APLatestNews.com top Banner

Social Media links
కాలె ఆకు రసం - మునగాకు కు, అక్క లాంటిది. ఇంటి ఆహార మందు. - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 920 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

కాలె(KALE) ఆకు రసం ఇంతకుముందు కూడా అనుకున్నాము. అత్యధిక శక్తి ఉన్న ఆకు, అమెరికాలో ఉంది. మరి ఇండియా లో ఉందో లేదో మరి. మన మునగాకు కు, అక్క లాంటిది.

కొన్ని రసాలు, మొదట్లో అలవాటు పడిందాకా, కొంతమంది కి విరోచనాలు, తలనొప్పి, తల తిరగడము, వేడి కూడా చేస్తాయి. అంత మాత్రాన మానేస్తామా?

ఈ కాకర, పుదిన కొత్తిమీర ఆకు, కాలే, సెలరి రసాలు, 7 రోజులు లో, మీ వీలును బట్టి మార్చుకోవచ్చు. అన్నింటికీ కామన్ కీలకం, అల్లం వెల్లుల్లి. ఉదయము 7 లోపు, మంచి నీళ్ళు చెంబు తర్వాత.

కొంతమంది కి చేదు నచ్చదు అంటే కాకర వేప, కానీ అదే మన ఆరోగ్య రహస్యం. మంచి విషయం కూడా చాలా మందికి నచ్చదు, కానీ అదే మన మనశ్శాంతి రహస్యం.

చిన్న పిల్లలు మందు, సూది వద్దు అని ఏడ్చి గీపెడతారు. కానీ వదలము కదా. మరి మనం కూడా అలాగే కొనసాగించాలి కదా.

కాలె దొరకని వారు, దాని బదులుగా మునగాకు రసం తాగవచ్చు. సేమ్ అదే పద్దతి. మునగాకు ను, తోటకూర లాగా పప్పులో కూడా వాడతారు.

ఇవి అన్ని 5 ఏళ్లుగా మేమిద్దరం వాడుతున్నాం. కనీసం పది ఏళ్ళు వయస్సు దాటితే మంచిదేమో, పిల్లలు తట్టుకోలేక పోవచ్చు. అది మరలా వారి కెపాసిటీ బట్టి ఉంటుంది. ఎందుకంటే, విదేశాల్లో మాంసము బర్గర్ బయట తిండి ఐదు ఏళ్ళకే పెడుతున్నారు.

ఇది ఇంటి ఆహార మందు, ఇందులో రసాయనాలు లేవు. కానీ ఆకు పంటలో, రసాయనం ఉంటే, మనమేమి చేయలేము.

ఆసుపత్రి లేదా ఇంకొకరు దగ్గరకు పోయి అడగండి, మా తమ్ముడు మైలు నడక, గుడి, పూజ, రామకోటి, ధ్యానం, ఆకురసం, రాగి సంగటి, యోగా చేయమంటున్నారు, చేయమంటారా అని.

75 శాతం వద్దు అంటారు మీకు సరిపడదు అంటారు, మనకు ఎటూ బద్దకము, నచ్చుతాయి వారి మాటలు. మీరు అవి చేస్తే వారి వ్యాపారం దెబ్బ తింటుంది, ఆదాయం రాదు, రోగులే అసుపత్రికి పెట్టుబడి.

చుట్టాలు అయితే, ఎక్కువమంది మన చెడు కోరుకునే వారే ఉంటారు. మిమ్మల్ని బాగు పడమని చెప్తారా? ప్రోత్సాహం చేస్తారా? చచ్చినా చేయరు, ఆ ఇట్లాంటివి చాలా విన్నాము అంటారు.

ప్రతి ఇంగ్లీషు మందు లో మంచి తో పాటు, సైడు ఎఫెక్ట్స్ ఉంటాయి. మంచి డాక్టర్ ను , బీపీ షుగర్ నెప్పులు టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అడగండి, అప్పుడు తెలుస్తోంది. కానీ ఇంటి కూర ఆకుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ? మన తాతల కాలము నుంచి తింటున్నాము కదా.

కాబట్టే, నీ అంత రంగాన్ని అడుగు, దీని వలన నాకు నష్టమా? ఇవేగా కూరలో వాడుతుంది ఇన్నాళ్లు. ఇప్పుడు పచ్చి రసం తాగుతా అంతే?

ఇక్కడ ఉన్నవారు, మా ఇంటికి చెప్పి వస్తే ఉదయం పూట 6 కి, సాంపిల్ కూడా చేసి ఇచ్చాము కొంతమందికి.

ఫలితాలు మీరు చూసారు కదా, 70 ఏళ్ల అమ్మ. షుగర్, బీపీ, ఒళ్ళు కాళ్ళు నెప్పులు ఒకసారి వచ్చాక, బిళ్ళ లు పెరుగుతాయే కానీ తగ్గవు.

మరి అమ్మకి, అన్నీ కూడా అరబిళ్ళ తగ్గింది, డాక్టర్ గారే తగ్గించింది, ఆకు రసం తాగమంది, కడుపు శుభ్రం అవుద్ది అంది. ఆ వయసు కు, శక్తి హీనం ఎక్కువ కదా? నొప్పులు బిళ్ళ, నెలకు మూడు కూడా వాడదు, గొప్ప కదూ.

షుగర్ వాళ్ళు, ఇంకా ఇంజక్షన్ కు వెళతారు. ఆ నొప్పులు భరించేవారు, అన్ని బిళ్ల లు మింగేవారు, మరి ఈ ఆకురసం తాగలేరా? వారు పోతే, ఆ కుటుంబం కు, మన లాంటి వారికి అండ ఎవరు?

రసం అంటే పచ్చి ఆకులు, నీళ్ళు అని తెలుసు కదా. మిక్సీలో గ్లాసు నీళ్లు పోసి, ఇవి అన్ని అంటే కాకర ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి, 2 నుంచి 5 నిమిషాలు మెదిగిన దాకా తిప్పాలి.

కొన్ని రసాలు, టీ కి వాడే, పెద్ద కంతల జల్లెడ లో వడగట్టి తాగాలి. కొంత పిప్పి కూడా దిగాలి, వడపోత లో, మన గ్లాసు లోకి. వడ గట్టకుండా, నేరుగా తాగినా నష్టము లేదు, ఇంకా మంచిది.

అనుమానాలు ఉంటే అడగండి. మీరంతా బాగుండాలి, డబ్బు ఆదాచేయాలి. అమ్మ, డాక్టర్ కు చెప్పి బాధపడింది, ఇవన్ని నాకు వద్దు అంది.

డాక్టర్ గారు, అది మామూలు ఆహారం, వద్దు అని నేనెలా చెపుతాను. మీ అబ్బాయి కరెక్టు, నమ్ము, తాగు. నమ్మకం లేకపోతే అది పనిచేయదు, వారం లో మానేస్తారు.

అమ్మ కు సంవత్సరం తర్వాత, గుణం కనపడింది. మనిషి ని బట్టి ఆహార అలవాట్లను బట్టి, అది మారుతుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 948 General Articles, 46 Tatvaalu
Dt : 11-Dec-2019, Upd Dt : 11-Dec-2019, Category : General
Views : 622 ( + More Social Media views ), Id : 250 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : kale juice
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content