పాటతో పరమార్ధం- కాదు సుమా, కల కాదు సుమా(పేరడీ)- కీలు గుర్రం- ANR, అంజలి, రేలంగి, జి.వరలక్ష్మి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,738; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kaadu suma kala kaadu(Perady) - Keelu Gurram - ANR, Anjali, Relangi, G. Varalakshmi

కోరికలు గుర్రాలై, ఆత్మ జ్ఞానం విడిచినప్పుడు, ప్రాపంచిక మాయలో పడినప్పుడు, అంతా నిజముగానే అనిపిస్తుంది, అందరూ తనవారే అని బ్రమ కలుగుతుంది, వారి కోసం ఎంత పాపానికి సాహసానికైనా సిద్దం గా ఉండాలి అనిపిస్తుంది. ఈ పాటలో అలాగే చెపుతుంది, కాదు సుమా, కల కాదు సుమా, గగన యానమును కల్గినట్లుగా, గాలిని తేలుచూ సోలిపోవుటిది అంటూ మత్తులో ఉంచుతుంది.

జీవుడు, ఇదంతా మాయ అని, గ్రహించి, తనకు తాను మానసిక నియంత్రణ చేసుకోవాలి, వాస్తవాన్ని ఇలా గుర్తుంచుకోవాలి - అవును సుమా ఇది మాయ సుమా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే సుమా.

ప్రేమలు పూచే, సీమల లోపల, వలపులు పారే, సెలయేరులలో తేటి పాటలను, మత్తు మోహములో తెలియాడితిని అన్నట్లు గా ఉంటుంది. కన్నె తారకాల కలగానముతో, వెన్నెల చేరుల, ఉయ్యాలలో, ఉత్సాహముతో ఊగుచుండుటిది అన్నట్లు గా మోహములో ఉంచుతుంది. పూల వాసనల గాలి తెరలలో, వలపు చీకటుల వన్నె కాంతిలో, దోబూచులాడుటిది అన్నట్లు మైమరపిస్తుంది.

మన మనసు దైవ ధ్యానములో, ఏళ్ళతరబడి సాధన లో మనసును అదుపుకు తెచ్చుకుని, అవును సుమా ఇది మాయ సుమా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే సుమా అని తరచూ గుర్తుంచుకోవాలి.

మాయలో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? కని పెంచిన ముదుసలి తల్లి దండ్రుల బాధ్యత స్వయముగా చుడకుండా, మన సమాన వైద్య సౌకర్యాలు ఇవ్వకుండా, పిల్లలకు సంస్కారం నేర్పకుండా, ఆస్తుల సంపాదన మత్తులో ఉండటమే. బిజీ బిజీ స్వయం పతనములో అన్న ఆలోచనే, మాయ.

కాదు సుమా, కల కాదు సుమా 2
అమృత పానమును, అమర గానమును 2
గగన యా.నమును, కల్గినట్లుగా
గాలిని తేలుచూ, సోలిపోవుటిది
కాదు సుమా, కల కాదు సుమా

అవును సుమా ఇది మాయ సుమా
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే సుమా.

1) ప్రేమలు పూచే, సీమల లోపల...2
వలపులు పారే, సెలయేరులలో
తేటి పాటలను, తెలియాడితిని
కాదు సుమా కల కాదు సుమా

అవును సుమా ఇది మాయ సుమా
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే సుమా.

2)కన్నె తారకాల, కలగానముతో 2
వెన్నెల చేరుల, ఉయ్యాలలో..
ఓ... ఓ... ఓహో...
వెన్నెల చేరుల, ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా

అవును సుమా ఇది మాయ సుమా
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే సుమా.

3)పూల వాసనల, గాలి తెరలలో
వలపు చీకటుల, వన్నె కాంతిలో - మొత్తము 2 సార్లు
ఆహా... ఆ... ఆ... ఆహా... ఆ... ఆ...
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా

అవును సుమా ఇది మాయ సుమా
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే సుమా.

Album : Keelu Gurram; Starring: Akkineni Nageswara Rao (ANR), Anjali, Relangi; Music : Ghantasala; Lyrics-Tapi Dharma Rao; Singers :Ghantasala; Producer Director: Raja Saheb of Mirzapur; Year: 1949

ఆల్బమ్ : కీలు గుర్రం; నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు (ANR), అంజలి, రేలంగి; సంగీతం : ఘంటసాల; సాహిత్యం-తాపి ధర్మారావు; గాయకులు : ఘంటసాల; నిర్మాత దర్శకుడు: రాజా సాహెబ్ ఆఫ్ మిర్జాపూర్; సంవత్సరం: 1949  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,738; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 16-Jun-2023, Upd Dt : 16-Jun-2023, Category : Songs
Views : 288 ( + More Social Media views ), Id : 1801 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kaadu , suma , kala , Perady , Keelu , Gurram , ANR , Anjali , Relangi , Varalakshmi , Ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content