Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Neekaela Intha Niraasa - Aradhana - NTR, Vanisri
ప్రతి వ్యక్తి జీవితములో, బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏదో ఒక సమయములో వస్తాయి - నిరాశ చెందుతాము, ఇంకొంత మంది అసలు ప్రాణాలు వదులుదాము లేదా ఇల్లు విడిచి పోదాము అన్న తీవ్ర వేదనతో ఉంటారు.
నీ కన్నులలో కన్నీరేలా, అంతా దేవుని లీలా అని త్రుప్తి పడతాము, కానీ ప్రతి బాధ వెనుక, మన పూర్వ లేదా ఈ జన్మ తప్పులు తప్పక ఉంటాయి. వాటిని సరి చేసుకోకుండా, అవే తప్పులు మరలా మరలా చేస్తూ ఉంటే, అవే కష్టాలు మరలా మరలా. అందుకే, మనల్ని మనము తెలుసుకునే సాధన చెయ్యాలి, ప్రతి శనివారము మీకు పంపుతున్న సాధనలు అవే.
20 ఏళ్ళు పైగా ఎంతో మంది బాధలను ఓపికగా విన్నాము, ఓదార్చాము, ధైర్యం ఇచ్చాము. మేమున్నాము, మీరు నీతి నిజాయితీగా ఉంటే, మా ఇల్లు ఉంది మీకు స్థల మార్పుతో మనశ్శాంతి కావాలంటే, సహాయం చేసాము చేస్తాము అని ధైర్యం చెప్పాము.
గంటలు గంటలు తమ కష్టాలు బాధలు నేరుగా, లేదా మన ఫోన్ డబ్బులతో, చెప్పిన వారు ఉన్నారు. అదే మనకు త్రుప్తి, ఆత్మ సంత్రుప్తి, దేవుని ఎదురు ధైర్యముగా నిలబడటానికి, ఎవరికైనా కనీసం ఓదార్పు మాట సహాయం ప్రోత్సాహం నిస్వార్ధము గా చేసావా అంటే, కావలసినన్ని రుజువులు ఉన్నాయి. వారి పిల్లలను కూడా, ఉదయం 5 గంటలకు లేపి చదివించాము, ఆరొగ్య జాగ్రత్తలు, మానసిక బలం పెంచే మాటలు, ఇంకా ఎన్నో.
మనకూ ఇతరులు సహాయం చేసారు, ఈ రోజుకూ వారిని మరువ లేదు. ఒకటో తరగతి స్నేహితుని నుచి నేటి మిత్రుల వరకు కూడా, ఈ సందేశాల పలకరింపు రోజూ ఈనాటికి కూడా, మిత్రమా ప్రాపంచిక మాయలో పడకు, కుటుంబాన్ని పతనం చేయకు అని.
పౌర్ణమి తర్వాత అమావాస్య తప్పక వస్తుంది. అప్పటి దాకా, ధైర్యముగా పరిస్తితిని ఎదుర్కునే ధైర్యం ఉండాలి. మనకూ అలాంటి కష్టం వచ్చి, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకుండా పోయినా, దిగులు చెందలేదు, చేయి చాపలేదు, ఆస్తులు అమ్మ లేదు, అప్పు చేయలేదు. ఆ దేవుడే అండగా నిలిచారు, నీతో ఇంకా చాలా మందికి ఉపయోగం ఉంది అని, ఉన్నచోటనే ఉంచారు, ఎటువంటి సౌకర్యాలు తగ్గకుండా.
దానికి మీరే ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి, మీరు ధైర్యముగా ఉండాలి, అయితే నీతి నిజాయితీలతో ఉండాలి, కపటం 2 నాల్కలు లేకుండా ఉండాలి, అప్పుడే మనకు రోజులు బాగు అవుతాయి. లేదంటే మరలా అధోగతే.
ఆ కష్టాలు తీరినాక లేదా ప్రాపంచిక మత్తు పెరిగాక లేదా ఆస్తులు బలగం పెరిగాక, గతాన్ని మరచిపోయి, అబ్బో తలకాయనొప్పి అండి గంట సేపు, నీతులు శాస్త్రాలు చెపుతారు, మమ్మల్ని పతనం కాకుండా ఆపుతారు అంటా గొప్ప పూజారి వచ్చారు అని కూడా అనిపించుకున్నాము, కనీసం సందేశానికి జవాబు కూడా ఉండదు, దూరముగా కూడా ఉన్నారు ప్రాపంచిక మత్తులో.
అదే కాల మహిమ, మరలా 27 సంవత్సరాలలో, అదే శ్రమకు గురి అవుతాము అని తెలిసినా, వీరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం నుంచి బయటకు రాలేరు, తీవ్ర శిక్షలకు పాత్రులు అవుతారు, తమ తల రాతను తామే రాసుకుని.
వాడిన మోడు, పూయక మానదు, వచ్చును వసంతకాలం, నీతో కలసీ, నీడగ నడచే, తోడుగ మేమున్నాము, భయం వద్దు.
నీ.కే.లా.. యింత నిరా.శా 2
నీ. కన్నులలో.. కన్నీ.రే.లా, అంతా.. దే.వుని లీ.లా...
అంతా.. దే.వుని లీ.లా...
ఆ.శ నిరాశల, దా.గుడు మూతల
ఆటే.లే ఈ. లోకం. 2
కష్టసుఖా.లా. కలయికలో.నే
ఉన్నదిలే మా.ధుర్యం..
జీవిత మా.ధుర్యం
చీ.కటి కొం.తా., వెలుతురు కొం.తా.
ఇంతే., జీ.వితమం.తా.. ||నీ.కే.లా||
నీ మదిలో.ని., వే.దనలన్నీ..
నిలువవులే, కలకా.లం 2
వాడిన మో.డు., పూయక మా.నదు
వచ్చును వసంతకా.లం.. 2
నీ.తో. కలసీ.., నీడగ నడ.చే..,
తోడుగ నేనున్నాను/ మేమున్నాము....
నీ/మీ తోడుగ నేనున్నాను/మేమున్నాము ||నీ.కే.లా||
చిత్రం: ఆరాధన (1976); సంగీతం: ఎస్.హనుమంతరావు; సాహిత్యం: దాశరధి ; గానం: యస్.జానకి
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,573,231; 97 తత్వాలు (Tatvaalu) and views 198,532 Dt : 04-Jun-2023, Upd Dt : 04-Jun-2023, Category : Songs
Views : 177
( + More Social Media views ), Id : 1774 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Neekaela ,
Intha ,
Niraasa ,
Aradhana ,
NTR ,
Vanisri Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments