APLatestNews.com top Banner

Social Media links
నా ప్రతిరూపాలు, మీ ఇళ్ళు లో ఒక్కొక్కరుగా, కన్నతల్లి గా పెడితే - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఇంట్లో ఉన్న చిన్న అమ్మోరు తల్లి ని, కారు లో భక్తి గీతాల తో , దగ్గర ఊరు గుడి లో ఉన్న, పెద్ద అమ్మోరు తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళే భాగ్యం కలిగింది లేదా పెద్దమ్మ తెప్పిచ్చుకుంది అంటే బాగుంటుంది ఏమో.

పెద్దమ్మ నవ్వుతూ అడిగింది, నా ప్రతిరూపాలు, మీ ఇళ్ళ లో ఒక్కొక్కరుగా కన్నతల్లి గా పెడితే, మరలా 10 మైళ్ళు తైలం ఖర్చు తో రావాలా ఇక్కడ కు అని. అంతేగాక అమ్మ ను కష్టపెడుతున్నావు ఏమో, ఆలోచించు అని.

పాదాభివందనం చేసి, తలవంచుకొని , అన్నీ తెలిసిన తల్లివి, మాకు జ్ఞానం ఇచ్చే ఆదిశక్తి వి పరాశక్తి వి, పరీక్షిస్తున్నావా తల్లి. మా ఉళ్ళో పోలేరమ్మవు, ఎల్లమ్మవు, బెజవాడ దుర్గమ్మ వు , కలకత్తా మహంకాళి వి, బాసర చదువుల తల్లి వి, మీకు చెప్పేంత అర్హత కూడా లేని నలుసు ను.

నా వాక్కును, శుద్ధి చేయగల, శక్తి ఉన్న దానివి , జవాబు చెప్పే ప్రయత్నం చేస్తా, తప్పు ఉంటే, కోప్పడకు తల్లి. పర్లేదు లే చెప్పు, బిడ్డ మీద తల్లికి కోపం ఎందుకు, అంది చిరునవ్వుతో.

అమ్మ లు గన్న అమ్మవు, చాలా పెద్ద అమ్మవు, ఇహలోక సంతోషం బాధలు ఐశ్వర్యం, మీ దయే గదా తల్లి. మా అమ్మమ్మ ఇంటికి, ఖర్చు, దూరం అయినా తప్పదు కదా తల్లి, అమ్మ ను తెచ్చి చూపడం, అప్పుడప్పుడు.

పుట్టింటికి రావడానికి, పెద్ద అమ్మ ను చూడడానికి, ఏ తల్లి అయినా కష్టం అనుకుంటుదమ్మా. మిమ్మల్ని చూసి, ఆ తల్లి కళ్ల లో నీళ్ళు చూడండి, అనేసరికి పెద్దమ్మ మౌనంగా ఉంది.

ఒరే అబ్బాయి, మా వారు శివయ్య ముందే చెప్పారు నీ గురించి, అయినా ఏమంటావో అని అడిగా. మంచి గా చెప్పావు, అలాగే దానిని ఆచరణలో చూపిస్తున్నావు. ఇలాగే అందరూ అనుకొని, కన్న తల్లి ని గౌరవిస్తే, నా దగ్గరకు వచ్చినంత పుణ్యం.

అలాగ చేయకుండా, వీలు ఉండి కూడా, వ్రృద్దాప్యంలో లేదా శక్తిహీనులైన తల్లి దండ్రులను విడిచి లేదా దూరంగా ఉంచి, నా దగ్గర కు వచ్చి నటించిన, ఫలితం శూన్యం పాప భారం తప్ప, అంది పెద్దమ్మ రాజ రాజేశ్వరీ దేవి నవ్వుతూ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 577 General Articles, 46 Tatvaalu
Dt : 30-Jun-2019, Upd Dt : 30-Jun-2019, Category : Devotional
Views : 346 ( + More Social Media views ), Id : 129 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : maata , jaganmaata , raja rajeswari devi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content