పాటతో పరమార్ధం- కొంత మంది కుర్రవాళ్ళు(శ్రీశ్రీ) - విప్లవశంఖం - గిరిబాబు, మాదల రంగారావు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,031; 104 తత్వాలు (Tatvaalu) and views 226,577.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Konthamandi Kurrallu(SriSri) - Viplava Sankham - Madala Ranga Rao, Giribabu

ఆనాటి సమాజం లో సగం అటు సంగం ఇటుగా నిస్తేజమైన యువతరం ఉంటే, నేడు అది 80 శాతం నిస్తేజముగా తయారయ్యారు. పెద్దల ఆస్తులు, వారి బుర్రలను ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఏది మంచో ఏది చెడో వారికి తెలీదు.

హాస్టల్ లో వేసి చదివించిన పెంపకం, మానవత్వం పూర్తిగా దిగజార్చింది. అమ్మమ్మ తాతల ప్రేమ వాత్సల్యం వీరికి లేవు, ఎందుకంటే సొంత అమ్మ నాన్న దగ్గర కూడా ఉండేది తక్కువ. ఉన్నా, వారికి బాధ్యతలు మర్యాద సంస్కారం నేర్పే పని పెద్దలు చేయడం లేదు, సంపాదన/ ఆనందం లో క్షణం తీరిక లేక.

అదేమంటే, రేపు ఎటూ మా పిల్లలు చూడరు, కాబట్టి మేము ఎక్కువ సంపాదించి పెట్టుకుంటున్నాము తప్పేమిటి అంటారు. తూలిపడే వయస్సు వస్తే, ధనం ఆదుకోదు, మానవత్వం ఉన్న మనిషి మాత్రమే ఆదుకుంటారు అని, ఇప్పుడు అమ్మను చూస్తూ కూడా వీరు ఆలోచన చెయ్యరు, బుద్ది మార్చుకోరు.

నాటి మరియు నేటి కుర్రవాళ్ళు, పుట్టుకతో వృద్ధులు, పేర్లకీ పకీర్లుకీ, పుకార్లకీ నిబద్ధులు. ఎంత దిగజారి పోయారు అంటే, మనకు తెలుగు గురువులు తెలుగు లో చెపుతుంటే మంచి మనకు వద్దు, వీరిని వదిలి, ఇతర భాషలలో బాబాయి వెంట ఆ భాషలో బోధనలు వింటే, వారి వ్యాపారం బాగా సాగుతుంది అంటే, పోలో మని ఆ పుకార్లకు పడిపోయి, మానసిక బలహీనంతో, బాబాయి వెంట పడతారు, అసలు తల్లి దండ్రిని వదలి.

వీరికి, కళలన్నా కవితన్నా పద్యమన్నా పాడటమన్నా కధనం రాయడమన్నా, చుక్కెదురు, అబ్బే అవి మనుషులు కదా చేసేది మాకెందుకు ఆ తలనొప్పి అంటారు. గోలచేసి అరవడమే, మంచి చేసే వారిని మందలించండం ఎగతాళి చెయ్యడం, వీళ్ళెరుగుదురు. అందుకే పాటలో అంటున్నారు, మిడి మిడి జ్ఞానం తో ఉన్న, నడిమి తరగతికి చెందిన, అవగుణాల కుప్పలు, ఉత్తమొద్దు రాచ్చిప్పలు.

నూతిలోని కప్పలు, ఎందుకంటే చెప్పింది వినరు, వారంతట వారు తెలుసుకోరు. ప్రాపంచిక మోహాల్లో పడి, పతనము అవుతారు. ఇంకొంతమంది, నాయకుల చేతిలో, అనుచరులు గా అన్యాయాలు చేస్తూ, వారి చేతిలోనే బలి అవుతున్నారు. తాతగారి నాన్నగారి, వంకర భావాలకి దాసులు, వారి భజన చేసుకుంటూ, ఆస్తులు ఆరగిస్తూ, నేటి నిజం చూడలేని, కీటక సన్యాసులు అంటున్నారు పాటలో.

ఎవరన్నా ప్రతి వారము, భోజనము ఉచితము గా పెడతాము హోటెల్ లో అంటే, వారి వెంట పరుగులు, ఎందుకు పెడుతున్నారు, మనకు మన కుటుంబానిని తల్లి దండ్రులకు సంపాదన గౌరవం మర్యాద లేదా, అన్న ఇంగిత జ్ఞానం ఉండదు.

కానీ నాడు, నేడు కూడా, కొంత మంది యువకులు, రాబోవు యుగం దూతలు. పావన నవ జీవన, బృందావన నిర్మాతలు, వీరు సంస్కార పెంపకం కలిగి, తాము ఇతరులకు మార్గ దర్శకముగా ఉంటూ, ఇతరులకు మంచి దోవ చూపిస్తారు. బానిస పంథాలను, తలవంచి అనుకరించరు, పోనీ అని అన్యాయపు, పోకడలు సహించరు. గతకాలపు మితవాదపు, గారడీలు నమ్మరు, స్వార్ధానికి లొంగిపోయి, ఆశయాలు అమ్మరు, తమ లక్ష్యం మరువరు. స్తిర చిత్తముతో, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, 3 ఏళ్ళు ఆదాయం లేకపోయినా, తమ ముదుసలి తల్లి తండ్రుల మరియు ప్రజల క్షేమం మరువరు, తమ బాట విడువరు. మరి మన పిల్లలు లో ఇలాంటి యుగ దూతలు ఎంత మంది ఉన్నారో, అందరికీ చెబుదామా?

కొంత మంది కుర్రవాళ్ళు, పుట్టుకతో వృద్ధులు
పే.ర్లకీ పకీర్లుకీ, పుకా.ర్లకీ నిబద్ధులు ||కొంత మంది||

కళలన్నా కవితన్నా., వీళ్ళకి చుక్కెదురు 2
గోలచేసి అరవడమే, అయ్యో.. వీళ్ళెరుగుదురు ||కొంత మంది||

నడిమి తరగతికి చెందిన, అవగుణాల కుప్పలు 2
ఉత్తమెద్దు రాచ్చిప్పలు, నూతిలోని కప్పలు ||కొంత మంది||

తాతగారి నాన్నగారి, భావాలకి దాసులు 2
నేటి నిజం చూడలేని, కీటక సన్యాసులు ||కొంత మంది||

కొంత మంది యువకులు, రాబోవు యుగం దూతలు 2
పావన నవ జీవన, బృందావన నిర్మాతలు ||కొంత మంది||

బానిస పంథాలను, తలవంచి అనుకరించరు
పోనీ అని అన్యాయపు, పోకడలు సహించరు ||కొంత మంది||

గతకాలపు మితవాదపు, గారడీలు నమ్మరు 2
స్వార్ధానికి లొంగిపోయి, ఆశయాలు అమ్మరు, తమ లక్ష్యం మరువరు||కొంత మంది||

వారికి మా ఆహ్వానం 3, వారికి మా వందనం

విప్లవశంఖం 1982 గిరిబాబు, మాదల రంగారావు
శ్రీశ్రీ ; నందమూరి రాజా ; ఎస్. పి . శైలజ

Konthamandi Kurrallu, Viplava Sankham, Madala Ranga Rao, SriSri, Sri Sri, Giribabu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,031; 104 తత్వాలు (Tatvaalu) and views 226,577
Dt : 16-Jun-2023, Upd Dt : 16-Jun-2023, Category : Songs
Views : 447 ( + More Social Media views ), Id : 1799 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Konthamandi , Kurrallu , Viplava , Sankham , Madala , Ranga , SriSri , Sri , Giribabu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content