పాటతో పరమార్ధం - నను పాలింపగ - బుద్ధిమంతుడు - ANR, విజయ నిర్మల, శోభన్ బాబు, కృష్ణం రాజు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,802; 104 తత్వాలు (Tatvaalu) and views 239,959.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Nanu Palimpagaa - Buddhimantudu - ANR, Vijaya Nirmala, Sobhan Babu, Krishnam Raju

మన గాత్ర, వ్రాత, మానసిక, శారీరక నైవేద్య సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం

భక్తులు భగవంతుని ఎన్నో విధాలు గా కొలుచుకుంటారు, పిలుచుకుంటారు. అయితే, ఆ దైవ గుణాలు కూడా, తమ రాతలో మాటలో పాటలో నడతలో ఆచరణలో రోజూ కనపడతాయి. అలాంటి భక్తుడు క్రిష్ణయ్యను, రాధమ్మ తో ఉండే ఓ క్రిష్ణా, నన్ను తరింపగా నాకై వచ్చితివా అని భక్తి తో పాడుతున్నారు.

అష్ట భార్యలు, గోపికలతో ఉండే ఓ క్రిష్ణా, వారినందరినీ వదలి, నన్ను పాలించాలని వచ్చావా అని ఆనందముగా పాడుతున్నారు.

ఆనాడు కంసుని చెరసాలలో, ఖైదీగా పుట్టావు , ఆ తర్వాత కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు, మానవ జాతి కట్టిన కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు, మరలా ఇప్పుడు ఈ భక్తుని గుండెలో, ఖైదీగా ఉండాలనీ, నను పాలింపగ నడచి వచ్చితివా, మా మొరలాలింపగ, తరలి వచ్చితివా గోపాలా అంటూ ఆర్తి గా పాడుతున్నారు.

మరి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఆచరణ భక్తులు గా, ఓ సారి పాడి అందరికీ వినిపిస్తారు కదూ.

వేయి వేణువులు, మ్రోగేవే.ళా.. ఆఆ...
హాయి వెల్లువై., పొంగే.వేళా.
రాస కేళిలో., తేలే వేళా.
రాధమ్మను, లాలించే వేళ

నను పాలింపగ, నడచి వచ్చితివా..
మొరలాలింపగ, తరలి వచ్చితివా..., గో.పా.లా. ||నను||

అర చెదరిన తిలకముతో., అల్లదిగో రాధమ్మా.
అర జారిన పైయ్యెదతో., అది గదిగో గోపెమ్మా.
ఎరుపెక్కిన కన్నులతో.., ఇదిగిదిగో. సత్యభామ.
పొద పొదలో, యెద యెదలో, నీ కొరకై., వెదుకుచుండగా ||నను||

కంసుని చెరసా.లలో., ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో.., ఖైదీవై పెరిగావు
కరకురాతి గుళ్ళలో, ఖైదీవై నిలిచావు
ఈ భక్తుని గుం.డెలో, ఖైదీగా ఉండా.లనీ ||నను||

BAPU, KV MAHADEVAN, GHANTASALA  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,802; 104 తత్వాలు (Tatvaalu) and views 239,959
Dt : 09-Feb-2024, Upd Dt : 09-Feb-2024, Category : Songs
Views : 244 ( + More Social Media views ), Id : 2017 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Nanu , Palimpagaa , Buddhimantudu , ANR , Vijaya Nirmala , Sobhan , Babu , Krishnam , Raju , Ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content