పాటతో పరమార్ధం- నీ ఇల్లు బంగారం గాను (భక్తి పేరడీ) - గజదొంగ - ఎన్టీఆర్, జయసుధ, శ్రీదేవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,900; 104 తత్వాలు (Tatvaalu) and views 226,359.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Nee Illu Bangaram Gaanu (Bhakti Parody) - GajaDonga - NTR, Jayasudha, SriDevi

మనలోని అరిషడ్వర్గ అష్టవ్యసన వ్యసనాలను తొలగించే బాధ్యత, పరమాత్మ మనకే ఇచ్చారు. కాబట్టి చెడు వ్యసనాలను హరించే దొంగ మనమైతే, మరి అందరి వ్యసనాలను తొలగించే శక్తి ఇచ్చే ఆ గజదొంగ ఎవరు?

అది తెలుసు కోవాలి అంటే, నిరంతరము సాధన చేయాలి, మనసును నియంత్రణ చేసి. దానికి ఏళ్ళు, జన్మలు పట్టవచ్చు. కపట నటన, దొంగ బాబాయిలు, స్వాములు మనకు ఏమీ మంచి దోవ చూపరు. వారి సాధనలు, సజీవ గురువు సేవలు లేకుండా నమ్మవద్దు.

జంతు బలి ఏ దేవతా కోరదు, మన బలహీన మనసులను ఆధారం చేసుకుని, మనలో రాక్షస ప్రవ్రుత్తి పెంచడానికి మాత్రమే, అది పెంచి పోషించారు. బ్రహ్మం గారు కూడా అదే చెప్పారు.

దొంగలు నాయకులు ఓటర్లు ఎంత ధనాన్ని సంపాదించినా, చివరకు అవి రక్షించవు అని మనకు రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి, ఎంతో మంది పెద్దలు తమ జీవితాలతో ధనం తో తమ జీవితం వ్యర్ధం అయ్యిందని నిరూపించారు.

ఈ రోజుల్లో, వీసాకు ధనంకు ఆస్తులకు పదవులకు అధికారానికి, అమ్ముడు పోయిన వారి జీవితాలలోకి చూడండి, ఒక్కరూ మనశ్శాంతి తో లేరు. ఎప్పుడు ఆ నరకం నుంచి బయటపడదామా అని ఆలోచనలే.

కాబట్టి, బంగారమైన మీ మనసులు చేసే, దైవిక మోక్ష సాధన ఫలించాలి. వయసు మనసు శక్తి జోరుగా ఉన్నప్పుడే, ధ్యానం చెయ్యాలి, దైవ గుణాలను ఆచరణలో పెట్టాలి. మరి మీరు పాడి వినిపిస్తారు కదూ. శాంతికోసం ఉన్నాము, మోహం వీడదామూ, జపముల తపముల, ధ్యానం చేద్దాము.

ప్రపంచ, బ్రమలన్ని ఇంకైన వదిలేద్దాం, ఎందుకంటే అందాల శని ఉంది, ముందు చూసుకో, ప్రతి 27 ఏళ్ళకైనా ఏలినాటి బాధ వద్దంటే, సాధన చేసుకో.. శాంతైన బతుకుంది, తీర్చి దిద్దుకో.. నిత్య సాధన తో, దాన్ని మార్చి చూసుకో.

మనకు సాత్విక గుణ ఉంటే, దేవుని గుణాలు ఆచరణలో చూపితే, నక్క పులి పాము కు ఓటు వేయము. కూతురు లాంటి ఓటును, అమ్ముకోము, అవసర అవకాశాలకు. ఉత్తముడు దొరకకపోతే, నోటా కు ఓటు వేస్తాము. ధనం, వీసా, ఆస్తులు, పదవి, అధికారం కోసం, పెళ్ళిలో ఆత్మలను అమ్మము, కొనము. ఇకనైనా మనల్ని మనము తెలుసుకుందాము.

Parody

మీ మనసు బంగారంగా.ను..
మన సాధన ఫలించుగా.ను..
జోరుమీద ఉన్నారు, ధ్యానం చేస్తారా..
శాంతికోసం బ్రమలమో.హం వీడలేరా..

మీ మనసు బంగారంగా.ను..
మన సాధన ఫలించుగా.ను..
శాంతికోసం ఉన్నాము, మోహం వీడదామూ..
జపముల తపముల, ధ్యానం చేద్దాము..

బంగారు కొండమీద.., దైవాల తోట/నీడ లోన..
మోక్షముంది సాధిద్దామా.. 2
ఏడేడు వారాల వ్రతాలతో, సాధిద్దాం
ప్రపంచ, బ్రమలన్ని ఇంక వదిలేద్దాం
అందాల శని ఉంది, ముందు చూసుకో..
ఏలినాటి బాధ వద్దంటే, సాధన చేసుకో.. ||మీ మనసు ||

మీ మనసు బంగారంగా.ను..మన సాధన ఫలించుగా.ను..

వజ్రాల వాడలోన.., వైఢూర్యమంటి మనసు..
మోహాన వద్దంటామూ..2
వరహాల పందిట్లో, విరహా.లు మీకేలా
రతనాల ముంగిట్లో, శ్లోకా.లు పాడాలా
శాంతైన బతుకుంది, తీర్చి దిద్దుకో..
నిత్య సాధన తో, దాన్ని మార్చి చూసుకో.. ||నీ ఇల్లు ||

Original

నీ ఇల్లు బంగారంగా.ను..
నా ఒళ్ళు సింగారంగా.ను..
జోరుమీద ఉన్నావు, జోడు కడతావా..
మోజుమీద సన్నజాజి, పూలు పెడతావా..

నీ ఇల్లు బంగారంగా.ను..
నా ఒళ్ళు సింగారంగా.ను..
పొంగుమీద ఉన్నావు, తోడు పెడతావా..
మురిపాల మీగడంతా, తోడి పెడతావా..

బంగారు కొండమీద.., శృంగార కోటలోన..
చిలకుంది తెమ్మంటావా.. 2
ఏడేడు వారాల నగలిస్తే, రమ్మంటా
హారాలకే, అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది, నువ్వు చూసుకో..
నీకందాక పని ఉంటే, నన్ను చూసుకో.. ||నీ ఇల్లు ||

నీ ఇల్లు బంగారంగా.ను..నా ఒళ్ళు సింగారంగా.ను..

వజ్రాల వాడలోన.., వైఢూర్యమంటి నన్ను..
వాటేయ వద్దంటావా..2
వరహాల పందిట్లో, విరహా.లు నీకేలా
రతనాల ముంగిట్లో, రాగా.లు తీయాల
మేలైన సరుకుంది, మేలమాడుకో..
ఓ గీటురాయి మీద, దాన్ని గీసి చూసుకో.. ||నీ ఇల్లు ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,900; 104 తత్వాలు (Tatvaalu) and views 226,359
Dt : 22-Mar-2024, Upd Dt : 22-Mar-2024, Category : Songs
Views : 88 ( + More Social Media views ), Id : 2066 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Nee , Illu , Bangaram , Gaanu , Bhakti , Parody , GajaDonga , NTR , Jayasudha , SriDevi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content