నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే, పేరడీ ఓల్డ్ పేరెంట్స్ కోసం, విచిత్ర సోదరులు, కమల హాసన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

విచిత్ర సోదరులు సినిమా చూసారా, కమల హాసన్ 2 పాత్రలు, పొట్టి మనిషి గా ఒక పాత్ర. చాలా బాగా ఆడింది, ఆ పాత్రనే సినిమాకు హైలైట్.

ఈ పాట కూడా, మనము ఒంటరి ముదుసలి తల్లి దండ్రులకు అనుకూలముగా వారికి మద్దతు ఇస్తూ, పిల్లలను ఆలోచన చెయ్యమని, ఉత్తమ వైద్యం సమాన సౌకర్యాలు ఇచ్చి, రోజూ చేయి పట్టి నడపాలన్న మంచి ఉద్దేశ్యముతో, ఈ పాటల ప్రయత్నము అని, మీకు తెలుసు.

Parody

మిమ్ము పెంచి మైమరచాం… చిత్రమే అది చిత్రమే
మమ్ము విడచి నవ్వుకున్నారు … పాపమే అది మోసమే 2 సార్లు
ఆ నింగినెన్నటికీ… ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే… ఈనాడు తెలిసెనులే, ఓ పిల్లలూ/ ద్రోహులూ..!
మిమ్ము పెంచి మైమరచాం… చిత్రమే అది చిత్రమే
మమ్ము విడచి నవ్వుకున్నారు … పాపమే అది మోసమే

ఆడుకుంది మాతో జాలిలేని మోహం
ఉండలేక మీతో ఓడిపోయే జీవితం
జోరువానలోనా ఉప్పుమైతి మేమే
హొరుగాలిలోనా ఊకమైతి మేమే
గాలి మేడలే కట్టుకున్నం… చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నం… చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా… కల చెదిరెను కాదా, అంతే..!
మిమ్ము పెంచి మైమరచాం… చిత్రమే అది చిత్రమే
మమ్ము విడచి నవ్వుకున్నారు … పాపమే అది మోసమే

కళ్ళలోన మేము కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో మాలో చేరుకుంది చూడు
చేసు కున్న తలరాత తప్పదు… చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే మాకు ఇప్పుడు… చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా, అంతే

మిమ్ము పెంచి మైమరచాం… చిత్రమే అది చిత్రమే
మమ్ము విడచి నవ్వుకున్నారు … పాపమే అది మోసమే 2 సార్లు
ఆ నింగినెన్నటికీ… ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే… ఈనాడు తెలిసెనులే, ఓ పిల్లలూ..!
మిమ్ము పెంచి మైమరచాం… చిత్రమే అది చిత్రమే
మమ్ము విడచి నవ్వుకున్నారు … పాపమే అది మోసమే

Original

నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే 2
ఆ నింగినెన్నటికీ… ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే… ఈనాడు తెలిసెనులే, ఓ చెలీ..!
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం
జోరువానలోనా ఉప్పునైతి నేనే
హొరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలి మేడలే కట్టుకున్నా… చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా… చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా… కల చెదిరెను కాదా, అంతే..!
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు… చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు… చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా, అంతే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే, ఓ చెలీ
నిన్ను తలచి మైమరచా… చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా… చిత్రమే అది చిత్రమే

1989's Telugu Movie Song Lyrics, Gowthami, Kamala Hasan, Rajasri, Rupini, Vichitra Sodarulu గౌతమి, కమల హాసన్, రాజశ్రీ, రూపిణి, విచిత్ర సోదరులు

Ninnu Thalachi Maimaracha chitrame parody for old parents Vichitra Sodarulu Kamala Hasan  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 22-Sep-2022, Upd Dt : 22-Sep-2022, Category : Songs
Views : 97 ( + More Social Media views ), Id : 1528 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ninnu , talachi , maimaracha , chitrame , parody , old , parents , vichitra , sodarulu , kamala , hasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content