్పా కాదు, ఎవరూ తక్కువా కాదు.

మీకు తెలిసిన ఎన్నారై లు ఉంటే, వారిని ప్రతి సంవత్సరం, కనీసం వారం రోజులు, వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్లుగా ప్రోత్సాహం చేయండి. వాళ్లు ఊరక ఇవ్వనక్కర లేదు, ఖర్చు చేసినా చాలు.

దాని వలన మన ఊరుకు, జిల్లా కు, రాష్ట్రం కు, దేశం కు మీరు మంచి చేసినట్లు. అది కూడా, మీకు కన్న ఊరు సేవే, రూపాయ మీ సొంత డబ్బు ఖర్చు లేకుండా.

ఎన్నారై లు, మా కెందుకులే తలనొప్పి చుట్టాలు, స్నేహితులు, పక్క వారితో అని దూరంగా ఉండి , అమ్ముకొని కూడా దూరంగా వెళతారు. అది మన ఊరి కి నష్టం, అందుకే వారికి అండగా ఉండి, వారి వలన మన ఊరు దేశానికి వచ్చే ఆదాయం ను పెంచాలి. కనీసం విహర యాత్ర కు వచ్చిన చాలు. అదే టూరిజం.

ఒక ఎన్నారై, మన ఊళ్లో టాక్స్ లు కట్టి, రూల్స్ పాటించి, బాధ్యత గా ఉండే, పదిమంది చదువుకున్న డిగ్రీ చేసిన ఉద్యోగుల కు సమానం. వారు మన ఊరు రాష్ట్రం దేశం ఆస్తి. వారిని దూరం చేసుకోకూడదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,074; 104 తత్వాలు (Tatvaalu) and views 224,934
Dt : 13-Oct-2019, Upd Dt : 13-Oct-2019, Category : General
Views : 1192 ( + More Social Media views ), Id : 185 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : NRI , caring parents , foreign currency , NRI expenditure , good for own city village
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content