పాటతో పరమార్ధం- నందమయ గురుడా(పేరడీ)- జీవన తరంగాలు- శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ, లక్ష్మి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,842; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Nandamaya Guruda Nandamaya (Parody) - Jeevana Tarangalu - Sobhan Babu, Krishnamraju, Vanisree, Lakshmi


అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు, మంచిగా నచ్చ చెప్పే బుజ్జగించే మంచి పదాల గీతం. నందామయా, గురుడ నందామయా, అనందముగా ఉందామయా, కపట వక్ర బుద్ది మార్చుకుందామయా అంటూ బతిమాలు తున్నాము ఏళ్ళుగా. ఎందుకంటే, ఇప్పుడు మనము మార్చుకోవచ్చు మన జీవితము. కానీ ఒక్కసారి, పంచభూతాల శిక్షణ మొదలు అయ్యాక, ఇంక ఆపడం ఎవరి వలన కాదు సుమీ.

మెరిసే సంఘం మేడిపండు, దాని పొట్టవిప్పి చూస్తే పురుగులుండు, కాదంటారా అంటే? అందరి జవాబు అవును అనే. కాని సంఘం అంటే, కొన్ని కుటుంబాలు కలయిక, అందులో మన కుటుంబం కూడా ఉంది అంటే? అబ్బే మేము పుణ్యాత్ములమే, గత 20 ఏళ్ళు గా నీతి నిజాయితీతో అమ్ముడుబోయి, పాము నక్క పులి నే గెలిపించాము, ఆవును ఓడించాము అంటారు.

మరి ఆ కుళ్ళు లేని చోటు ఏది? మన మనసే, కానీ ఎలా దాన్ని జాగ్రత్త గా అదుపు చెయ్యాలి? రోజు 2 పూటలా సాధన చెయ్ జీవా, ఇప్పుడే మరి. శరీరం చచ్చుపడ్డాక, ఇక మాట వినవు, పంచేంద్రియాలు మరియు మనసు మనకు సహకరించవు. రోగాలతో ఆసుపత్రుల చుట్టూ, ఇంట్లో సొంత వారితో తిట్లు, అదే నిక్రుష్ట బతుకు అవుతుంది. సాధన చేసి, శాశ్వత ఆనంద పొందు, ముక్తి సారం ఇంతేనయా, కాదా?

పుట్టినప్పుడు ఆస్తి పుట్టలేదు అప్పు పెట్టలేదు, పోయేటప్పుడు ఆస్తి పాస్తి వెంట రాదు . ఈ నడుమ ఆస్తి కోసం లేదా అప్పు ఎగకొట్టడం కోసం, పరుగులు మోసాలు ద్రోహాలు వెన్నుపోటులు, ఆస్వార్ధం ముదిరితే, మనకు గ్రహపాటు మొదలు. వేదాంత సారం ఇంతేనయా, కాదా?

నందామయా.. గురుడ నందామయా.., ఉందామయా.. మార్చుకుందామయా.. 2

మెరిసే సంఘం మేడిపండు, దాని పొట్టవిప్పి చూస్తే పురుగులుండు 2
ఆ కుళ్ళు లేని చో.టు.., మనసే 2 సాధనచెయ్ జీవా.., ఇప్పుడే
ఆనంద సారం ఇంతేనయా, ఆనంద సారం ఇంతేనయా 2 ||నందామయా ||

పుట్టినప్పుడు ఆస్తి పుట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు 2
నడుమ ఆస్తి కో.సం., పరుగులు 2 ఆస్వార్ధం ముదిరితే.., గ్రహపాటు
వేదాంత సారం ఇంతేనయా, వేదాంత సారం ఇంతేనయా 2

నందామయా.. గురుడ నందామయా.., ఉందామయా.. మార్చుకుందామయా..
తెలుసుకుందామయా మార్చుకుందామయా 2

Nandamaya Guruda Nandamaya - Lyrics: C. Narayana Reddy; Singer: L. R. Eswari  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,842; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 11-Jul-2023, Upd Dt : 11-Jul-2023, Category : Songs
Views : 318 ( + More Social Media views ), Id : 1830 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Nandamaya , Guruda , Jeevana , Tarangalu , Sobhan , Babu , Krishnamraju , Vanisree , Lakshmi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content