నాన్న అనే రెండు అక్షరాలు, మరపురాని మధురాక్షరాలు - దీక్ష - NTR, Jamuna, Anjali - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,253; 104 తత్వాలు (Tatvaalu) and views 226,054.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దీక్ష చిత్రం లో తండ్రి ఆశయం కోసం, కొడుకు ఎంత బాగా కష్టపడ్డారు, తండ్రి మాట గౌరవం పరువు ఎలా నిలబెట్టారు అని చూడవచ్చు.

ఎప్పటికప్పుడు, ఇంక మీకు ఎందుకు పంపడం, స్టేటస్ లో లేదా సోషల్ మీడియాలో చూస్తారు కదా, అనుకుంటూ, మరలా ఇలాంటి మంచి పాటలు వస్తుంటే, తల్లి తండ్రి అంటే గౌరవం ఉన్న, మీలాంటి మంచి గురువులకు ఎలా పంపకుండా/ తలచకుండా ఉండగలము? అని అనిపిస్తుంది, మన్నించాలి.

కేవలం 2 నెలల లోపు, 325 మంది సబ్ స్క్రైబర్స్ గా నమోదు గా ఉన్నారు 92 వేల వీక్షణలు వస్తున్నాయి, ఇదంతా మీ ఆశీర్వాదమే.

మన తండ్రి ఎంతో గొప్ప వారు కాబట్టే, ఈ రోజు మనకు రాత మాట పాట నడత అన్ని మంచి గా నేర్పించి, వెళ్ళారు. మీ తల్లి దండ్రులు అంతే కదా, మరి వారి గురించి గొప్పగా అందరికీ చెపుతూ, వారిని అందరితో పాటుగా తలచుకుని, క్రుతజ్ఞతలు తెలియచేయడం గుర్తు చేయడం తప్పు, అని ఎవరు అంటారు? ఒక్క, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు తప్ప.

మా గురువులలో ఎవరు అలా లేరు అని అనుకుంటున్నాము, ఒకవేళ పిల్లలకే సంస్కారం నేర్పని గురువులు ఉంటే లేదా గ్రహాల మార్పుతో మన బుద్దులు మారితే, ధైర్యముగా చెప్పవచ్చు, ఇంక మాకు పంపవద్దు అని. 5 ఏళ్ళుగ ఇవి పంపినందువలన 1 పైసా దైవ పుణ్యమే గానీ, వేరే లాభం ఏమీ లేదు కదా? నష్టం ఏముంది, ఓ మంచి గురువుని తలచే భాగ్యం పోతుంది, శివ ఆజ్ఞ అయితే, తలవంచాల్సిందే కదా. తర్వాతి అంకము మొదలవుతుంది కదా.

ఈ కమ్మటి పాట పాడి, మీ గొంతుతో కూడా వినిపించి, కన్న తండ్రికి క్రుతజ్ఞతలు తెలుపుతారు కదూ. పిత్రు దేవోభవ అని మరువద్దు, మనసుతో చేసిన/ పలికిన మాట పాట శ్లోకమే మన మానసిక నైవేద్యం వారికి. వినే పిల్లలకు అలవాటు చేస్తే ఆరోగ్యం.

నాన్న అనే.. రెండు అక్షరాలు, మరపురా.ని మధురా.క్షరాలు 2
కన్నుల ముందర కనపడకున్నా, గుండెల నిండా ఉన్నావు నాన్నా, ఉన్నావు నాన్నా
||నాన్న అనే||

1. మంచి కోసమే జీవించా.వు.., పరుల కోసమే బలి అయినా.వు.. 2
నా గుప్పిట నిండిన ఆనాటి మన్ను, మరువనీయదు ఏనాడు నిన్నూ..||నాన్న అనే||

2. నాన్నా.., నీవే దేవుడి రూపం, మా హ్రుదయాలలో.. వెలిగే దీపం.
దేవుడు మా.కు కనపడడు, ఐనా అంతట ఉన్నా.డు.
నాన్నా. నీవు కనపడవు. ., అయినా మాలో ఉన్నావు... 2
నీవు మాలో., ఉన్నావు ||నాన్న అనే||

3. నీ దీవెనతో చెడు నెదిరిస్తా..,
నీ దీక్షను నే సాధిస్తా..
నీ ఆత్మకు శాంతిని కలిగిస్తా..,
తప్పక విజయం సాధిస్తా..
విజయం సాధిస్తా..

అమ్మ, దైవం 2 కళ్ళుగా, నీవే వెలుగు గా జీవిస్తా, నీవే వెలుగుగా జీవిస్తా

Diksha Songs - Nana Any, naanna anea rendu aksharaalu marapuraani madhuraaksharaalu, deeksha , ntr, jamuna, anjali

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,253; 104 తత్వాలు (Tatvaalu) and views 226,054
Dt : 07-Oct-2022, Upd Dt : 07-Oct-2022, Category : Songs
Views : 348 ( + More Social Media views ), Id : 1570 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : naanna , aksharaalu , marapuraani , madhuraaksharaalu , deeksha , ntr , jamuna , anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content