పాటతో పరమార్ధం - మా ఇంటిలోన మహలక్ష్మి నీవే - కొండవీటి సింహం - ఎన్టీఆర్, శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,758; 104 తత్వాలు (Tatvaalu) and views 239,955.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Maa Intilona Mahalakshmi - Kondaveeti Simham - NTR, Sridevi, Jayanthi, Mohan Babu

నీతి నియమానికి నిలబడే నాన్న, అమ్మను ఎంతో ముద్దు మురిపెముతో చూస్తూ, మా ఇంటిలోన మహలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, మన ఇంట సిరులెన్నో ఉన్నా, మా అందరి చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను అంటే ఉప్పొంగిపోని తల్లి ఉంటుందా. అది మాటలలోనే కాదు, చేతలు లో చేస్తే, ఇంకా ఎంతో మురిసిపోతుంది.

పిల్లలు గా, సాత్విక అమ్మను చూసి మురిసిపోతూ, సాత్విక కొడుకులు/ కూతుళ్ళు తప్పక పాడాల్సిన పాట ఇది.

ఈ 78+ ఏళ్ళ వయసులో కూడా, వద్దు అన్నా, కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం, కొడుకు కి ఏదైనా వండిపెట్టాలి అనుకోవడం, శనివారం 4.30 కి లెగిచి గుడి మార్కెట్ నుంచి 1 గంటదాకా ఓపికగా ఉండటం, ఏరోజు ఉదయం 5 తర్వాత నిద్రపోనీయక పోవడం, బయట తిళ్ళు అనారోగ్యమని చెప్పడం, దేవుని మంత్రాలతో కొలవాలని తాను అంటూ మాకు నేర్పడం, ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అవమానాలు వచ్చినా కూడా, బిడ్డలు ఎదిగి చేతికి వస్తే చాలు అన్న ప్రేమతో, అన్నిటిని తట్టుకుని ఇన్నాళ్ళు నిలబడింది.

ఏనాడూ ఒకరిని ఒకమాట అనలేదు, నీతి నియమాలు తప్పలేదు. సహనం, ఓర్పు, క్షమ, క్రుతజ్ఞత, జాలి, విశ్వసనీయత, కష్టపడటం, అన్ని లక్షణాలు, మనకు ఇచ్చింది. మరి మీ అమ్మ గొప్పతనము కూడా, అందరితో పంచుకుంటారు కదూ?

పెద్దల నిశ్చయంతో పెళ్ళికి, గోరంత పసుపు నీవడిగినావు. మీ నూరేళ్ళ సంస్కార బ్రతుకు, మా అందరికీ కిచ్చినావు. క్షణమొక్క ఋణమై, పెరిగింది బంధం, త్యాగాలమయమై సంసార బంధం. మీ చేయి తాకి చివురించె మాలో చైతన్యం, అదే మాకు చైత్రం మాసం. మీ హస్తవాసే మాకున్న నేస్తం, సాత్విక హ్రుదయాల అనురాగ సూత్రం.

ఎన్ని జన్మల పుణ్యమో, మా అమ్మ నీవై కనిపించినావు. ఈ పంచభూతాల బొమ్మనెపుడో, కదిలించినావు. మిము చూడగానే, పొంగింది త్యాగ రక్తం. కనుచూపులోనే మెరిసింది పాశం. నీ కంటి చూపే మా ఇంటికి కార్తీకదీపం. ఆ వేదాలలో చెప్పిన దైవాలకన్నా, దయ ఉన్న రూపం, ఈ మా ఇంటి దీపం, నిండు నూరేళ్ళు వెలుగుతో.

ఈ విధముగా పాట పాడండి అంటే, లక్ష మంది గాయకులు పాడగలరు. కానీ అదే విధముగా సేవలు చెయ్యండి ముదుసలి తనములో అమ్మ నాన్నకు అంటే, ఏ ఒక్క బండ హ్రుదయము కదలదు.

రోజూ కూరలు కడగడం, అంట్లు కడగడం, ఇల్లు చిమ్మడం, జుట్టుకు రంగు వేయడం, చేతి కర్రలా చేయి పట్టుకుని 1 మైలు నడక తిప్పడం, సాక్సు బూట్లు వేయడం, సొంత ఆయుర్వేదముతో బీపీ షుగరు ని నియంత్రించి, మందు బిళ్ళను నిండు నుండి సగానికి తేవడం, తిన్న పళ్ళెం కడగడం మెతుకులు ఎత్తి, రోగ బాధతో లెగవకపోతే 1 మరియు 2 మంచం మీద నుంచే ఎత్తి పోయడం, ఇవన్నీ చేసారా? చేయగలరా? చేస్తారా? దానిని బట్టి, మనకు క్రుతజ్ఞత విశ్వసనీయత ఉన్నదని దేవుడు భావిస్తారు. ముందు కనీసం తెలుగు లో రాయగలమా, భాషా ద్రోహులు గా మిగలకుండా?

* * *

మా ఇంటిలో.న మహలక్ష్మి నీ.వే., మా కంట వెలిగే. గృహలక్ష్మి నీ.వే.
సిరులెన్నో ఉ.న్నా. చిరునవ్వు నీ.వే., నీ కంట తడిని. నే చూడలే.ను ||మా ఇంటిలోన||

గోరంత పసుపు. నీవడిగినా.వు.. నూరేళ్ళ బ్రతుకు. మాకిచ్చినా.వు.
క్షణమొక్క ఋణమై. పెరిగింది బం.ధం .. త్యాగాలమయమై. సంసారబం.ధం.
నీ చేయి తా.కి. చివురించె చై.త్రం .. ఈ హస్తవా.సే. నాకున్న నే.స్తం.. అనురాగ సూ.త్రం !!

మా ఇంటిలో.న మహలక్ష్మి నీ.వే., మా కంట వెలిగే. గృహలక్ష్మి నీ.వే.
సిరులెన్నో ఉ.న్నా. చిరునవ్వు నీ.వే., నీ కంట తడిని. నే చూడలే.ను

మా అమ్మ నీ.వై. కనిపించినా.వు.. ఈ బొమ్మనెపుడో.. కదిలించినా.వు.
నిను చూడగా.నే. పొంగింది రక్తం.. కనుచూపులో.నే. మెరిసింది పా.శం.
నీ కంటి చూపే కార్తీకదీ.పం.. దైవాలకన్నా. దయ ఉన్న రూపం.. ఈ ఇంటి దీ.పం !!!

మా ఇంటిలో.న మహలక్ష్మి నీ.వే., మా కంట వెలిగే. గృహలక్ష్మి నీ.వే.
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీ.దే., మీ కంట తడిని నే చూడలే.ను

మా ఇంటిలో.న మహలక్ష్మి నీ.వే., మా కంట వెలిగే. గృహలక్ష్మి నీ.వే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,758; 104 తత్వాలు (Tatvaalu) and views 239,955
Dt : 15-Mar-2024, Upd Dt : 15-Mar-2024, Category : Songs
Views : 236 ( + More Social Media views ), Id : 2054 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Maa Intilona Mahalakshmi , Kondaveeti Simham , NTR , Sridevi , Jayanthi , Mohan Babu , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content