శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర - నీవెవరో నీ జన్మం, మాయదారి మరల, చెప్పలేదని అనకపోయేరు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,065,276; 104 తత్వాలు (Tatvaalu) and views 236,368.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గురు పౌర్ణమికి అలాగే గురువారం, ముందు మన తెలుగు సద్ గురువులు బ్రహ్మం రాఘవేంద్ర వేమన గార్లను తలచుకుందాము - వారి హైందవ ఆధ్యాత్మిక క్రుషి, పద్యాలు కాలజ్ఞానం గుర్తు చేద్దాము.

ఇంట్లో ఖచ్చితము గా వారి ఫోటోలు పెట్టుకుని, వీరు మన తాతలు లాంటి వారు, గతాన్ని మరువకూడదు అని పిల్లలకు చెపుదాము. లేకపోతే, పిల్లలు మనల్ని కూడా మరుస్తున్నారు, ఆశ్రమాలకు లేదా ఇంట్లో ఒంటరిగా వదిలేస్తున్నారు కనికరం జాలి దయ లేకుండా. ఎందుకంటే మనము గతం, అలాగే సంస్కారం క్రుతజ్ఞత విశ్వసనీయత నేర్పలేదు కాబట్టి.

పొరుగింటి పుల్ల కూర ఎంత రుచైనా, కన్న తల్లి వంటే మనకు క్షేమము, రక్షణ - ఎందుకంటే మన అమ్మకు మన బుద్దులు గుణాలు ఆరోగ్యం స్పష్టముగా తెలుసు.

చూడండి మన తెలుగు గురువుల గొప్పతనం ఒప్పుకోవాలంటే, మన తెలుగు వారికే, ఎంత చిన్నతనముగా ఉందో, లైక్ షేర్ చేయాలి శభాష్ అనాలి అంటే? కాబట్టె ఎవరైనా, మనల్ని బోల్తా కొట్టించగలరు అబద్దాలు తో. గురువులంతా ఒకటే అనే మోహవశులు, తెలుగు గురువు గొప్పను, ఎందుకు మెచ్చరు? ఎందుకు ఫోటో ఇంట్లో ఉండదు?

దాని వలన నష్టం తెలుగు గురువులకు కాదు, నేల విడిచి సాము చేస్తున్న అంటే అరిషడ్వర్గాల బానిసలమైన అంటే బ్రమలలో వాస్తవాన్ని నిజాన్ని మరచిన, మన పరిస్థితి మన పిల్లల చేతిలో, ఇంతే ఆదరణగా ఉంటుంది అని మనము అందరికీ తెలియచెప్పడమే సుమా.

భగవంతుని సంకల్పము వలన మనము రాస్తున్నవి అన్ని, పురాణాలు గీత మూలము గానే రాస్తున్నాము, సొంత తెలివి ఏమీ లేదు. కాకపోతే, ఎప్పుడు దేనిని సరిగ్గా పోల్చాలో వాడాలో తెలియాలి, అది సాధనతోనే వస్తుంది. మిడి మిడి జ్ఞానం తో వితండవాదం చేయకూడదు, ముందు మన సాధన చెప్పాలి.

అలాగే బ్రహ్మం గారి తత్వం లో నుంచి తీసి పదునైన భావాలతో రాసిన, ఈ చిత్రము మాటలు పాటలు వినండి చదవండి ఎంత వేదాంత బోధన ఉందో. ఇలాంటివి ఇతర భాషా బాబాయిలు ఎవరైనా, స్వయముగా చెప్పిన రాసినవి ఉంటే, దయచేసి పంపగలరు, వారికి తగిన బహుమతి ఇద్దాము.

ఆసుపత్రులు పరిశోధనలు లేని ఆనాడే, మానవ జన్మ పుట్టుక, అంటే గర్భము లో పిండము ఎదగడం, 9 వ నెలకు పుట్టే క్రమాన్ని ఎంత బాగా వివరించారో చూడండి.

శుక్ల శోనితములు ఐదు దినమ్ములు, నీటి బుడగవలే ఉండునులే. పదిరోజులకు కోడిగ్రుడ్డు, ఆకారము అచ్చట చేకూరునులే. మల మూత్రమ్ముల మునిగి గర్భమున, తనలో తానే గొణుగునులే..పూర్వ జన్మమున పుణ్యము, చేయకపోతినే అనుచు చింతిచునులే..

అది మన బతుకు. మరి ఇప్పుడు కూడా, అరిషడ్వర్గాల బానిసత్వం వదలి, పుణ్యం చేయమా? తెలుగు లోనిది అర్ధము కాని మూర్ఖులు, ఇతర భాషవి తర్జుమా చేసుకుని అర్ధము చేసుకుంటారు అంటా? తర్జుమా సంస్క్రుతం నుంచి ఎటూ తప్పదు, అది దేవ భాష. అది హైందవ గురువులు అయితే, ఇతర భాషలవి తెచ్చుకుందాము, ముందు మన తెలుగు వి ఆచరించి ఏడిస్తే.

ఇంకో పాటలో, ఈ మాయ దేహం లో, ఆరు చక్రములు అమరియున్నవి, 6 చక్రాలను ఎంత బాగా వివరించారో చూడండి. మన బ్రతుకుకు అవి మూలం. అవి చెడిపోతే, ఇక మనము ఉండము, జాగ్రత్త గా కాపాడుకోవాలని ఇంకో అర్ధం.

వాటికి పని తీరు బాగా ఉండాలి అంటే, ధ్యానం తో వాటికి శక్తి రగిలించాలి, యోగాసనము తో కదిలించాలి, బ్రహ్మ ముహూర్తములో. చేసే చిత్తశుద్ది మనకు ఉందా? ఉంటే, ఆసుపత్రులు ఎందుకు నిండా ఉంటున్నాయి? ఎందుకు రోగాలకు ఆస్తులు అమ్ముతున్నాము? కరోనాకు ఎందుకు కళ్ళు తేలేస్తున్నాము?

ఈ అన్ని చక్రములకు నడినెత్తి పైన, బ్రహ్మ రంధ్రమొకటున్నది. ప్రణవ నిలయమై, తేజోమయమై, సహస్రదళముల కమలమందున. ఓం కారం, ధ్యనియించుచుండును… ఏకాగ్రతతో, మనసు నిల్పిన, ఓం కారము వినిపించును రా. భ్రూమద్యమ్మున దృష్టి నిలిపిన, పరంజ్యోతి కనిపించును రా. అని ఎంత బాగా ధ్యాన రహస్యాన్ని, తెలిపారు. బగవద్గీత చెప్పింది ఇదే కదా? మరి సాధన చేసామా? ఏమిటి మన స్తితి? ఏదీ మన వాక్సుద్ది?

ఇంకో పాటలో, చెప్పలేదంటనకపోయేరు, నా మాట వినక, తప్పు దారిని నడిచిపోయేరు.
నోరు లేని పశువులట్లు, తినితిరిగితె లాభమేమి. పరమార్థం, సాధించే, పుణ్యమార్గం తెలుసుకోండి.

యవ్వనమందున కన్నుకానకా…. కామక్రోధ మద మాత్సర్యాలతో. వావి వరుసలు లెక్కచేయక, ఆముటెద్దు వలె స్వేచ్చగా తిరిగినా. ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు

కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కస్సుమని బయటకి నెట్ట. కన్ను కనపడక, చెవి వినపడక, వృద్ధాప్యమ్మున వెతలకుండగా… ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు - అంటూ వాస్తవ ద్రుశ్యాన్ని చూపారు.

కఫవాతపిత్తాలు గతులు తప్పిననాడు..మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు. ఆలుబిడ్డలు నీకు కారు… అన్నదమ్ములు ఆ.పలేరు… ఐశ్వర్య బలము నిన్ను ఆదుకొనుటకు రా..దు… దైవ చింతకు నాడు తావు లేనేలేదు..ఎందుకురా నీకింత బాధ.. జీవా, వినుకోర కడసారి బోధ…

ఈ రోజు మన బతుకు, ఆనాడే స్పష్టము గా చెప్పారు. మరి ఊరికి 4 గుళ్ళు కడతామా వీరికి? అబ్బే మాకు తెలుగు గురువు వద్దు, మేము బెంగాలి మారాఠీ గురువుల సేవ చేస్తాము. అందరూ ఒకటే కాబట్టి, తెలుగు గురువులను వదిలేస్తాము. ఎందుకంటే, మా అమ్మా నాన్నలను కూడా వదిలేసాము కాబట్టి, ఇది అరిషడ్వర్గాల బానిసల వితండ వాదన.

ఇప్పుడైనా కళ్ళు తెరిచి, శరీర అవయవాలు అన్ని కదిలేటప్పుడే 40 ఏళ్ళ వయస్సులోనే, అరిషడ్వర్గాలను జయించి, దేవుని వైపు మరలుదాము.

