Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Naa Desam - Unnadura Devudu - NTR, Jayasudha
దేవుడు ఉన్నాడా అని అందరి ప్రశ్న? ఉన్నాడు అని పైకి నమ్ముతున్నట్లు ఇంకొందరు, నటిస్తూ కపటము తో 2 నాల్కల జీవితం సాగిస్తుంటారు. అంటే కేవలం 80 శాతం మంది ప్రశ్న, ఎందుకంటే, వారు సొంత అమ్మా నాన్న అత్త మామల లోనే దైవాన్ని చూడలేరు. రేపు ముదుసలి తనములో తమ సొంత సంస్కార బిడ్డల ఇంట్లో దేవతలు గా పూజింపబడతాము అని కూడా చెప్పలేని దౌర్భాగ్యులు.
పంచభూతాల చేతిలో శిక్షణ ప్రారంభం అయినదాకా, కనీసం పశ్చాత్తాపం కూడా పడరు, తమ జీవితం వ్రుధా అయ్యింది అని. ఎందుకంటే వారు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉంటారు. ఇంక దైవాన్ని చూడటం అనేది వారికి 100 జన్మలు ఎత్తినా కూదరదు.
మనలో ఉన్న ఆత్మనే పరమాత్మ తో సాధన ద్వారా కలిపితే కానీ, దైవం అంటే ఏమిటో, అర్ధం కాదు. అంత ఓపిక, సహనము, త్యాగము, క్రుతజ్ఞత, విశ్వసనీయత ఈ 80 మందికి ఉండదు. ఈ శరీరం శాశ్వతముగా నాది కాదు, నేను వేరు అన్న స్రుహ ఎంత మందికి ఉంటుంది? ఉంటే, ఈ కుట్రలు, వెన్నుపోటులు, మోసాలు ఉంటాయా?
ఉన్నాడురా, ఆ దైవము, ఉంటాడు రా, నీ కోసము, ఎందుకంటే మనం మాయలో చిక్కుకోకుండా ఉంటే, తాను మన కష్టాలు కడతేర్చగా, సహాయం గా నీడలా ఉంటారు. ఎందుకంటే, తన ఇల్లు ఈ లోకము. చివరకు సొంత వారు అందరూ తన్ని తగలేసినాక అయినా, మన దిక్కు ఆ దైవము అంటారు ఈ 80 మంది కూడా.
ఈ రోజు అమ్మకు, ఆరోగ్యం కు, 9 ఏళ్ళు గా, అన్ని విధాలా సహాయం చేసింది, అండగా ఉంది ఎవరు? ఆ దైవమే, లేకపోతే, ఈ సౌకర్యాలు మన లాంటి అల్పుల వలన అవుతాయా? మనకు 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, ఎలా ఎదుర్కోవాలో 20 ఏళ్ళ నుంచే, దేవుడు నేర్పుకుంటూ వచ్చారు.
కష్టాల చీకట్లే ముసిరే వేళా, తాను మనకు వెలుగై, జాబిల్లి తానై రాడా. ఈ భూమిపై నారేసినా దేవుడే, మంచివారి నోటికి, నీరిచ్చి కాపాడడా. ప్రహ్లాదుడు కు అండగా వచ్చారు కదా? గజేంద్ర మోక్షం లో, ఏనుగును కాపాడారు కదా?
దేవుని సమర్ధన చేస్తు, పురాణాలు వేదం అవునన్నా, ప్రాపంచిక వ్యామోహ వాదం కాదన్నా, అతడే లేకుంటే ఈ జగమే లేదన్న. తండ్రే లేక, బిడ్డలు లేరన్నా, నా మాట గురుతుంచుకో, మిత్రమా. మన తోడై, వెలుగు నీడల్లో, కలిమి లేముల్లో, బతుకు బాటల్లో ఆయన మనకు అండగా ఉంటారు, దానికి మనము అర్హత కష్టపడి సంపాదించాలి, కనీసం 30 ఏళ్ళు తర్వాత అయినా, కాళ్ళు చేతులు కదిలేటప్పుడే సుమా.
ఆయనకు రూపాలెన్నెన్నో, మనము పిలవడానికి నామాలెన్నెన్నో. మనసే నీ కుంటే, దేవుని చేరే మార్గాలెన్నెన్నో. మరి మానసిక దీపాలు వెలిగించుకో. అప్పుడు నీవాడై, నిలిచే నీకోసం, పలికె ఆదైవం, నీవై నీలోనే. అంతే కదా? ఆత్మ పరమాత్మ కలిసిపోతాయి.
ఉన్నాడురా.. ఆ దైవము, ఉంటాడు రా.. నీకోసము 2
కష్టాలు కడతేర్చగా..,
తన ఇల్లు రా. ఈ లోకము..,
మన దిక్కు రా.. ఆ దైవము.. ||ఉన్నాడురా||
చీకట్లే ముసిరే వేళా.., జాబిల్లి తానై రాడా..
నారేసినా దేవుడే.., నీరిచ్చి కాపాడడా...
వేదం అవునన్నా, వాదం కాదన్నా
అతడే లేకుంటే., జగమే లేదన్న
తండ్రే లేక, బిడ్డలు లేరన్నా, నామాట గురుతుంచుకో..
నీ తోడై, వెలుగు నీడల్లో, కలిమి లేముల్లో, బతుకు బాటల్లో..||ఉన్నాడురా||
నీ ఆకలే తీర్చగా.., అవుతాడురా అన్నమూ..
కన్నీటినే తుడవగా.., అవుతాడురా నేస్తమూ..
రూపాలెన్నెన్నో, నామాలెన్నెన్నో
మనసే నీకుంటే., మార్గాలెన్నెన్నో
దేవుని చేరే, మార్గాలెన్నెన్నో, దీపాలు వెలిగించుకో..,
నీవాడై, నిలిచే నీకోసం, పలికె ఆదైవం, నీవై నీలోనే.. ||ఉన్నాడురా||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,442; 104 తత్వాలు (Tatvaalu) and views 226,514 Dt : 16-Aug-2023, Upd Dt : 16-Aug-2023, Category : Songs
Views : 384
( + More Social Media views ), Id : 1878 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Naa ,
Desam ,
Uvnadura ,
Devudu ,
Unnadura ,
daivamu ,
NTR ,
Jayasudha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments