APLatestNews.com top Banner

Social Media links
ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వార దర్శనము, పూజ పునస్కారాలు, ఆధ్యాత్మిక ఆనందం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

ముక్కోటి దేవతల లోక నాయకుడు, ఆ పరమాత్మ ను ఉత్తర ద్వారం నుంచి చూసే సుదినం, ముక్కోటి ఏకాదశి.

ఉత్తర ద్వారం అంటే గుడి లో మాత్రమే అని కాదు. ధ్యానం లో మన కనుబొమలు మధ్యలో, భగవంతుని చూడటం కూడా అదే. మాకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏకాదశి మొదలు.

సాయంత్రం, స్నానం తో పూజ పునస్కారాలు చేసుకొని, ఇంట్లో తోడుగా ఉన్న అమ్మ ను సేవించుకుని, ఉపవాసం మొదలు పెట్టాను.

రాత్రి ఉపవాసం కారణముగా అన్నం తినకుండా, ఓ మూడు పండ్లు తిని, పాలు తాగి పడుకున్నా, నేల నిద్ర తో. ఇంత మనిషి కి, ఆ తిండి చాలదు, అవి గంట కూడా ఆనవు. కానీ వాటి శక్తి ఉంటుంది కదా ఎక్కువసేపు, ఇబ్బంది లేదు. ఖాళీ కడుపు తో కాస్త జాగారం కాస్త నిద్ర దైవ నామస్మరణ తో, అలా రాత్రి గడచిపోయింది.

పొద్దున్నే కడుపు నరాలు గుంజాలి, వేడిగా ఆకలి తో, అదే ఆరోగ్య లక్షణం, మానసిక చైతన్యం. అబ్బా ఉదయము పూజకాకుండా, దాన్ని పట్టించుకోము కదా. అదే మనసు ను అదుపులో ఉంచడం.

ఈ స్ధితి లో, పాపం చేయలేము. ఎవరన్నా తిట్టినా, కొట్టి నా కోపం రాదు రాకూడదు. జాలి వేయాలి వేస్తుంది వారి మీద, ఎందుకంటే అంత కన్నా ఎక్కువ బాధ, వాళ్ళ ఇంట్లో పడతారు వాళ్ళ సొంత జనముతో పాపం అని.

నారాయణుడు , శివయ్య వేరు కాదు, పరమాత్మ లో భాగాలే. మనమూ వేరు కాదు, గ్లాసు లో ని ఆ గంగా జలమే(పరమాత్మ). అది తెలుసుకోడానికే, మోహం భ్రమ నుంచి బయటకు రావడానికే వంద జన్మలు, వంద పెళ్లిళ్ళు, వంద తన్నులు కష్టాలు కన్నీళ్ళు మనకు.

సొమవారము ఉదయము, ఆహా మంత్రాక్షరాలు పద్ధతి గా ఉచ్చారణ చేస్తూ, పద్మాసనం వేసుకుని, కళ్ళు మూసుకుని దేవుని చూస్తూ, కాళ్ళు నుంచి నాభి నుంచి పైకి నొప్పి, బాధ, శక్తి, ఆనందం ఎగతన్నుతుంటే, ఆ ఆధ్యాత్మిక ఆనందం ఎవరికి వారు అనుభవించాలి, వేరొకరు చెపితే అర్ధము కాదు. క్రుష్ణయ్య గీతలో చెప్పారు నాలుగు వర్ణాలు గురించి, బ్రాహ్మణత్వం పుట్టుకతో రాదు, గుణ చేష్టలు ను బట్టి అని.

ఈరోజు, పంచె శాలువా ధరించి, పూజ పూర్తి చేసే భాగ్యం కలిగింది. ఎవరిచ్చారో తెలుసా 2012 వరలక్ష్మీ పూజలో, ఒక 60 ఏళ్ల పై బడ్డ తల్లి ఇచ్చింది. గుర్తు ఉందా, కాలేజీ నవరాత్రి పూజ కానుకలు, అన్ని వేరే వారికి ఇచ్చాము అని. ఎవరి దగ్గర తీసుకోము, తీసుకోకూడదు కూడా.

కానీ ఆ తల్లి 4 ఏళ్లుగా తెలుసు అప్పుడు. మనసా వాచా కర్మణ మా అమ్మలాగే. ఒకటే మాట, అబ్బాయి నువ్వు చెప్పు, నేను చెయ్యకపోతే అడుగు. రాత్రి 12 అయినా, ఉదయం 4 అయినా రెడీ, పూజలు పునస్కారాలు కు మా ఆయన నేను. అలాంటి మంచి అమ్మలు, తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఉన్నారు.

మంచి గుణం ఎల్లకాలం ఉంచుకునే, తల్లి దీవెనతో ఇచ్చిన అర్థ రూపాయి అయినా, తలవంచి నమస్కారం చేసి తీసుకోవాలి. మనకూ క్షేమము, అది వారికీ క్షేమమే.

గుర్తు ఉంది కదా, ఏది తీసుకున్నా మన పుణ్యం లో భాగం, వారికెళుతుంది. మంచి వారిని తృప్తి పరచిన పుణ్యం, మనకూ వస్తుంది.

ఆ తర్వాత గుడికి వెళ్ళి, ఉత్తర ద్వారము ద్వారా, వెంకన్నను దర్శనము చేసుకొని వచ్చాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 614 General Articles, 46 Tatvaalu
Dt : 06-Jan-2020, Upd Dt : 06-Jan-2020, Category : General
Views : 172 ( + More Social Media views ), Id : 274 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : mukkoti ekadasi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content