1) నీవెవరో నీ జన్మం ఏదో, నిజం తెలుసుకో జీవా 2

సృష్ఠి క్రమమ్మును చెప్పెదనూ..ఇది చిత్తశుద్ధితో వినవలెను..
పిండోత్పత్తి క్రమమ్ము నెరింగిన, జ్ఞానోదయమూ కలిగేను ||నీవెవరో నీ||

స్త్రీ పురుషుల సంయోగము, పవిత్ర కార్యం అని భావించవలె
సత్ సంతానము పొంది జాతికి, సౌభాగ్యము చేకూర్చవలె. ||నీవెవరో నీ||

శుక్లా శోనితములు ఐదు దినమ్ములు, నీటి బుడగవలే ఉండునులే
పదిరోజులకు కోడిగ్రుడ్డు, ఆకారము అచ్చట చేకూరునులే

నెలకు గట్టి పిండముగా తేలి, శిరము ముందుగా తీరేను

రెండు నెలలకు కాళ్లు చేతులు, మూన్నెలలకు కడుపమరేను

నాలుగో నెలకు ఇరు పార్శ్వమ్ములు, ఐదో నెలకు పాదాలు వ్రేళ్లు

ఆరో నెలకు ముక్కు కన్ను చెవి, నవరంధ్రాలే పడతవిలే

ఏడో నెలకు జీవుడు చేరును, ఊర్ధ్వ ముఖముగా పిండం ఉండును

నాభి మొదలు బ్రహ్మ రంధ్రముదాకా, నాడి ఒకటి సమకూరునులే..

తల్లి జఠరాగ్నికడ్డు లేకుండా, తొడుగు చుట్టుకొని ఉండునులే..

ఎనిమిది తొమ్మిది నెలల సమయమున, పూర్వ జ్ఞానం ఉండునులే..

మల మూత్రమ్ముల మునిగి గర్భమున, తనలో తానే గొణుగునులే..

పూర్వ జన్మమున పుణ్యము, చేయకపోతినే అనుచు చింతిచునులే..

ప్రాణ వాయువు ప్రసారం వలన, పిండం బయటికి చొచ్చునులే..

బొడ్డు కోసి చన్నీళ్ళు చల్లగా, పూర్వజ్ఞానం మరచునులే..

మానవ జన్మా తత్వమిది, మహాత్ము లెరిగిన గోప్యమిది


2) మాయదారి మరలా బండి రా ….
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరియున్నవి రా…. - 2 సార్లు

పంచవింసతే తత్వమ్ములచే, దశవిధములైన వాయువులచే
సప్త దాతువులు నవనాడులచే, తైతక్కలాడే తోలు బొమ్మరా ….||మాయదారి మరల||

ఊపిరి పేరే హంస రా.. ఉచ్వాశ నిశ్వాసల కొలత రా …
అహం సోహం అను మార్గమ్మున పరమాత్ముడు నడిపే తమాషా బండి రా …||మాయదారి మరల||

భూమి నిలయమై గుధ స్థానమున, నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును
ఒక ఘడియ, నలభై విఘడియలకు, ఆరు నూర్ల హంస జపము జరుగును …
అధినాయకుడు గణపతి రా… అదే రా మూలాధార చక్రము….

ఆధార చక్రమునకు పైన, రెండంగుళములలో గుహ్యమందున
జనస్తానమై ఆరు దళముల, తెలుపు వర్ణమున వెలుగు చుండును
పదహారు గడియల, నలభై విఘడియలకు, ఆరువేల హంస జపము జరుగును…
అధినాయకుడు ప్రజాపతి రా … అదే రా స్వాదిష్టాన చక్రము…

స్వాదిష్టాన చక్రముపై, మూడంగుళములలో, నాభియందున
అగ్నినిలయమై, పది దళములతో, నీలిరంగున వెలుగు చుండును
పదహారు గడియల, నలభై విఘడియలకు, ఆరువేల హంస జపము జరుగును…
అధినాయకుడు లక్ష్మీపతి రా … అదే రా మణిపూరక చక్రము…

మణిపూరక చక్రముపైన, పది అంగులములలో హృదయమందున
వాయునిలయమై, పన్నెండు దళముల, పచ్చని కాంతితో వెలుగుచుండును
పదహారు గడియల, నలభై విఘడియలకు, ఆరువేల హంస జపము జరుగును…
అధినాయకుడు గౌరీపతి రా … అదే రా అనాహత చక్రము…

