ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్న తల్లిదండ్రులు ను ఈ సారికి వదిలి, కాబోయే వరుడి పీక కోసిన యువతి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2096 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2131 General Articles and views 1,976,416; 104 తత్వాలు (Tatvaalu) and views 231,926.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్న, తల్లిదండ్రులు బంధువులను స్నేహితుల ను, కనికరం తో స్వార్ధం తో ఈ సారికి వదిలి, పరాయి అమ్మ గారాల వంశ బిడ్డ అన్న కనికరం ఇంగితం పాపభీతి లేకుండా, భవిష్యత్ ప్రాక్టీసు కోసం, కాబోయే వరుడి పీక కోసిన, ఆధునిక విజ్ఞాన సంస్కార యువతి. మరి పెళ్ళి అయ్యి ఉంటే, ఇంకేమి జరిగి ఉండేదో?

ఇప్పుడు ఈ వార్త, దేశమంతా ప్రచారం లో ఉంది. పె(త)రుగుతున్న మన నాగరికత సంస్కారమునకు చిహ్నం గా.

పిల్లల 20 ఏళ్ళ వయసు దాకా, పెంపకం ను గాలికి వదిలేస్తే, టీవీ సీరియల్స్ బిగ్ బాస్ సినిమా డ్రగ్స్ మత్తులో ఉండి, ఇంటి దగ్గర లేదా హాస్టల్ లో వదిలేసి చేతులు దులుపుకుని, తల్లి దండ్రులు సంస్కారం నేర్పకుండా, ధన సంపాదన మత్తు లో మరిగి, ప్రాపంచిక మోహములో మునిగి, పిల్లలను గారాబము చేస్తూ, అన్ని వారే తెలుసుకుంటారు చూసుకుంటారు మార్చుకుంటారు కోసుకుంటారు అని, ఇంటి క్షేమం బాధ్యత మరస్తే, ఆ తరువాత గొంతు కోత వంతు సొంత తల్లిదండ్రులు కే నేమో.

చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదే కదా? బలహీన పెంపకాలను ఇలాంటి ఎన్నో ఉదాహరణలు, మన చుట్టూ. పెళ్ళి కాకముందే, బయట పడ్డాడు ఆ అబ్బాయి అద్రుష్టవంతుడు.

అబ్బాయిలు కూడా ఇలా చేసారు, అమ్మాయిలు ఒప్పుకోలేదని. అదీ తప్పే.

కాని ఇక్కడ విచిత్రం, నిస్చితార్ధం చేసుకున్న కాబోయే మొగుడు. ఫోన్ చేసి, బయటకు రమ్మని, కళ్ళు మూసుకోమ్మని, చున్ని కళ్ళకు కట్టి, సర్ప్రైజ్ అని, ఇలా చేయడం, కొత్త ట్రెండ్ సెట్ చేసారు.

ఇక, ఒకరంటే ఒకరికి భయము తో, బుల్లెట్ ప్రూఫ్ జాక్కెట్ లతో మరియు పక్కన బాడీ గర్డులు లేదా చుట్టాల సమ్రక్షణ లో, కాపురాలు పెళ్ళిళ్ళు జరగాలేమో, దేవుడా?

భస్మాసురులను పెంచి పోషించిన పాపం ఊరికే పోదు కదా. 60 ఏళ్ళ తర్వాత తల్లి దండ్రులు పడాల్సిన ఇబ్బందులు, 20 ఏళ్ళకే పడాల్సిన రోజులు వస్తున్నాయి.

అయినా మొహములో, మా పిల్లలు బుద్ది మంతులు రోజూ 1 నిజం కన్నా ఎక్కువ చెపుతారు, అసలు తప్పు అంతా అవతల వారిదే అనే జనం ఎక్కువ అయ్యారు, ఇంకా తమ పిల్లలను చెడగొట్టి వారి చేతిలోనే చెప్పు దెబ్బలు తినడానికి.

మొన్న, ఆటో ఆయన కిడ్నాప్ చేసారు అని ఇంకొకరు కేసుపెడితే, చివరకు అది తప్పుడు కేసు అని పోలీసులు తేల్చేసారు.

ఎంత నిర్లక్ష్యం నిర్దయ అయితే, పరాయి బిడ్డ ను, ఇలా చేస్తారు? నీకు ఇష్టం లేని పెళ్ళి అయితే, దానిని కాదనే విధానం ఇదేనా? ఇదేనా పద్దతి?

భారతం, రామాయణం, భాగవతం నేర్పండి అంటే, అబ్బే సమయం లేదు. ఇప్పుడు ఆమె జైలుకు వెళితే లేదా ఆత్మ హత్య చేసుకుంటే, అప్పుడు పూర్తి సమయం ఉంటుందా?

నీకు పెళ్ళి ఇష్టం లేనప్పుడు ఇంట్లో వారితో తగవుపెట్టుకుని, బంధువులు పదిమందితో నచ్చ చెప్పుకుని, పెళ్ళి ఆపుకోవడమో లేదా నచ్చిన వాడినే చేసుకోవడమో, మీ పాట్లు మీరు పడాలి కానీ, ఇతరుల పెద్దల ఆశలతో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు?

కాకపోతే మగవారు తో పాటు గా, మహిళలు పోటీపడ్డారు అంటే మాత్రం, మా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే సమానత్వం కిందా, ఇంకా ఎన్నో అరాచకాలు తప్పకుండా చూస్తాము.

ఇప్పటి కే మేము కాపురము చెయ్యము, పిల్లల్ని కనము, అసలు పెళ్ళే చేసుకోము. కానీ అద్దె జంటగా ఉంటాము అవసరాలు తీర్చుకుంటాము చదువు సమయములోనే, అనే వారు ఎక్కువ అయ్యారు, తల్లి దండ్రుల నిర్లక్ష్యం వలన.

స్వేచ్చ స్వాతంత్రం ధనం అజ్ఞానం, ఎక్కువ అయ్యే కొద్దీ, పతనం దగ్గర అవుతుంది మరి. అందుకే పెద్దలు పెరుగుట విరుగుట కొరకే అంది. ధనం లో పెరుగుతూ, మానం లో తగ్గిపోతున్నాము.

Leaving her parents for now for doing marraige, ap girl attack on fiance in anakapally district  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2131 General Articles and views 1,976,416; 104 తత్వాలు (Tatvaalu) and views 231,926
Dt : 20-Apr-2022, Upd Dt : 20-Apr-2022, Category : General
Views : 659 ( + More Social Media views ), Id : 1358 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parents , marraige , ap , girl , attack , slit , fiance , throat , anakapally , district
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content