పాటతో పరమార్ధం - నీవు లేక వీణా (పేరడీ) - డాక్టర్ చక్రవర్తి - ANR, సావిత్రి, జగ్గయ్య, జానకి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,030; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Neevuleka Veena (Parody) - Doctor Chakravarthy - ANR, Savitri, Jaggayya, Janaki

నీవు లేక వీణా పలుకలేనన్నదీ, నీవు రాక రాధా నిలువలేనన్నది అని దేవునికి, అలాగే దైవముగా భర్త ను ఆరాధించేవారు కూడా పాడుకోవచ్చును. మనము దేవుని పాటగా పాడుకుందాము.

వీణ పలకాలన్నా, నాదం పలకాలన్నా, మాట రావాలన్న, ఆ దేవ దేవుని అండ ఆజ్ఞ లేనిదే ఏదీ రాదు. కాబట్టి ఆ దైవం లేని జీవి యొక్క జీవితం అర్ధం లేనిది. దైవం ను మానసికముగా ధ్యానం లో నిలుప లేకపోతే, మనకు మానసిక నియంత్రణ లేదు కదా. అంటే, గాలికి ఎగిరిపోయే గడ్డిపోచలము అవుతాము మిత్రమా, ప్రాపంచిక మాయలలో చిక్కుకుని పతనము అవుతూ.

జాజి లేదా ఏ పూలు అయినా దేవుని కై, రోజు రోజు పూచె. దైవ పూజ లోకి తానే, సమర్పణ అయ్యే, మన జీవితము కూడా, మంచి కై, సేవ కై సమర్పణ కావాలి. మనమైనా లేదా చందమామ అయినా, దైవం కోసం, జన్మ జన్మ లు చూసి, దర్శనం లేదని, సాధనలు చేసే ప్రయత్నము తప్పదు.

నేరు గా ప్రత్యక్షం చేసుకునే కఠిన సాధన మనకు లేకపోయినా, కలలనైన దేవుని, కనుల చూతమన్నా, శాంతి లేని మనకు, కలలు కూడ చక్కగా రావె. కదలలేని కాలం ఓ వైపు, ప్రాపంచిక బ్రమల గీతి రీతి ఇంకోవైపు, జీవితము వృధగా, బరువుగ సాగె అని మోహ దాసులు తెలుసుకోవాలి.

జీవితపు తలుపులన్ని మీకై, తెరచి వుంచి నాము స్వామీ. చెడు తలపులెన్నొ మదిలో, వాటిని నియత్రణ చేసి, వాటిని వీడి, మీ దర్శనం కోసమై వేచి నాము తండ్రి. కాల చక్ర జన్మలింక మేము, ఓపలెము స్వామి, ఈ ప్రాణిని, కరుణను, యేలగ రావా అంటూ ఆర్తిగా ఆ దేవుని వేడుకుందాము.

మీరు లేక జీవం., అర్ధంలేదన్నదీ
మీరు రాక ధ్యానం, నిలువలేనన్నది ఆ ఆ ||మీరు లేక జీవం.||

జాజి పూలు మీ.కై., రోజు రోజు పూ.చె.
పూజ లోకి తానే, సమర్పణ అయ్యే
చందమామ మీకై., జన్మ జన్మ చూసి.. 2
దర్శనం, లేరని, సాధనలు చేసే||మీరు లేక జీవం.||

కలలనైన మి.మ్ము., కనుల చూతమన్నా.
శాంతి లేని మా.కు, కలలు కూడ రా.వె
కదలలేని కా.లం, బ్రమల గీతి రీ.తి. 2
జీవితము, వృధగా, బరువుగ సాగె ||మీరు లేక జీవం.||

తలుపులన్ని మీ.కై., తెరచి వుంచి నా.ము
తలపులెన్నొ మదిలో., వీడి వేచి నా.ము
జన్మలింక మే.ము, ఓపలెము స్వా.మి.. 2
ప్రాణిని, కరుణను, యేలగ రావా ||మీరు లేక జీవం.||

Original

నీవు లేక వీ.ణా., పలుకలేనన్నదీ
నీవు రాక రా.ధా., నిలువలేనన్నది ఆ ఆ ||నీవు లేక వీణా.||

జాజి పూలు నీ.కై., రోజు రోజు పూ.చె.
చూసి చూసి పా.పం, సొమ్మసిల్లి పో.యె
చందమామ నీకై., తొంగి తొంగి చూసి.. 2
సరసను, లేవని, అలుకలు బో.యె ||నీవు లేక వీణా.||

కలలనైన ని.న్ను., కనుల చూతమన్నా.
నిదుర రాని నా.కు, కలలు కూడ రా.వె
కదలలేని కా.లం, విరహ గీతి రీ.తి. 2
పరువము, వృధగా, బరువుగ సాగె ||నీవు లేక వీణా.||

తలుపులన్ని నీ.కై, తెరచి వుంచి నా.ను
తలపులెన్నొ మదిలో., దాచి వేచి నా.ను
తాపమింక నే.ను, ఓపలెను స్వా.మి.. 2
తరుణిని, కరుణను, యేలగ రావా ||నీవు లేక వీణా.||

Neevuleka Veena Acharya Aatreya P. Susheela  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,030; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380
Dt : 17-Oct-2023, Upd Dt : 17-Oct-2023, Category : Songs
Views : 216 ( + More Social Media views ), Id : 1940 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Neevuleka , Veena , Doctor , Chakravarthy , ANR , Savitri , Jaggayya , Janaki , Acharya , Aatreya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content