పాటతో పరమార్ధం - మామ చందమామ వినరావా - సంబరాల రాంబాబు - చలం, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,160; 104 తత్వాలు (Tatvaalu) and views 226,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Mama Chandamama Vinarava - Sambarala Rambabu - Chalam, Sharada

మామా చందమామా, వినరావా మా కథ, వింటే మనసు ఉంటే, కలిసేవూ మా జత. వినరాకపోతే, మేమే, మన ఇస్రో చంద్రయాన్ 3 యాత్ర తో, మీ దగ్గరకు వచ్చి మా ఊసులు చెపుతాము.

మన మామా చందమామా దక్షిణ ధ్రువాన, మన రోదశీ నౌక దిగిన సందర్భముగా, ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. మరి మనము ఓ 4 రాత మాటలు, ఓ గాత్ర నైవేద్య పాట తో, అదీ మన నాన్నలు తాతలకు నచ్చిన మెచ్చిన మాటలుతో, అలాగే మన ఆధ్యాత్మిక భావనల పేరడీతో, అభినందనలు తెలుపు దామా. అందరికన్నా మనది ప్రత్యేకముగా ఉండాలి కదా, చిత్తశుద్ది వాక్సుద్ది తో.

ఒంటరి మనసులకి కమ్మటి జోల పాడే పాట. ఒంటరి మనుషులు అనే కన్నా, ఒంటరి మనసులు అంటే సరిపోతుంది అందరికీ. ఎందుకంటే, 10 మందిలో ఉన్నా తాను ఒంటరే, పెళ్ళి అయినా తాను ఒంటరే, పార్టీలో సంఘములో అపార్ట్మెంట్ లో ఎక్కడ ఉన్నా తాను ఒంటరే.

ఎందుకంటే, అవసర అవకాశవాదులుగా ఉన్న మన పెంపక సంస్కారం, సొంత ముదుసలి తల్లి దండ్రులనే వదులుతున్నప్పుడు, ప్రపంచములో ఇంక దేన్ని వదలడానికి, వెనకాడుతుంది, ఈ మానవ మ్రుగం?

పౌర్ణమికి ఆకాశం లో ఒంటరిగా చంద్రుడు ఉంటారు. పాపం అమావాస్యకు మాయం అవుతారు, ఎవరన్నా బాధపడతారా?

అయ్యో పాపం, ఎటుపోయాడు అని జాలి చూపిస్తారా? మిణుకు మిణుకు మంటూ చుక్కలు ఎన్ని ఉన్నా, తన సరి జోడు చుక్క ఉండదు కదా?

అంతే కదా, మనకూ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని బంధువులు స్నేహితులు బంధాలు కావాలంటే, దొరుకుతారా? మనమూ ఒంటరే.

పాపం ఎల్ల లోకాలకు వెలుగు నిచ్చే, వేడి నిచ్చే, ఆ సూర్య దేవుడు కూడా ఒంటరే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మన చూపులకు. కానీ తన ప్రజా సేవలో తాను రమిస్తూ, మనలాగే ప్రశాంతముగా మనశ్శాంతిగా ఉంటారు.

కాబట్టి, ఓ చందమామా మా కధ విను, మనసు ఉంటే, మాకు జతగా స్నేహితుని గా ఉండు అని కోరడం తప్పు కాదు. అదీ ఒక ధ్యానమే. ఆయన పేదలకు, ఒక ఉచిత దీపం. చంద్ర కళలే, పాఠాలు ఎంతో మందికి. ఆయన రాకపోతే, పువ్వులు విరియరు. పిల్లలకు ఆనందం కలుగదు.

ఆకాశం లో ఆయన ఒంటరి, మన ఇంట్లో మనం ఒంటరి. ఆయన వెన్నెల పంచుతూ, రాత్రి అంతా తిరగాలి. మనము కన్న తల్లి కి మరియు జగమంత కుటుంబానికి సేవలు చెయ్యాలి, మంచి మాటలు పాటలు కధనాలు సందేశాలు స్టేటస్ లో వింతలు మాత్రుభాష తెలుగులో.

ఆయనకు మనకు శాస్వత బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు. మనల్ని అలాగే ఆయనను అమావాస్యకు చూసి, అయ్యో పాపం, అనేవారు ఎవ్వరు లేరు. అందుకే మనకు శాశ్వతం మన ఆత్మ, అంటే దేవుడు, మరి ధ్యానములో ఆచరణలో మనము దేవుళ్ళము కాగలిగితే, మనమే ఆ పరమాత్మము, జగమంత కుటుంబం మనదే, సూర్యునికి చంద్రునికి లాగా.

మామా... చందమామా...వినరావా...నా కథ..

మామా, చందమా.మా., వినరావా.. నా కథ..
వింటే, మనసు ఉంటే, కలిసేవూ., నా. జత..ఆ ఆ
మామా...చందమామా

నీ రూ.పము ఒక దీ.పము, గతిలే.ని. పే.దకు...2
నీ కళలే.., సాటిలే.ని, పాఠా.లు, ప్రేమకు.. 2
నువు లే.క, నువు రా.క, విడలేవు కలువలు...
జాబిల్లి, నీ హాయి, పాపల.కు జోలలు....
మామా... చందమామా

మింటిపైన నీ.వు, ఓంటిగాడివై..., అందరికీ వెన్నెల పంచ., రే.యంత తిరగాలి..
ఇంటిలోన నే.ను, ఒంటిగాడినై..., అందరికీ సేవలు చేయ., రే.యి పవలు తిరగాలి
లేరు మనకు బంధువులు.., లేరు తల్లిదండ్రులు ... 2
మనను చూసి, అయ్యో పాపం, అనేవారు ఎవ్వరు
అనేవారు ఎవ్వరు...

మామా, చందమా.మా., వినరావా.. నా కథ..
వింటే, మనసు ఉంటే, కలిసేవూ., నా. జత..ఆ ఆ
మామా...చందమామా

Music-V Kumar; Lyrics-Rajasri; Star Cast - Chalam, Sharada, SV Ranga Rao  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,160; 104 తత్వాలు (Tatvaalu) and views 226,399
Dt : 10-Jul-2023, Upd Dt : 23-Aug-2023, Category : Songs
Views : 365 ( + More Social Media views ), Id : 1829 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Mama , Chandamama , Vinarava , Sambarala , Rambabu , Chalam , Sharada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content