మహారాజు - కైలాస శిఖరాన కొలువైన స్వామి, రాజువయ్యా మహరాజువయ్యా - శోభన్ బాబు, సుహాసిని, శ్రీధర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,047,838; 104 తత్వాలు (Tatvaalu) and views 235,592.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మంచి వారి త్యాగాలను, సేవలను, గుణాలను గొప్పగా చెప్పే, పొగిడే పాట ఇది. చాలా తక్కువ మంది వ్యక్తులు ఉంటారు ఈ లక్షణాలతో, 20 శాతం. ఇతరుల కోసం, తాము అన్ని వదలుకుంటారు. మనసున్న మంచోళ్ళే, మా రాజులు, మమతంటు లేనోళ్ళే నిరుపేదలు అనేది అందుకే.

ఎవరేమి అనుకుంటే, మనకేమిలే అనుకుంటూ, దేవుడు మెచ్చితే చాలు అని, తమ మంచి పనులు తాము కొనసాగిస్తూనే ఉంటారు, ఎంత నష్టము అయినా, ఎవరూ మెచ్చకపోయినా. అలాంటివారికి తోడుగా అండగా ఉండే భాగస్వామి, స్నేహితులు, బంధువులు దొరికితే? ఇంకా అద్రుష్టము, అందరికీ, మనశ్శాంతి ఉంటుంది.

ఇతరులు చేయలేని పనులను, వీరు కఠిన సాధనతో పట్టుదలగా చేస్తారు. అందుకే, వారికి వారే రాజులు, మహరాజులు. ఇది ధనం తో, మంది మార్బలము, అధికారం తో వచ్చే గొప్పతనము కాదు. కేవలం సంస్కారం త్యాగం సేవ తో వచ్చే గొప్ప గుణం. అంటే, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించిన వారు మాత్రమే, ఇవి చేయగలరు.

ప్రేమ కన్నా, నిధులు ఆస్తులు పదవులు లేవు. వారికన్నా ఎవరయ్యా మారాజులు? వారినెవరు ఏమన్నా, వారి దాసులే అవుతారు? జరిగినవి, జరిగేవి, అన్ని బ్రమలే అనుకోవాలి మరి.

కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి
మనసున్న మంచోళ్ళే, మా..రాజులు
మమతంటు లేనోళ్ళే, నిరుపే..దలు
ప్రేమే నీ రూపం, త్యాగం నీ ధర్మం
ఎవరే.మి అనుకుంటే, నీకే.మిలే
రాజువయ్యా., మహరాజువయ్యా..2

కన్నీ.ట తడిసినా.., కాలాలు మారవు
మనసారా నవ్వుకో.., పసిపాపల్లే..
ప్రేమ కన్నా.., నిధులు లే.వు.
నీకన్న ఎవరయ్యా.., మారాజులు?
నిన్నెవరు ఏమన్నా.., నీ దాసులు?
జరిగినవి, జరిగేవి, కలలే అనుకో.. 2
రాజువయ్యా., మహరాజువయ్యా..

త్యాగా.ల జీవితం, తనవా.రి కంకితం
మిగిలింది నీ నేను, నా నువ్వేలే..
దేవుండంటి..., భర్త వుంటే..
నాకన్నా ఎవరయ్యా, మారా..ణులు?
మనకున్నా బంధాలే, మాగా..ణులు
ప్రతి జన్మకు, నీ సతినై, పుడితే చాలు
రాజువయ్యా., మహరాజువయ్యా.. ||కైలాస శిఖరాన||

చిత్రం: మహారాజు (1985);సంగీతం: చక్రవర్తి; రచన: వేటూరి. సుందరరామమూర్తి; గాయని: సుశీల; శోభన్ బాబు, సుహాసిని, శ్రీధర్

Maharaju (1985), kailasa sikharana koluvaina swami, Rajuvayya Maharajuvayya - Shobhan Babu, Suhasini, Sridhar  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,047,838; 104 తత్వాలు (Tatvaalu) and views 235,592
Dt : 04-Jan-2023, Upd Dt : 04-Jan-2023, Category : Songs
Views : 790 ( + More Social Media views ), Id : 1685 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : maharaju , kailasa , sikharana , koluvaina , swami , rajuvayya , maharajuvayya , shobhan , babu , suhasini , sridhar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content