Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Naa Desam - Rojulanni Maare (Devotional Parody) - NTR, Jayasudha
ఏంటో జనాలు, రోజులన్నీ మారాయి, వ్యామోహాలు ఇంక మానండి అంటే వినరు. ఆ దేవ దేవుని చెంతా, మీ కాసు విలువ ఎంతలే అన్నా, పట్టించుకోరు. 20 కోట్లు పెట్టి దేవునికి కిరీటం చేయిస్తారు, జైలులో ఓ ఏడాది గడిపి వస్తారు. తీర్ధ యాత్రలకు అని చెప్పి విహార యాత్రలు చేసి వస్తారు. అందుకే చెప్పింది, చిత్త శుద్ది లేని శివ పూజ లేలరా అని.
ధనముతో అన్ని కొనవచ్చు అంటారు మూర్ఖముగా. మనకు పెద్దలు దోవ చూపించి వెళ్ళారు కదా, రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య. అయినా మనకు ఎందుకు బుర్రకు ఎక్కదు?
బేరమాడలేవు సజీవ గురువు సేవనీ అని ఎప్పుడు తెలుసుకుంటారు? ముదుసలి తనములో ఒంటరిగా అందరు వదిలేశాకనా? వేలమేయలేవూ, మా దైవ గుండె ప్రేమని, డబ్బులున్న జీవా అంటే వింటారా? అబ్బే, మాకు పంచభూతాల శిక్షణ కావాలి అంటారు.
డబ్బులున్న ఓ జీవా, రేపు సొంత వారి ముందే డుబ్బు కైన చెల్లవే, ఊళ్ళోళ్ళ కొంపలు ముంచే అప్పులింక మానీ, ఆత్మ పరమాత్మను కలపడానికి, దైవసాధన దారి పట్టవే మిత్రమా ఇక నైనా.
నీతిలేని డబ్బే, మీ జాతికున్న జబ్బులే, సాటి మనిషి మీద, జాలైన మీకు రాదులే అంటే, ఈ చెవిన విని ఆ చెవితో వదిలేస్తారు నవ్వుతూ, మా అమ్మ అయ్య అత్త మామనే పట్టించుకోము, పిల్లల సంస్కారం నేర్పుడు మాకు అలవాటు ఓపిక బాధ్యత లేదు, ఇంక సాటి మనిషి సంగతి మాకెందుకు అని వీరి బాధ.
జాలి లేని గుండే, ఓ నాపరాతి బండలే, మీ ఇంటి కుక్క పాటి, విశ్వాసమైన లేదులే అంటే, అబ్బో మా వంశములో నే లేదు, అందుకే మేము నక్క పాము పులి కే ఓటు వేస్తాము, నాయకులు గా ఆవు లక్షణాలు ఉన్న వారిని ఎన్నుకోము, వారిని మాకు దరి చేరనీయము అని నిక్కచ్చిగా చెపుతారు.
మంచి మాట వింటే, మనశ్శాంతి మీకు దక్కునే, మీ మోహం తగ్గకుంటే, సొంతవారే బుద్ది చెపుతారు లే మిత్రమా, అప్పుడే మారుదువు మనిషిగా. ఇకంకా ఎన్నో జన్మలు సాధన చేసి, అప్పుడు ఆలోచన చేద్దాము దైవం గురించి, బాగా సాన బట్టినాక కష్టాలు కన్నీళ్ళతో అనేగా మీ ఉద్దేశ్యం, సరే మీ ఇచ్చ.
Parody
రోజులన్నీ మారే 2, వ్యామోహా లింక మానరే 2
దేవ దేవుని చెంతా 2, మీ కాసు విలువ, ఎంతలే ||రోజులన్నీ మారే||
బేరమాడలేవు సజీవ గురువు సేవనీ, వేలమేయలేవూ.
వేలమేయలేవూ, మా దైవ గుండె ప్రేమని, డబ్బులున్న జీవా
ఓ జీవా, ఓ జీవా, ఆత్మను, తెలుసుకోవా
డబ్బులున్న జీవా, రేపు డుబ్బు కైన చెల్లవే, అప్పులింక మానీ ..
అప్పులింక మానీ, దైవసాధన దారి పట్టవే 2 ||రోజులన్నీ మారే||
నీతిలేని డబ్బే, మీ జాతికున్న జబ్బులే, సాటి మనిషి మీద..,
సాటి మనిషి మీద, జాలైన మీకు రాదులే, జాలి లేని గుండే,
ఓ ఆత్మ, ఓ ఆత్మ, బ్రమలు, వదులుకోవా
జాలి లేని గుండే, ఓ నాపరాతి బండలే, ఇంటికుక్క పాటి..
మీ ఇంటికుక్క పాటి, విశ్వాసమైన లేదులే 2 ||రోజులన్నీ మారే||
కోడిగొంతు నొక్కి, తొలిపొద్దు నాపలేవులే, గుండె గొంతు నొక్కి..
గుండె గొంతు నొక్కి, మీ గొప్పలింక చెప్పకే, మోహ బ్రమల జీవా
ఓ జీవా, ఓ ఆత్మ, మోక్షం, చే.రుకోవా
మంచి మాట వింటే, మనశ్శాంతి మీకు దక్కునే, మోహం తగ్గకుంటే..,
మీ మోహం తగ్గకుంటే, సొంతవారే బుద్ది చెపుతారు లే 2 ||రోజులన్నీ మారే||
Original
రోజులన్నీ మారే 2, నీ ఫోజులింక మానవే 2
కష్ట జీవి చెంతా 2, నీ కాసు విలువ, ఎంతలే ||రోజులన్నీ మారే||
బేరమాడలేవు పేదోళ్ళకున్న నీతినీ, వేలమేయలేవూ.
వేలమేయలేవూ, మా పేద గుండె ప్రేమని, డబ్బులున్న బొమ్మా
ఓ బొమ్మా, ఓ బొమ్మా, పెద్దమా, పెద్దమ్మా
డబ్బులున్న బొమ్మా, నువ్వు డుబ్బు కైన చెల్లవే, డాబులింక మానీ ..
డాబులింక మానీ, నీ ఇంటిదారి పట్టవే 2 ||రోజులన్నీ మారే||
నీతిలేని డబ్బే, మీ జాతికున్న జబ్బులే, సాటి మనిషి మీద..,
సాటి మనిషి మీద, జాలైన మీకు రాదులే, జాలి లేని గుండే,
జాలి లేని గుండే, ఓ నాపరాతి బండలే, బొచ్చుకుక్క పాటి..
మీ బొచ్చు కుక్క పాటి, విశ్వాసమైన లేదులే 2 ||రోజులన్నీ మారే||
కోడిగొంతు నొక్కి, తొలిపొద్దు నాపలేవులే, గుండె గొంతు నొక్కి..
గుండె గొంతు నొక్కి, నీ గొప్పలింక చెప్పకే, ఉన్న ఇంటి పిల్లా
మంచి మాట వింటే, మర్యాద నీకు దక్కునే, ఫోజు తగ్గకుంటే..,
నీ ఫోజు తగ్గకుంటే, నీ బూజు దులుపుతాను లే 2 ||రోజులన్నీ మారే||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,615; 104 తత్వాలు (Tatvaalu) and views 256,755 Dt : 16-Aug-2023, Upd Dt : 16-Aug-2023, Category : Songs
Views : 403
( + More Social Media views ), Id : 1879 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Naa ,
Desam ,
Rojulanni ,
Maare ,
Devotional ,
Parody ,
NTR ,
Jayasudha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments