పాటతో పరమార్ధం-నీలి మేఘమా(భక్తి పేరడీ)-అమ్మాయిల శపథం-చంద్రమోహన్, రామకృష్ణ, చంద్రకళ, లక్ష్మి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,333; 104 తత్వాలు (Tatvaalu) and views 226,477.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Neeli Meghama - Ammayila Sapatham(Parody) - Chandra Mohan, Ramakrishna, Chandrakala, Lakshmi

ఆకాశములో దేవుని చుట్టూ తిరిగే ఓ మేఘమా, మా పై జాలి చూపి ఓ నిమిషము ఆగి, మా దైవంతో మా ధ్యానమనే ప్రయత్నమును, మనసారా దీవించి, మా మదిలో స్థిరముగా నిలిపి వెళ్ళుమా అని ఆర్తిగా పాడుకుందాం.

మము కన్న బంధమా అంటే తల్లి తండ్రులూ, మా గురించి కలత మానుమా, ఒక్క నిముష మాగుమా ఆలోచన చెయ్యి, మన దైవము, మన కోసము, ఆత్మగా నిలిచె చూడుమా ఆత్మ జ్ఞానముతో, ఇంక భయము ఎందుకు?

దేవుని తలచడానికి యోగ్యం కాని వస్తువు, అలాగే పదము ఏమున్నది. మరి మీరూ, పాటలకు పేరడీ బాణీలు కట్టి, నాభి నుంచి పలికే ప్రయత్నము చేస్తూ, పిల్లలకూ నేర్పుతారు కదూ వాక్సుద్ది మరియు గాత్ర శుద్ది కి. మన శనివార సాధనలు కూడా, ఈ పాటల వీడియోతో అందరికీ చేరుతున్నాయి - ప్రతి వీడియోలో బొమ్మలు గమనించారా.

ఒక సారి దైవం తలుపు తట్టి, స్తిర చిత్తముతో నిలిపి ఉంచితే, అనుకోని రాగాలు వినిపించేనే మనకు, కనరాని మోక్షాలు దిగివచ్చేనే మన కోసం. సాధన కుదిరాక, కలలు పండి నిజముగా, కనుల యెదుట నిలిచెగా అంటూ, మీకే అనిపిస్తుంది. చుట్టూ జరిగే కపట నటనలు చూసి ముసి ముసి నవ్వుకుంటారు. ఎందుకంటే మాయకు బయట మీరు ఉన్నారు, మాయలో ఇతరులు 80 శాతం దొర్లుతున్నారు అదే పరమానందముగా, అశాశ్వతమని తెలిసి కూడా.

ఇంకా సాధన లోతులకు వెళితే, లోక కళ్యాణ మేళాలు మనలో మ్రోగించగా, మన కంఠాన మన్త్రాన్ని స్వరపరచమా. దేహమే దేవాలయం గా, గుండె ను గుడిగా చేయమా, మిమ్ము అంటే దైవాన్ని కొలువు తీర్చమా? మీ దాసులమై, సావాసులమై అంటే ఎప్పుడూ మిమ్మే అలోచనలలో అంటిపెట్టుకుని, మా ప్రేమ పుష్పాల పూజించమా, అంటే దేవుడు దిగిరారా, కదలిరారా?

Parody

నీలి మేఘమా, జాలి చూపుమా, ఒక నిముష మాగుమా .
మా. దైవంతో, మా. ధ్యానంను, దీవించి నిలిపి వెళ్ళుమా.

కన్న బంధమా, కలత మానుమా, ఒక్క నిముష మాగుమా
మన దైవము, మన కోసము, ఆత్మగా నిలిచె చూ.డుమా.

*అనుకో.ని రాగాలు వినిపించేనే, కనరాని మోక్షాలు దిగివచ్చేనే 2
కలలు పండి నిజముగా., కనుల యెదుట నిలిచెగా.
రా.. జాబిలి, మా.. నెచ్చలి.., జాగే.ల ఈ.. వేళ, మము మెచ్చగా||నీలి మేఘమా|

*కళ్యా.ణ మేళా.లు మ్రోగించగా, కంఠా.న మన్త్రా.న్ని స్వరపరచమా 2
గుండె, గుడిగా చేయమా.., మిమ్ము, కొలువు తీర్చమా ..
మీ.. దాసులమై.., సా.వాసిమై., మా ప్రేమ పుష్పాల పూజించమా...

కన్న బంధమా, కలత మానుమా, ఒక్క నిముష మాగుమా
మన దైవము, మన కోసము, యెదుట నిలిచె చూ.డుమా.

Original

నీలి మేఘమా, జాలి చూపుమా, ఒక నిముష మాగుమా .
నా. రాజుతో, ఈ. రాతిరి, నన్ను కలిపి వెళ్ళుమా.

కన్నె అందమా, కలత మానుమా, ఒక్క నిముష మాగుమా
నీ దైవము, నీ కోసము, యెదుట నిలిచె చూ.డుమా.

*అనుకో.ని రాగాలు వినిపించేనే, కనరాని స్వర్గాలు దిగివచ్చేనే 2
కలలు పండి నిజముగా., కనుల యెదుట నిలిచెగా.
రా.. జాబిలి, నా.. నెచ్చలి.., జాగే.ల ఈ.. వేళ, నను చేరగా ||నీలి మేఘమా||

*కళ్యా.ణ మేళా.లు మ్రోగించనా, కంఠా.న సూత్రా.న్ని ముడివేయనా 2
గుండె, గుడిగా చేయనా.., నిన్ను, కొలువు తీర్చనా ..
నీ.. దాసినై.., సా.వాసినై., నా ప్రేమ పుష్పాల పూజించనా...

కన్నె అందమా, కలత మానుమా, ఒక్క నిముష మాగుమా
నీ దైవము, నీ కోసము, యెదుట నిలిచె చూ.డుమా.

చిత్రం: అమ్మాయిల శపథం (1975); స్వర కల్పన: విజయ్ భాస్కర్; సాహిత్యం: ఆచార్య ఆత్రేయ; గానం: ఎస్.పి.బాలు, వాణీ జయరాం

Ammayila Sapatham (1975) - Chandra Mohan, Ramakrishna, Chandrakala, Lakshmi - Neeli Meghama  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,333; 104 తత్వాలు (Tatvaalu) and views 226,477
Dt : 18-Aug-2023, Upd Dt : 18-Aug-2023, Category : Songs
Views : 576 ( + More Social Media views ), Id : 1880 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Neeli , Meghama , Nili , Ammayila , Sapatham , Chandra , Mohan , Ramakrishna , Chandrakala , Lakshmi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content