Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
మనిషిగా, తోటి మనిషికి ధైర్యం ఇవ్వాలి, ఆశ కలిగించాలి, ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. కానీ, మనము బిజీ బిజీ అంటూ, సొంత ఇంట్లో భాగస్వామి తో పిల్లలుతో మాట్లాడటానికి, రోజులు గడపటానికే సమయము లేదు.
అలాంటి ధైర్యం ఇచ్చే పాట, బాగ మనసును కదిలించేది. 3 ఏళ్ళు పైగా, మనకు ఆదాయం లేకపోయినా, ధైర్యానికి దేవునితో పాటుగా, ఇలాంటి మంచి సాహిత్యం, అలాగే మనము ఇతరులకు ఇచ్చిన ధైర్యమే, మనకు అండగా వస్తుంది, వచ్చింది.
అందుకే మంచి గా ఉండాలి, మంచి చెయ్యాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి ఆశించాలి, మంచి గా మనకు నమ్మకమైన వారికి మన గతిని ప్రగతిని వివరించాలి. మంచి వారు సహాయం తప్పక చేస్తారు. మీకు 5 ఏళ్ళకు పైగా, అన్ని వివరముగా చెప్పాము, అందరి క్షేమం కోరాము, విన్న వినకపోయినా, చదివినా చదవకపోయినా, రేపు మనమూ అదే పరిస్తితి లో ఉండవచ్చు, అందుకే, మానవ సేవయే మాధవ సేవ అంది. మరి మీ మానవ సేవ కూడా, చెపుతారు కదూ?
మౌనంగానే ఎదగమనీ, మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమనీ, అర్ధమందులో ఉంది. ఎంతమందిమి అలా ఉన్నాము ఒదిగి? గెలవక ముందు, ఒక్కసారి గెలిపించండి అంటాము, గెలిచాక, అన్ని మన ఫోటోలో, మన పేర్లే, సింగన్న ఆసరా, జంగన్న తోడు అని పధకాలకు ప్రకటనలకు ప్రచారానికి అంత మనమే.
అలాగే మనము, ఎదగక ముందు ఎవరూ సాయం చేయలేదు, పలకలేదు అని ఎడుపు. ఎదిగాక, అయ్యో అసలు సమయం లేదండీ, మీరు గత నెలలో పంపిందే ఇంకా చదవలేదు, మా పిల్లల సంస్కార నేర్పుకే తీరిక లేదు, మధ్యలో మీది ఒకటి అంటూ నవ్వులు.
సాగరమధనం మొదలవగానే, విషమే వచ్చింది. విసుగే చెందక, కృషి చేస్తేనే, అమృతమిచ్చిందీ. జీవితం అంటే ఇదే, మనల్ని చూసే, అందరూ ధైర్యము తెచ్చుకోవాలి. మా శిష్యుడు సమస్యలకు ఎదురు ఈదుతూ కూడా, ఇన్ని పనులు చేస్తున్నప్పుడు, మేము ఎందుకు చెయ్యలేము? అదే మొదటి అడుగు, దైవం వైపు, ఆత్మ శుద్ది వైపు.
మౌనంగానే ఎదగమనీ.., మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ.., అర్ధమందులో ఉంది.. - 2 సార్లు మొత్తము
అపజయాలు కలిగినచోటే.., గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే.., కొత్త చిగురు కనిపిస్తుంది - 2 సార్లు మొత్తము
చరణం 1:
దూరమెంతో ఉందనీ., దిగులుపడకు నేస్తమా..
దరికి చేర్చు దారులు కూడా, ఉన్నాయి గా..
భారమెంతో ఉందనీ.., బాధపడకు నేస్తమా,,,
బాధ వెంట నవ్వులపంట, ఉంటుంది గా..
సాగరమధనం మొదలవగానే, విషమే వచ్చింది.
విసుగే చెందక, కృషి చేస్తేనే, అమృతమిచ్చిందీ..
అవరోధాల, దీవుల్లో, ఆనంద, నిధి ఉన్నదీ
కష్టాల వారధి, దాటినవారి,కి సొంతమవుతుందీ..
తెలుసుకుంటె సత్యమిదీ.., తలుచుకుంటె సాధ్యమిదీ.. ||మౌనంగానే ఎదగమనీ||
చరణం 2:
చెమట నీరు చిందగా.., నుదుటి రాత మార్చుకో..
మార్చలేని దేదీ లేదని, గుర్తుంచుకో..
పిడికిలే బిగించగా.., చేతిగీత మార్చుకో..
మారిపోని కధలే లేవని, గమనించుకో..
తోచినట్టుగా, అందరి రాతను, బ్రహ్మే రాస్తాడూ..
నచ్చినట్టు గా, నీతలరాతని, నువ్వే రాయాలీ..
మా ధైర్యాన్ని దర్షించి, దైవాలే తలదించగా.. 2
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
మా సంకల్పానికి, ఆ విధి సైతం, చేతులెత్తాలీ
అంతులేని చరితలకీ.., ఆది నువ్వు కావాలీ..,||మౌనంగానే ఎదగమనీ||
Singer : Chithra, Lyrics : Chandrabose
మౌనంగానే ఎదగమనీ, నా ఆటోగ్రాఫ్, గానం : చిత్ర, సాహిత్యం: చంద్రబోస్, రవితేజ, భూమిక, గోపిక
Mounamgane edagamani, apajayalu kaligina chote - Naa Autograph, Ravi Teja, Bhoomika, Gopika
మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,132; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989
Dt : 03-Oct-2022, Upd Dt : 03-Oct-2022, Category : Songs
Views : 504
( + More Social Media views ), Id : 1556
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
mounamgane ,
edagamani ,
apajayalu ,
naaautograph ,
raviteja ,
bhoomika ,
gopika
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments