పాటతో పరమార్ధం - మనసున మనసై - డాక్టర్ చక్రవర్తి - ANR, సావిత్రి, జగ్గయ్య, జానకి, శ్రీశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2131 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2166 General Articles and views 2,194,620; 104 తత్వాలు (Tatvaalu) and views 243,569.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Manasuna Manasai - Doctor Chakravarthy - ANR, Savitri, Jaggayya, Janaki, SriSri

మనము రాసిన సంస్కార రాతకు ముందు విలువ. చదివింది మనసుకు ఎక్కితే మనిషిలో మార్పు వస్తుంది, మనసు లోతులకు వెళుతుంది. ఆ తర్వాత మన శ్వాస ప్రక్రియ పాట. అక్కడ కొన్ని మాటలే ఉంటాయి, అందుకో పాటతో పరమార్ధం ముఖ్యం.

మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన స్థాయి నుంచి, కనీసం ఎవరైనా ఓదార్పు మాటలు మాట్లాడినా, అదే భాగ్యము, అదే స్వర్గము అనే దౌర్భాగ్య పరిస్తితికి వచ్చాము. జనాభా కోట్లలో, కానీ కలకాలం తోడు మాటలు సున్నా.

జనములో ఒంటరి తనము పెరిగిపోతుంది. నేను నాది, అనుకోవడమే, స్వార్ధం పెరిగిపోయి - అది భాగస్వామి అయినా, పిల్లలు అయినా, ముదుసలి తల్లి దండ్రులు అయినా సరే, భావాలు లక్షణాలు మారవు, అదే స్వార్ధం.

ఎంత వీలైతే అంత తక్కువ మంది తో కలుస్తాము/ మాట్లాడతాము/ ఫోన్ చేస్తాము, అదీ అవసరం అవకాశం కష్టం కన్నీరు ఉంటేనే - రేపు అందరం ఒంటరి వారిమే అని తెలుసు - కానీ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ అహంకారం అందరికీ దూరం చేస్తుంది, ఆఖరికి సొంత వారితో కూడా.

కనీసం పాట/ మాట/ కధనము/ సాధన బాగుంది లేదా బాగాలేదు, మేము మా పిల్లలు ఇంతకన్నా ఎక్కువ మానసిక నియంత్రణ మరియు సజీవ గురువు సేవ, సమాజ సేవ చేస్తున్నాము, అదీ శారీరకము/ మానసికముగా, ధనమునకు సంబంధం లేకుండా, అని జవాబు చెప్పే ఓపిక కూడా లేదు.

మాకు మేమే తో మొదలు అయ్యి, నాకు నేనే తో అంతము అవుతుంది. ఉమ్మడి కుటుంబాల నుంచి ఓ కుటుంబాన్ని విడగొట్టుకుంటూ వస్తూ, ఇప్పుడు భాగస్వామి తో ఉండలేక, సహజీవనం బెస్ట్ అనుటున్నారు. మరి రేపు రోగం వస్తే?

సమాజం తో మాకు పన్లేదు అని ఒక లేదా అన్ని వంశం(లు). మా చుట్టాలు స్నేహితులతో పని లేదు అని ఆ వంశం లో ఒక లేదా అన్ని కుటుంబం(లు). మా కుటుంబం లో, ఇతరుల మాట మేము వినను, అని ఒక లేదా అన్ని వ్యక్తి(లు). ఇక ఈ సమాజం ఎటు వెళుతుంది?

మీతో పనిలేదు అని, రోబోలతో చిమ్మడం కూడా చేస్తున్నారు, సంసారానికి కూడా అందుబాటులోకి రోబోలు వస్తున్నాయి.

అందుకే ముందు మనము ఎవరము, ఎందుకు వచ్చాము, ఏమి చేస్తున్నాము, మన లక్ష్యం ఏమిటి? గత జన్మ ఏమిటి? రేపు జన్మ ఏమిటి? మానసిక నియంత్రణ ఉందా అని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే త్రికరణ శుద్ది గా, ఈ ప్రపంచ సమస్యలు ఉండవు.

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు/ గౌరవించుటకు, నీ కోసమే, కన్నీరు నించుటకు,
నేనున్నానని, నిండుగ పలికే, తోడొకరుండిన, అదే భాగ్యము, అదే స్వర్గము - మనము ఎంతో మంది, కష్టాలు కన్నీళ్ళు విన్నాము ఓదార్చాము, వారి ధన ఆస్తి అంద హోదా పదవి తో పనిలేదు. గుణం మానవత్వం ఉందా అన్నదే ముఖ్యం.

అలాగే మనల్ని ఇతరులు అలాగే గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు, మనకు పదవి ఆదాయం ఏమీ లేవని తెలిసినా వదలరు. ఎందుకంటే ఎవరికీ లేని స్తిరమైన గుణం ఉంది, అది కోటి లో ఒకరికి మాత్రమే ఉంటుంది అని వారికి తెలుసు.

ఒకవేళ సమాజం లో ఎవరు మనతో పలకని పరిస్తితి ఉంటే, మనది తప్పు లేకుండా, అప్పుడు మనకు తోడు మన నీడే, మన ఆత్మే, ఆ దేవుడే. అందుకే అన్నారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, ఐతే దేవుడు ఎప్పుడు అండగా ఉంటారు, మనలో త్రికరణ శుద్ది గా తప్పు లేకపోతేనే సుమా.

మనసున మనసై.., బ్రతుకున బ్రతుకై.. 2
తోడొకరుండిన, అదే భాగ్యము.., అదే స్వర్గము.. - మొత్తము 2 సార్లు

ఆశలు తీ.రని, ఆ.వేశములో., ఆశయా.లలో. ఆవే.దనలో.
చీకటి మూ.సిన, ఏకాం.తములో.
తోడొకరుండిన, అదే భాగ్యము.., అదే స్వర్గము..

నిన్ను నిన్నుగా., ప్రేమించుటకు
నీ కో.సమే, కన్నీరు నించుటకు - మొత్తము 2 సార్లు
నేనున్నా.నని, నిండుగ పలికే...
తోడొకరుండిన, అదే భాగ్యము.., అదే స్వర్గము..

చెలిమియే కరువై., తలపే అరుదై,
చేదరిన, హ్రుదయమే, శిల ఐ పోగ
నీ వ్యధ తేలిసి.., నీడగ నిలిచే..
తోడొకరుండిన, అదే భాగ్యము.., అదే స్వర్గము..

Sri Sri, Ghantasala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2166 General Articles and views 2,194,620; 104 తత్వాలు (Tatvaalu) and views 243,569
Dt : 28-Jul-2023, Upd Dt : 28-Jul-2023, Category : Songs
Views : 437 ( + More Social Media views ), Id : 1857 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Manasuna , Manasai , Doctor , Chakravarty , ANR , Savitri , Jaggayya , Janaki , SriSri , Chakravarthy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content