అనాహత చక్రము పైన, పన్నెండు అంగులములలో కంఠమందున..
గగననిలయమై, పదహారు దళముల, జ్యోతి వర్ణమున వెలుగు చుండును
రెండు గడియల, నలభై ఐదు విఘడియలకు, వేయి హంసల జపము జరుగును…
అధినాయకుడు జీవుడు రా … అదే రా విశుద్ధ చక్రము…

విశుద్ధ చక్రం మొదలు, పన్నెండంగుళములలో, భ్రూమధ్యమందున
అంతః కరణనకు నిలయమై, రెండు దళముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును
రెండు గడియల, నలభై విఘడియలకు, వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు సర్వేశ్వరుడు రా … అదే రా ఆగ్నేయ చక్రము..

ఈ చక్రములకు నడినెత్తి పైన, బ్రహ్మ రంధ్రమొకటున్నది
ప్రణవ నిలయమై, తేజోమయమై, సహస్రదళముల కమలమందున
ఓం కారం, ధ్యనియించుచుండును…
రెండు గడియల, ఆరు విఘడియలకు, వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు గురుమూర్తి రా … అదే రా సహస్రారము….

ఏకాగ్రతతో, మనసు నిల్పిన, ఓం కారము వినిపించును రా
భ్రూమద్యమ్మున దృష్టి నిలిపిన, పరంజ్యోతి కనిపించును రా

ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా ! ముక్తి మీకు ప్రాప్తించును రా !


3) చెప్పలేదంటన కపోయేరు, నా మాట వినక, తప్పు దారిని నడిచిపోయేరు.. 2
నోరు లేని పశువులట్లు, తినితిరిగితె లాభమేమి
పరమార్థం, సాధించే, పుణ్యమార్గం తెలుసుకోండి … ||చెప్పలేదంటన ||

బాల్యమందున అజ్ఞానంలో, అల్లరి చిల్లర చేష్టల చేయుచు
వంట బట్టని చదువుల తో, మూర్ఖత్వమ్మున మునిగిపోయినా
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు

యవ్వనమందున కన్నుకానకా…. కామక్రోధ మద మాత్సర్యాలతో
వావి వరుసలు లెక్కచేయక, ఆముటెద్దు వలె స్వేచ్చగా తిరిగినా
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు

కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కస్సుమని బయటకి నెట్ట 2
కన్ను కనపడక, చెవి వినపడక, వృద్ధాప్యమ్మున వెతలకుండగా…
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు

ఆశ పాశం తెగదోసి అన్నచింతలు వదిలేసి, స్వపర బేదములు హెచ్చుతగ్గులు
కులమతమ్ముల గొడవలు మాని…
బ్రతుక్కు అర్థం తెలియకపోతే… పరమాత్ముని స్మరియించకపోతే..
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమీ అంటుకోదు
--
ఎందుకురా నీకింత బాధ.. జీవ వినుకోర కడసారి బోధ… 2
రెక్కలను ముక్కలుగ జేసి, రేపవల్ ఎన్ని అతుకులు అతికినా
బొక్కడన్నమే కాని, అంతకు మిక్కిలేది కలదు నీకు…
ఎందుకురా నీకింత బాధ.. జీవా, వినుకోర కడసారి బోధ…

కఫవాతపిత్తాలు గతులు తప్పిననాడు..మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు
ఆలుబిడ్డలు నీకు కారు… అన్నదమ్ములు ఆ.పలేరు…
ఐశ్వర్య బలము నిన్ను ఆదుకొనుటకు రా..దు…
దైవ చింతకు నాడు తావు లేనేలేదు..
ఎందుకురా నీకింత బాధ.. జీవా, వినుకోర కడసారి బోధ…

తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి..వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి
ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు, నీవాళ్ళ నమ్ముకుని నిగ్గుతావెందుకు..
ఉసురుకాస్తా పోతే.. విసరి నేలకు కొట్టి..
నిముషమైన శవా..న్ని నిలిపి ఉంచకపోరు
ఎందుకురా నీకింత బాధ.. జీవావినుకోర కడసారి బోధ…

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,065,276; 104 తత్వాలు (Tatvaalu) and views 236,368
Dt : 13-Jul-2022, Upd Dt : 13-Jul-2022, Category : Songs
Views : 912 ( + More Social Media views ), Id : 1462 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : madvirat , brahmendra , brahmam , swamy , charitra , movie , ntr , nivevaro , mayadari , marala , bandi , cheppaledanta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content