పక్క ఇంటి దసరా బొమ్మల కొలువు - తాంబూలం పండు ప్రసాదం చీర తో - తమిళ సాంప్రదాయం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1621 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1656 General Articles, 63 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇప్పుడు కొత్త గా 2 నెలల ముందు మారిన చోట, పక్క తమిళ వారు ఉన్నారు. మన మంత్రాలు, అమ్మ ముగ్గులు అన్ని గమనిస్తూ ఉంటారు.

అమ్మ కూడా, ప్రతి పండగకు లేదా కార్యక్రమం కు, ప్రసాదం ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది, తలుపు తట్టి బయటకు పిలిచి.

వాళ్ళు ఏమైనా అనుకుంటారు, అలా పిలుస్తూ ఉంటే, వద్దు లే అంటా. ఎప్పుడూ చేసే మరియు పెట్టే చెయ్యి ఊరుకోదు. పాత ఇంటి దగ్గర, తెల్ల తమ్ముడు, మళయాళ కూతురు తెలుసు కదా. ఇక్కడ కూడా పంచుడు మొదలు.

తమిళ వాళ్ళు, ఈరోజు వచ్చి మా కుటుంబం, దసరా బొమ్మల కొలువు పెట్టాం. అమ్మ ను పంపండి, బొమ్మల కొలువు చూసి, తాంబూలం తీసుకుని వస్తారని అంటే,

నిన్న అమ్మ పడింది దేవాలయములో జాగ్రత్త మరి, నేను బయట దాకా వచ్చి గుమ్మం దగ్గర వదులుతా, నాకు పని ఉంది అంటే, లేదు మీరు కూడా చూడాలి రావాలంటే, నేనూ తోడు వెళ్లిన.

నా భయం అమ్మ మరలా దోవలో లేదా అక్కడ పడితే, ఇద్దరు కూ ఇబ్బందులు, వారి కార్యక్రమం కు ఆటంకం ఏర్పడుతుంది అని, అలాగె మనమూ ఆసుపత్రికి పరుగులు.

శుక్రవారం పూట నిండు ముత్తెదువు లా మహాలక్ష్మి లా ఆహ్వానిస్తూ, మనకు తాంబూలం పండు ప్రసాదం తో, ఈ నవరాత్రులు సమయంలో, మంచి చీర కూడా అమ్మ చేతిలో పెట్టి, పాదాలకు వంగి నమస్కారం చేసింది.

మేము బిత్తరపోయాము, నోట మాట రాలేదు, ఊహించని పని అది. వాళ్ళ చిన్న పిల్లలు కూడా గమనిస్తున్నారు, ఏమి జరుగుతోంది ఇక్కడ అని, ఎవరు వీరు ఎందుకు వచ్చారు అమ్మ ఎందుకు నమస్కారం చేస్తోంది అని.

అదేమిటండీ తాంబూలం అని చెప్పి, చీర ఇచ్చారు, ఉన్న వే అక్కడ మూటగట్టి ఉన్నాయి, ఎందుకు అలా, ఇప్పుడు అవసరం ఏముంది, అమ్మ పెద్దగా కట్టదు అవి, అయినా ఇంకా కొత్త వాళ్ళమే కదా, మనం కలసి పరిచయము అయ్యి ఇంకా 3 నెలలు కూడా కాలేదు కదా అంటే.

లేదు, మీరు తప్పక తీసుకోవాలి, కాదనవద్దు. మా అమ్మ లాంటిది, మా అమ్మ మమ్మల్ని దీవించినట్లే, నేను అమ్మ ను రోజూ చూస్తున్నా కదా, చిమ్ముతూ కళ్ళాబి తో ముగ్గు వేయడం అన్ని విషయాలు అంది.

ఇంక నాకూ మాట రాలేదు, ఏమి చెప్పాలో చెయ్యాలో తెలీదు.

సరే తీసుకోమ్మా అని, సకుటుంబ సపరివార సుఖీభవ సుఖీభవ, సుఖ సంతోష అష్ట ఐశ్వర్య అభివృద్ధి రస్తు అని అనుకున్నాం.

ఇది ఊహించని పరిణామం, లేకపోతే అసలు వెళ్ళము కూడా.

ఏమైనా, తమిళ వారి సాంప్రదాయం కు నమస్కరించాలి. వారు వైష్ణవులు, మంత్రాలలో నియమాలలో పద్ధతి లో వారు చాలా ధీటుగా ఉంటారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1656 General Articles, 63 Tatvaalu
Dt : 08-Oct-2021, Upd Dt : 08-Oct-2021, Category : General
Views : 519 ( + More Social Media views ), Id : 1258 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : neighbour , house , dasara , doll , collection , tambulam , fruit , saree , tamil , tradition
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content